క్రైమ్/లీగల్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 7: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్ బండ్లగూడ తట్టి అన్నారంలో నివసిస్తున్న బసవన్నగారి యతీష్(22) విప్రో సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇదే సంస్థలో పని చేస్తున్న ఓ యువతిని ప్రేమించాడు. నాలుగేళ్ల వీరి ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. ఇంతలో ఆమె మరొక యువకుడితో కలిసి తిరుగుతుండటంతో తీవ్ర మనస్థాపానికి గురైన యతీష్ బుధవారం రాత్రి ఉప్పల్‌లోని హెచ్‌ఎండీఏ లేఔట్‌లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలమైందని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంను చూసి బోరున విలపించారు. తండ్రి నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ పీ.వెంకటేశ్వర్లు తెలిపారు.