ఆంధ్రప్రదేశ్‌

పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని సెల్‌టవర్ ఎక్కిన విద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కులాల ప్రస్తావన లేకుండా పేదవాళ్లందరికీ విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రవితేజ అనే విద్యార్థి బుధవారం ఇక్కడి గుణదలలో సెల్‌టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. దీంతో అతడిని కిందికి దింపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడాకే తాను కిందికి దిగుతానని రవితేజ సెల్‌టవర్ నుంచి ఓ లేఖను కిందకు పడేశాడు.