బిజినెస్

7.9 శాతానికి వృద్ధిరేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి క్రిసిల్ అంచనా
సాధారణ వర్షపాతం నమోదైతే సాధ్యమే
ఆర్థిక సంస్కరణల అమలు కీలకం
ముంబయి, మార్చి 11: భారత జిడిపి వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో 7.9 శాతంగా ఉండొచ్చని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ శుక్రవారం అంచనా వేసింది. అయితే సాధారణ వర్షపాతం నమోదై, ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సంస్కరణలు అమలైతేనే ఈ వృద్ధిరేటు సాధ్యమని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ఈ స్థాయిలో భారత వృద్ధిరేటును ఎవరూ అంచనా వేయలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా 7-7.75 శాతంగానే అంచనా వేసింది. ఈ క్రమంలో వర్షాలు సమృద్ధిగా పడి వ్యవసాయ రంగం వృద్ధి చెందితే 7.9 శాతం జిడిపి వృద్ధిరేటు అందుకోవచ్చని క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకీర్తి జోషి అన్నారు. వరుసగా గడచిన మూడేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా 2014, 2015 సంవత్సరాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు భారత పురోగతికి బ్రేకులు వేశాయనే చెప్పాలి. ఈ క్రమంలో ఈసారి సాధారణ వర్షపాతం నమోదైనా వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధి సాధ్యపడుతుందని క్రిసిల్ చెబుతోంది. కాగా, మోదీ సర్కారు ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తే, ప్రస్తుతం మొండి బకాయిలతో బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని, 2016-17లో అధిక వృద్ధిరేటును అందుకోవచ్చని జోషి అన్నారు. అంతర్జాతీయంగా ఇప్పుడు తక్కువ ధర పలుకుతున్న చమురు ఉత్పత్తులతో పడిపోయే భారత దిగుమతుల భారం.. దేశ ఆర్థిక లోటు, స్థూల ఆర్థిక గణాంకాలను దారిలో పెడతాయన్నారు. అయితే ఇప్పటివరకు కేంద్రంలోని మోదీ సర్కారు ఏవైతే సంస్కరణలు అమలు చేస్తామని చెప్పిందో వాటిని తప్పకుండా, త్వరితగతిన ఆచరణలో పెట్టాల్సిన అవసరం చాలా ఉందని స్పష్టం చేశారు. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం గత నెల 29న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్ వృద్ధి, ఆదాయ లక్ష్యాలను జోషి స్వాగతించారు. ఇకపోతే ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలకు చేరిన నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా బ్యాంకర్లకు మొండి బకాయిల తిప్పలు తప్పవని జోషి అన్నారు.