జాతీయ వార్తలు

పదివేల ఇళ్లు.. చీర, దోవతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాట రైతులకు పంట నష్టం భర్తీ
ఇళ్లను కోల్పోయిన వారికి రూ. 10వేలు
ముఖ్యమంత్రి జయలలిత ప్యాకేజీ
చెన్నై, డిసెంబర్ 7: తమిళనాడు వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం ఓ సమగ్ర ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో భాగంగా 10వేల ఇళ్లను నిర్మిస్తామని బాధితులకు ఐదు వేల నుంచి పదివేల వరకూ సహాయాన్ని అందిస్తామని, పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందిస్తామన్నారు. వరదలు, వర్షాలకు గుడిసెలు కోల్పోయిన వారికి తక్షణ ప్రాతిపదికన 10వేలు అలాగే ముంపునకు గురైన వారికి ఐదు వేలు చెల్లిస్తామని జయలలిత చెప్పారు. బాధిత కుటుంబాలకు పది కిలోల బియ్యం, ఒక దోవతి, ఒక చీర అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇళ్లను కోల్పోయిన వారికి శాశ్వత ఇళ్లను నిర్మిస్తామని, తాత్కాలికంగా చెన్నైలో పదివేల ఆవాసాలను సమకూర్చుతామని చెప్పారు. వరద బాధితులకు తగిన సాయం అందడం లేదని ప్రతిపక్షనేత కరుణానిధి విమర్శించిన నేపథ్యంలో ఆమె ఈ ప్యాకేజీని ప్రకటించడం గమనార్హం. సహాయం మొత్తాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని అన్నారు. తక్షణం వరద బాధితుల వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ జాబితా పూర్తయితే ఆర్థిక సహాయం, ఇతరాత్ర సమకూర్చే ప్రయోజనాలు బాధితులకు అందజేయవచ్చని, ఎన్ని గుడిసెలు కొట్టుకుపోయాయో తెలిస్తే వాటి స్థానంలో శాశ్వత నివాసాలు నిర్మించవచ్చని చెప్పారు. అడయార్, కూయిం నదులు, బకింగ్‌హం కెనాల్ ఒడ్డున నివసిస్తున్న వారికోసం 10వేల తాత్కాలిక గృహాలు నిర్మించాలని జయ ఆదేశించారు. ఆవులు, గేదెలు కోల్పోయినవారికి 30 వేలు, గొర్రెలు, పందులు కోల్పోయిన వారికి 3వేలు, కోళ్లను కోల్పోయిన వారికి వంద చొప్పున చెల్లిస్తామని అన్నారు. అలాగే వరి, ఇతర పంటలు నష్టపోయిన వారికి హెక్టారుకు 13,500 రూపాయల చొప్పున చెల్లిస్తామని జయ ప్రకటించారు. (చిత్రం) కొట్టాపురంలో అందిస్తున్న సహాయ సామగ్రికోసం గుమికూడిన బాధితులు