తెలంగాణ

తెరాస అభ్యర్థులకు అగ్నిపరీక్షే !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంటాడుతున్న క్రాస్ ఓటింగ్ బెడద
ఎమ్మెల్సీ ఫలితాలపై నేతల్లో ఉత్కంఠ
కాంగ్రెస్ నేతల్లో పెరిగిన ధీమా
అంచనాలతో మునిగి తేలుతున్న నేతలు

మహబూబ్‌నగర్, డిసెంబర్ 28: రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈ నెల 30వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ పడ్డ తెరాస అభ్యర్థులకు పోలింగ్ అనంతరం క్రాస్ ఓటింగ్ జరిగిందనే అనుమానం, బెడద వెంటాడుతోంది. ఎవరినోట విన్న క్రాస్ ఓటింగ్ జరిగిందనే పుకార్లు ఆనోట ఈనోట తెరాస అభ్యర్థుల వరకు చేరడంతో వారు ఫలితాలపై ఉత్కంఠ కు గురవుతున్నట్లు సమాచారం. క్యాంపు రాజకీయాలు నిర్వహించినప్పటికీ పోలింగ్ తర్వాత వస్తున్న గాలి వార్తలు అభ్యర్థులను మాత్రం కలవరానికి గురి చేస్తున్నాయ. తమ పార్టీకి సంబంధించిన ఓటర్లను రెండు విభాగాలుగా తెరాస నాయకులు విభజించుకుని పోలింగ్‌లో పాల్గొన్నారు. అందులో భాగంగా తెరాస అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి కి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కొన్ని నియోజకవర్గాలు కేటాయించగా అదేవిధంగా మరో అభ్యర్థి జగదీశ్వర్‌రెడ్డికి మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గంలోని ఓటర్లను కేటాయించారు. అయితే వస్తున్న పుకార్లు షికార్లు మాత్రం మరోలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా తెరాస నాయకులకు తెలియకుండా అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి కొన్ని ఓట్లను క్రాస్ ఓటింగ్ చేయించుకున్నారని తెరాస నాయకులే బహిరంగంగా చర్చించుకోవడం గమనార్హం. జగదీశ్వర్‌రెడ్డి అనుచరులు మాత్రం అలాంటి ఏమీ జరగలేదని, ఇవన్నీ గాలి పుకార్లు అంటూ కొట్టి పారేస్తున్నారు. మరో 24 గంటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తెరాసకు మాత్రం ఈ ఫలితాలు అగ్నిపరీక్షగానే మారనున్నాయని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రెండు స్థానాలకుగాను కేవలం ఒక స్థానానికి మాత్రమే పోటీ పడ్డ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎనలేని ధీమాతో ఉన్నారు. పోలింగ్ తర్వాత లెక్కలు వేసుకుంటూ తమ అభ్యర్థి తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెరాస నుండి కూడా తమకు క్రాస్ ఓటింగ్ జరిగిందని పలువురు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కుచుకుళ్ల దామోదర్‌రెడ్డి అనుచరుల్లో మెండుగా గెలుపు ధీమా కనబడుతోంది. కాంగ్రెస్, టిడిపి, బిజెపి ఓట ర్లు మూకుమ్మడిగా కాంగ్రెస్ అభ్యర్థి కుచుకుళ్ల దామోదర్‌రెడ్డికి వేశారని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా తెరాస శిబిరానికి వెళ్లిన వారిలో కూడా కొంతమంది తమకు ఓటు వేశారని కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. ఓ పక్క తెరాస నాయకుల్లో ఈ ఫలితాలు తమ పార్టీకి జిల్లా నాయకత్వానికి అగ్ని పరీక్ష అని భావిస్తుండగా కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎనలేని ధీమాతో ఉన్నారు. టిడిపి అభ్యర్థి దయాకర్‌రెడ్డి మాత్రం ఫలితాలపై విశే్లషించుకుంటూ తమకు కూడా అనుకులమైన వాతావరణం ఉందని తెరాసలో క్రాస్ ఓటింగ్ జరిగినందున తమకు అనుకూలంగా ఫలితం ఉం టుందని టిడిపి నాయకులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఓటర్లు క్రాస్ ఓటింగ్ చేశారో లేదో కానీ జిల్లాలో మాత్రం తెరాస నాయకుల్లో ఈ చర్చ కొనసాగుతుండడం ఆ పార్టీ అభ్యర్థులకు ఒకింత ఉత్కంఠకు గురిచేస్తోంది.
1260 ఓట్లకుగాను 1256 ఓట్లు పోల్ కాగా ఈ ఎన్నికల్లో 33.3 శాతం ఓట్లు సాధించిన వారిని ప్రాధాన్యత క్రమంలో గెలుపును అధికారులు ప్రకటించనున్నారు. గెలుపు కావాలంటే దాదాపు 420 ఓట్లు దాటిన వారికి ఫలితాలు అనుకూలంగా ఉండవచ్చని నాయకులు అంచనాలు వేసుకుంటూ లెక్కలు వేసుకుంటున్నారు.