చిత్తూరు

24న రేషన్ మేళా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, సెప్టెంబర్ 22: జిల్లా వ్యాప్తంగా శనివారం తహశీల్దార్ కార్యాలయాల్లో రేషన్‌మేళా కార్యక్రమం నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా ఆదేశించారు. గురువారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో సివిల్‌సప్లై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్ షాపుల్లో నెలకొన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ఈమేళాలో తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మార్పులు, చేర్పులు రేషన్ కార్డులో పొరబాటును సరిదిద్దే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీపం పథకం కింద లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే విధంగా చొరవ చూపాలన్నారు. ఈ పథకం వందశాతం విజయవంతం అయ్యే విధంగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి అర్హులైన ప్రతిలబ్ధిదారునికి దీపం పథకంకింద గ్యాస్ కనెక్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఆరు నెలలుగా 30వేల కార్డుదారులు చౌక దుకాణాల నుంచి బియ్యం తీసుకోవడం లేదని అసలు ఈ కార్డుదారులు ఉన్నారా లేరా అన్న విషయాన్ని మండలాల వారీగా తనిఖీచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 11వేల మంది కుష్టు రోగులు ఉన్నారని అందులో 4వేల మంది మాత్రమే గతనెల బియ్యం తీసుకున్నారని మిగిలిన ఏడువేల మంది పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని తెలిపారు. డీలర్ షాపుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కాజల్ వెబ్‌సైట్‌ను రూపొందించిందని దీనిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ వెబ్‌సైట్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ తదితర వివరాలను తక్షణమే తెలుసుకునే అవకాశం ఉందని ప్రతి తహశీల్దార్ దీనిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల పంపిణీ వ్యవహారంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం జరిగే రేషన్‌మేళాలో తహశీల్దార్లతోపాటు సివిల్ సప్లై అధికారులు విధిగా పాల్గొని విజయవంతం అయ్యేవిధంగా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో డిఎస్‌వో నాగేశ్వర్‌రావు, పలువురు రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.