క్రైమ్/లీగల్

చెక్ డ్యామ్‌లో పడి అక్కా చెల్లెళ్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 8: ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెక్ డ్యామ్‌లో పడి అక్కా చెల్లెళ్లు మృతి చెందిన సంఘటన యాదమరి మండలం బొమ్మన చెరువు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. బొమ్మన చెరువుకు చెందిన దొరస్వామికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు వేసవి సెలవులు కావడంతో శుక్రవారం ఉదయం ఆడుకోవడానికి దొరస్వామి ఇద్దరు కుమార్తెలు ఇందు (13), మోనిషా (7) తోటి స్నేహితులతో కలిసి గ్రామం సమీపంలోని చెక్ డ్యామ్ వద్దకెళ్లారు. ఇటీవల కురిసిన వర్షంతో చెక్ డ్యామ్ నీటితో నిండింది. అక్కడ పిల్లలందరూ సరదాగా అడుకొంటుండగా, ఇందు, మోనిషా చెక్ డ్యామ్‌లోకి దిగారు. అందులో అడుగున ఎక్కువగా బురద ఉండటంతో అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ఒక్కసారిగా నీటినిలో మునిగి పోయారు. వీరు బయటకు రావాలని ప్రయత్నించినా బురద కారణంగా వెలుపలికి రాలేక క్రమేణా నీటిలో మునిగి పోయి ఊపి రాడక మృతి చెందారు. అసమయంలో అక్కడ పెద్దలు ఎవ్వరు లేక పోవడంతో విస్తు పోయిన తోటి పిల్లలు అ విషయాన్ని గ్రామంలో చెప్పడంతో , గ్రామస్తులు వచ్చి చెక్ డ్యామ్‌లో గాలించారు. అప్పటికే బురుదలో కూరుకు పోయి నీటిలో మినిగిపోయి విగత జీవులుగా ఉన్న ఇందు, మోనిషా మృత దేహాలను వెలుపలికి తీశారు. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి . సెలవులు లేక పోతే తమ బిడ్డలు బతి ఉండే వారని మరో నాలుగు రోజుల వ్యవధిలో పాఠశాలలు తెరస్తున్న క్రమంలో ఒకే సారి అక్కా చెల్లెళ్లు మృతి చెందటాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు రోదనలు కంటతడి పెట్టించాయి. యాదమరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.