చిత్తూరు

టిటిడి సర్వశ్రేయ ట్రస్టుకు రూ.1.50 కోట్లు విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 3: టిటిడి సర్వశ్రేయ ట్రస్టుకు సోమవారం రూ.1.50 కోట్లు విరాళంగా అందింది. ముంబయ్‌కు చెందిన విమల్ దిలీప్‌షా అనే భక్తుడు ఈ మేరకు డిడిని అందించారు. తిరుమలలోని దాతల విభాగంలో డిప్యూటీ ఇఓ రాజేంద్రుడు ఈ విరాళం స్వీకరించారు.

లడ్డూ కౌంటర్లను పరిశీలించిన ఇఓ
తిరుమల, అక్టోబర్ 3: తిరుమలలోని లడ్డూ కౌంటర్లను టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు సోమవారం పరిశీలించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 7 లక్షల లడ్డూలు నిల్వ ఉంచుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. శ్రీవారి సేవకులు సేవలందిస్తున్న కౌంటర్లను ఆయన పరిశీలించారు. భక్తులకు మరింత మెరుగైన సేవలందించాలని సేవకులకు సూచించారు.

బ్రహ్మోత్సవాలకు సప్తగిరి ఎక్స్‌ప్రెస్ నూతన బస్సులు ప్రారంభం
తిరుపతి, అక్టోబర్ 3: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఏపిఎస్ ఆర్‌టిసి వారు నూతనంగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సులను ఏర్పాటు చేశారు. ఈ నూతన బస్సు సర్వీసులను ఆర్టీసీ నెల్లూరు ఇడి రవీంద్రబాబు, తిరుపతి ఆర్‌ఎం నాగశివుడు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అలిపిరి డిపో మేనేజర్ పార్ధసారథి, యూనియన్ నాయకులు అవుల ప్రభాకర్, మస్తాన్, కెవిడి రెడ్డి, జ్యోతి యాదవ్, శ్రీనివాసులు, భాస్కర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.