క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుమంట్ర, జూన్ 8: పెనుమంట్ర మండలం భట్లమగుటూరు గ్రామంలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. మృతులిద్దరూ తాపీ మేస్ర్తీలు. వివరాలిలావున్నాయి... గ్రామంలో గంటి భద్రాచలం అనే వ్యక్తి భవన నిర్మాణం చేపట్టారు. మండలంలోని బ్రాహ్మణ చెరువు గ్రామానికి చెందిన గుడ్ల సూర్యనారాయణ (33) ఈ నిర్మాణ పనులకు కొద్ది నెలలుగా తాపీ మేస్ర్తీగా వ్యవహరిస్తున్నారు. పెనుమంట్ర గ్రామానికి చెందిద తోరం చంద్రశేఖర్ (34) గత రెండు రోజులుగా తాపీ మేస్ర్తీగా నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నాడు. కాగా శుక్రవారం సాయంత్రం పిట్టగోడ నిర్మాణం సందర్భంగా ఒక ఇనుప ఊచను మేస్ర్తీలు సూర్యనారాయణ, చంద్రశేఖర్, కూలీపనికి వచ్చిన ఉపేంద్ర కలిసి భవనం పైకి తీసుకెళ్లే ప్రయత్నంచేశారు. ఆ సమయంలో ఊచ సమీపంలోని 11కేవీ విద్యుత్ వైర్లను తాకింది. దీనితో భవన పైభాగంలో ఉన్న చంద్రశేఖర్, కింది భాగంలో ఉన్న సూర్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందారు. మధ్యభాగంలో ఊచను పట్టుకున్న కూలీ ఉపేంద్ర కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఉపేంద్రను గ్రామంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా మెట్లు లేకపోవడంతో భవనం పైభాగంలో ఉండి పోయిన చంద్రశేఖర్ మృతదేహాన్ని కిందకు దించడం కష్టసాధ్యమయ్యింది. రాత్రి సమయానికి ఎట్టకేలకు మృతదేహాన్ని కిందకు దించారు.
మృతుడు సూర్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొంత కాలం గల్ఫ్‌లో ఉపాధి నిమిత్తం ఉండి వచ్చిన సూర్యనారాయణ కొన్ని నెలలుగా స్థానికంగానే తాపీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మరో మృతుడు చంద్రశేఖర్ కొంత కాలం భీమవరంలోని మావుళ్లమ్మ దేవస్థానంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేశాడు. అక్కడ పని మానేసిన అతను కొద్ది రోజులుగా తాపీ పనికి వెళుతున్నాడు. గత రెండు రోజులుగానే భట్లమగుటూరులో భవన నిర్మాణ పనికి వస్తున్నట్టు సమాచారం. కాగా మృతుడు సూర్యనారాయణ కుటుంబ సభ్యులు సంఘటనాస్థలానికి చేరుకుని విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. తన కుమారుడి మృతికి బాధ్యులెవరని సూర్యనారాయణ తండ్రి ఆందోళనకు దిగారు. అయితే మరో మృతుడు చంద్రశేఖర్ తరపుకుటుంబ సభ్యులకు శుక్రవారం రాత్రి వరకు సమాచారం అందలేదు. పెనుగొండ సీఐ ఆర్ విజయకుమార్, పెనుమంట్ర ఎస్సై బాలాజీ సుందరరావు సంఘటనాస్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు.
కాగా ప్రమాద సమాచారం తెలుసుకున్న వైసీపీ నేత చెరుకువాడ శ్రీరంగనాథరాజు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు.