క్రైమ్/లీగల్

పాత నేరస్థుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, జూన్ 7:గొలు సు దొంగతనాలకు పాల్పడుతున్న పా త నేరస్తులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టే చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా నర్సరావు పేటకు చెందిన కుంకలగుంట సాంబశివరావు, తెనాలికి చెందిన వల్లెపు తిరుపతి కేపీహెచ్‌బీకాలనీలో పెయిటింగ్, కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 4వ తేదిన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీబీసీ ఐడి కాలనీలో వెంగమాంబ అనే మహిళ మెడలోంచి ఆరు తులాల గొలుసు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు.
ఈ క్రమంలో గొలుసు దొంగతనం జరిగిన చోట సీసీ కెమెరాల ఆధారంగా చోరికి వినియోగించిన బైక్ నంబర్ ఆధారంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వీరిలో తిరుపతిరావుపై తెనాలిలో రౌడిషిట్ ఉందని, రెండు హత్య, దోపిడి వంటి కేసుల్లో నింధితుడిగా ఉన్నాడని తెలిపారు. వీరికి తెలిసిన ఓ వ్యక్తి వద్ద బైక్ తీసుకుని సీబీసీ ఐడి కాలనీలో చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి ఆరు తులాల బంగారు అభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసును చాక చక్యంగా వ్యవహరించి నింధితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డు అందజేశారు.