క్రైమ్/లీగల్

నకిలీ ఇంజన్ ఆయిల్ తయారీ నిర్వహకుడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, జూన్ 8: జిల్లాలో నకిలీ సరుకులు, కల్తీపాలు, నకిలీ వస్తువులు ప్రజలను వణికిస్తున్నాయి. కల్తీని అరికట్టేందుకు అరకొరగా విజిలెన్స్‌తో పాటు సంబంధిత శాఖలు తనిఖీలు చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. శుక్రవారం తాడిపత్రి, బుక్కరాయసముద్రం, అనంతపురంలో నకిలీ ఇంజన్ ఆయిల్ తయారీ చేసే ముఠాను విజిలెన్స్ ఎస్పీ రామాంజినేయులు పట్టుకొన్నారు. అనంతపురంలోని శ్రీనివాస నగర్‌కు చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి గత పదేళ్లుగా నకిలీ ఇంజన్ ఆయిల్ తయారీని గుట్టుగా సాగించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిందితుడు నుంచీ రూ.40 లక్షల విలువ చేసే నకిలీ ఇంజన్ ఆయిల్‌ను సీజ్ చేశారు. నకిలీ ఆయిల్ మాఫియాక సంబంధించి ఇప్పటి వరకూ ఐదుమందిని అదుపులోకి తీసుకొన్న విజిలెన్స్ అధికారులు వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.