జాతీయ వార్తలు

చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ సాంస్కృతికోత్సవంతో జీవనోపాధి కోల్పోయాం
యుమునా నది పరీవాహక ప్రాంత కౌలు రైతుల ఆవేదన
న్యూఢిల్లీ, మార్చి 14: ప్రపంచ సాంస్కృతికోత్సవం కోసం తమ పంట భూములను ధ్వంసం చేశారని, దీంతో తమ జీవనోపాధి దెబ్బతిన్నదని యమునా నది పరీవాహక ప్రాంతంలోని రైతులు లబోదిబోమంటున్నారు. చదును చేసిన పరీవాహక ప్రాంతం తిరిగి వ్యవసాయ యోగ్యంగా మారాలంటే కనీసం రెండేళ్లు పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పండిట్ రవిశంకర్ నేతృత్వంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రపంచ సాంస్కృతికోత్సవం ముగియడంతో ఈ ఉత్సవం నిర్వహించిన వందకుపైగా ఎకరాలలో అధికారులు వ్యర్థ పదార్థాలను తొలగించే పనులు చేపట్టారు. నిర్వాహకులు తమకు చెల్లించిన నష్టపరిహారం చాలా స్వల్పమని, అయితే ఈ కార్యక్రమ నిర్వహణ వల్ల యమునా నదీ పరీవాహక ప్రాంతంలో పర్యావరణం తీవ్రంగా దెబ్బతిన్నదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుల్డోజర్లతో భూమిని చదును చేయడం వల్ల పరీవాహక ప్రాంతం దెబ్బతిని, నదిలోకి నీటి ప్రవాహ మార్గాలు ధ్వంసం అయ్యాయని వారు పేర్కొన్నారు. తన 12 బిఘాల భూమిలోని చేతికొచ్చిన కూరగాయలు, పూలతోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, తనకు నష్టపరిహారంగా చాలా తక్కువ మొత్తం చెల్లించారని ఛోటేలాల్ అనే 50 ఏళ్ల రైతు వాపోయారు. ఒక్కో బిఘాలోని పంట వల్ల తనకు రూ. 50వేల చొప్పున ఆదాయం వచ్చేదని, కాని తనకు కేవలం రూ. పది వేల పరిహారం అందజేశారని ఆయన లబోదిబోమంటున్నాడు. తన అయిదు బిఘాల భూమిలో పంటను జెసిబిలతో ధ్వంసం చేశారని కమలాదేవి అనే మహిళా రైతు వాపోయారు.
‘ఒకవైపు ఆనందాన్ని, మనశ్శాంతిని వ్యాప్తి చేస్తున్నామని చెబుతున్న మీరు మా జీవితాలలోని ఆనందాన్ని, శాంతిని మరచిపోయారు. మా జీవనోపాధిని దెబ్బతీశారు’ అని ఆమె ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌పై మండిపడ్డారు. (చిత్రం) ప్రపంచ సాంస్కృతికోత్సవం ముగియడంతో యమునా నది ఒడ్డున కనిపిస్తున్న దృశ్యమిది