చిత్తూరు

తిరుపతి కమాండ్ కంట్రోల్‌ను తనిఖీచేసిన డిజిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 25: రాష్ట్ర డిజిపి సాంబశివరావు ఆదివారం తిరుపతి కమాండ్ కంట్రోల్‌ను తనిఖీచేశారు. కొద్దిరోజుల్లో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఈ సందర్భంగా డిజిపి సూచించారు. వీలైనంత వరకు సిసి కెమెరాలను అవసరమైన ప్రదేశాలలో ఏర్పాటుచేయాలని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలను సిసి కెమెరాల ద్వారా చూసి పరిష్కరించి, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వారిని గుర్తించి వారికి జరిమానా విధించేవిధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ-చలానా, ఆన్‌లైన్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు. ఇంతవరకు కమాండ్ కంట్రోల్‌లో సిసి కెమెరాల ద్వారా పరిష్కరించిన కేసుల వివరాలను అర్బన్ ఎస్పీ జయలక్ష్మిని అడిగి తెలుసుకొని వారికి తగిన సూచనలు చేశారు. ఫొటో గ్యాలరీలను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఐజి శ్రీ్ధర్‌రావు, అనంతపురం డిఐజి ప్రభాకర్‌రావు, అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, ట్రాఫిక్ డిఎస్పీ, ఈస్ట్ డిఎస్పీ, ఎస్సీ, ఎస్టీ సెల్ డిఎస్పీ, మహళా డిఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.