క్రైమ్/లీగల్

లారీ ఢీకొని ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు, జూన్ 8: పీలేరు-తిరుపతి మార్గంలో శుక్రవారం సాయంత్రం లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. సీఐ వేణుగోపాల్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఓడిరెడ్డి (50), జానకమ్మ (45), మనవరాలు చేతన రెడ్డి (5)తో కలిసి చిన్నగొట్టిగల్లు నుంచి పీలేరుకు వస్తుండగా రవాణాశాఖ కార్యాలయం సమీంలో పీలేరు నుంచి తిరుపతి వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఓడిరెడ్డి మృతి చెందగా, జానకమ్మ, చేతనరెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే వీరిని 108 ద్వారా పీలేరుప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చేతనరెడ్డిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించగా, వైద్యం పొందుతూ జానకమ్మ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.