చిత్తూరు

స్విమ్స్‌లో అగ్నిమాపక నిరోధక పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 22: రోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్విమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాద నిరోధక ఏర్పాట్లకు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి ఎస్ రవికుమార్ శ్రీకారం చుట్టారు. ఈనేపథ్యంలో గురువారం ఫైర్‌ఫైటింగ్ సిస్టమ్ ఇన్సులేషన్ పనులకు పూజలు నిర్వహించి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన మెడ్‌లీ ఫైర్ సిస్టమ్ కంపెనీ స్విమ్స్‌లో ఫైర్ ఫైటింగ్‌సిస్టమ్ ఇన్సులేషన్ పనులను ఆ సంస్థ అధికార ప్రతినిధి సివి సుబ్బారావు నేతృత్వంలో నిర్వహిస్తున్నామన్నారు. ఏ సంస్థకైనా ముఖ్యంగా వైద్య సంస్థలకు అగ్నిప్రమాద నిరోధక ఏర్పాట్లు అవసరమన్నారు. ఎందుకంటే అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలోచికిత్స పొందుతున్న రోగులు ఏదైనా ప్రమాదం జరిగినపుడు అగ్నిప్రమాదం నుంచి బయటపడటం వారికి ఇబ్బందిగా మారుతుందన్నారు. అందుకే ప్రతి ఆసుపత్రిలోనై వైద్య సిబ్బందికి అగ్నిప్రమాదం జరిగినపుడు రోగులను ఎలా సంరక్షించాలో ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలన్నారు. అందుకే స్విమ్స్ ఆసుపత్రిలో అన్నివిభాగాల్లో పనిచేసే సిబ్బందికి ఈ ఫైర్ పైటింగ్ సిస్టమ్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ డిసి ఎం ప్రసాద్, ఎం ఎస్ ఓ డాక్టర్ బి.సత్యనారాయణ, ఎస్ సి రాములు, ఇ ఇ జగదీశ్వర్‌రెడ్డి, డి ఇ మనోహర్‌రావు, ఎ ఇ మురళి, ఎలక్ట్రికల్ ఎ ఇ సుబ్రహ్మణ్యరాజు, స్విమ్స్ ఎ ఇ కుమార్, ఆర్ ఎం ఓ డాక్టర్ కోటిరెడ్డి, డెప్యూటి డైరెక్టర్ పి ఆర్ డాక్టర్ వెంకటరామరెడ్డి, పి ఆర్ ఓ రాజశేఖర్, ఎంసిబివో సుందర్శన్, ఎం ఎస్ డబ్ల్యూ ఓ ప్రసాద్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ బి. సురేష్ పాల్గొన్నారు.