చిత్తూరు

ఇయుపిహెచ్‌సిలపై సిబ్బందికి అపోహలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 1: ఇక అపోలో ఆసుపత్రి సహకారంతో ప్రాథమిక వైద్యకేంద్రంలో ఎలక్ట్రానిక్ అర్బన్ ప్రైమరీ హెల్త్‌కేర్‌సెంటర్ ( ఇయుపిహెచ్‌సి) కేంద్రాన్ని ప్రారంభించడం వల్ల పిహెచ్‌సిలో పనిచేసే సిబ్బంది ఉద్యోగాలకు ఇబ్బంది వస్తుందని అపోహ మాత్రమేనని అలాంటిదేమీ జరగదని రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. శనివారం స్థానిక బైరాగిపట్టెడ ప్రాంతంలో ఉన్న మునిసిపల్ పాఠశాలకు అనుసంధానంగా ఉన్న ప్రాథమిక వైద్యకేంద్రంలో ఎలక్ట్రానిక్ అర్బన్ ప్రైమరీ హెల్త్‌కేర్‌సెంటర్ ( ఇయుపిహెచ్‌సి) కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ సిఇఓ విక్రమ్‌తాప్లూ మాట్లాడుతూ తాము ఏర్పాటుచేసే ఈ కేంద్రాల ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదల ఆరోగ్య అవసరాలేకాకుండా నగర, పట్టణాల్లో ఉన్న నిరుపేదల ఆరోగ్య అవసరాలు తీర్చతీరుస్తాయని అన్నారు. ఈ మూడేళ్లలో 13.2 మిలియన్ల మంది ప్రజలు అంటే 20 శాతం మందికి వైద్యసేవలు అందించాలని తాము భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి ఆలోచనకు సర్వీస్ ప్రొవైడర్‌గా అపోలో ఆసుపత్రి టెండర్లు దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అపోలో ఆసుపత్రి చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఇది ఒక భాగమన్నారు. దేశంలో మరికొన్నిరాష్ట్రాల్లో కూడా ఇలాంటి వాటిని ఏర్పాటుచేస్తామన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే సుగుణమ్మ, బిజెపి ఎంపి కంభంపాటి హరిబాబు, స్విమ్స్‌డైరెక్టర్ రవికుమార్, ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిలప్ శ్రీ్ధర్, డి ఎం అండ్ హెచ్ ఓ విజయగౌరి, నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ ఉషాకుమారి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.