చిత్తూరు

నేడు జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 1: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం తిరుపతికి రానున్నారు. 3 రోజుల పాటు ఆయన జిల్లా పర్యటన చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సిద్దార్థ్‌జైన్ శనివారం ఒక ప్రకటనలోతెలిపారు. ఆదివారం ఉదయం విజయవాడనుంచి బయలుదేరి 11.05 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మహతి ఆడిటోరియంకు చేరుకుంటారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని మహతిలో నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఓడిఎఫ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బహిరంగ మలవిసర్జనలేని గ్రామాల సర్పంచులను ఈకార్యక్రమానికి ఆహ్వానించారు. 100 శాతం మరుగుదొడ్లు పూర్తిచేసిన గ్రామాలకు చెందిన సర్పంచులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అనంతరం 3.30 గంటలకు ఎస్వీయూ తారకరామాస్టేడియంలో కోటిన్నరమంది కార్మికులకు ప్రయోజనం కల్పించేవిధంగా చంద్రన్న బీమా పథకంను లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంరతం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తారకరామా స్టేడియం నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేకవిమానంలో హైదరాబాద్ వెళతారు. 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 5.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన తిరుమల పద్మావతి అతిథిభవనం చేరుకుంటారు. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరపున రాత్రి 7.40గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు తీసుకొని ఆలయంలోకి వెళ్లి అర్చకులకు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి తిరుమలలోనే బసచేసి 4వ తేదీ ఉదయం 7.15 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి ఉదయం 8.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరి వెళతారు.

కమ్యూనిస్టుల ముందుస్తు అరెస్ట్

శ్రీ కాళహస్తి, అక్టోబర్ 1: తిరుపతిలో శనివారం జరిగిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సభను అడ్డుకుంటారనే అనుమానంతో పోలీసులు సిపి ఐ, సిపిఎం నాయకులను ముందస్తుగా అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించినందుకు కృతజ్ఞతగా బిజెపి ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలో సభ జరగడం తెలిసిందే. ఈ సమావేశానికి వచ్చే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు శుక్రవారం రాత్రే సిపి ఐ,సిపి ఎం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీ కాళహస్తిలో సిపి ఎం నాయకుడు పుల్లయ్య, సిపి ఐ నాయకుడు గురవయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా తిరుపతికి చెందిని సిపిఎం జిల్లా మాజీ కార్యదర్శి కందారపు మురళిని పోలీసులు అరెస్ట్‌చేసి శ్రీ కాళహస్తి వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేఖంగా పోలీస్‌స్టేషన్‌లోనినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. బిజెపి సభ ముగిసిన తరువాత పోలీసులు కమ్యూనిస్టునాయకులను వదిలిపెట్టారు.
అక్రమ అరెస్ట్‌కు నిరసనగా
కేంద్రమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం
రేణిగుంట: సిపిఎం నాయకుల అక్రమ అరెస్టుకు నిరసనగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మను సిపిఐ నాయకులు శనివారం ఉదయం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు దగ్ధం చేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ర్యాలీ సంరదర్భంగా ప్రత్యేక హోదా విషయంలో సిపిఎం ఎక్కడ అడ్డుకుంటుందోనని ముందస్తుగా పోలీసులు తెల్లవారుజామున కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను అరెస్టుచేయగా ఇందుకు నిరసనగా సిపిఎం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం ముందు కేంద్రమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి వెంకయ్యకు అపూర్వ స్వాగతం
రేణిగుంట, అక్టోబర్ 1: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్యనాయుడుకు విమానాశ్రయంలో అపూర్వస్వాగతం లభించింది. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి రేణిగుంట పాత విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆయనకు రాష్టమ్రంత్రులు గోపాలకృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాసరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎంపి శివప్రసాద్, ఎమ్మెల్యేసుగుణమ్మ, ఎమ్మెల్సీ శ్రీనివాసు, బిజెపి నాయకులు శాంతారెడ్డి, కోలా ఆనంద్, సామంచి శ్రీనివాస్, భానుప్రకాష్‌రెడ్డి, చంద్రారెడ్డి విమానాశ్రయం వెలుపల ఘన స్వాగతం పలుకుగా పాతవిమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ వాహనంలో మంత్రి ర్యాలీగా బయలుదేరగా 500 మంది యువకులు మోటార్ సైకిళ్లు, 500 వాహనాలు కలిసి భారీ ర్యాలీగా రేణిగుంట మీదుగా తిరుపతికి బయలుదేరి వెళ్లారు.

నీటి తొట్టెలో పడి బాలుడు మృతి
రొంపిచెర్ల, అక్టోబర్ 1: మండలంలో నీటి తొట్టెలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. మండలంలోని మోటమల్లెల పంచాయతీ, బాలనాగిరెడ్డిగారిపల్లెకు చెందిన రాజశేఖర్ కుమారుడు ఒకటిన్నర ఏళ్ల పూజిత్ ప్రమాదవశాత్తూ పశువుల నీటితొట్టెలో పడిపోయాడు. అరగంట తరువాత తల్లి సరసమ్మ తన కుమారుడి కోసం వెతికగా,పూజిత్ తొట్టెలోపడి చనిపోయి తెలుతూ ఉన్నాడు. మరణించిన బిడ్డనుచూసి సరసమ్మ భోరున విలపించింది. పూజిత్ తండ్రి బతుకు దేరువుకోసం రెండు నెలల క్రితం కువైట్ వెళ్లాడు. బాలుడు మృతిపట్ల గ్రామంలో విషాదం అలుముకుంది.