క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదకాకాని, జూన్ 8: మండల పరిధిలోని పెదకాకాని వై జంక్షన్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడిన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కృష్ణాజిల్లా తాడిగడపకు చెందిన కుమార్, సునీత దంపతులు తమ పిల్లలతో మామ బలరాం, డ్రైవర్ వరప్రసాద్ కారుతో తిరుపతి నుండి తిరిగి వస్తుండగా వై జంక్షన్ సమీపంలో ఉదయం ఎదురుగా ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో బలరాం అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి, మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.