చిత్తూరు

ఆంధ్రప్రదేశ్‌ను దోమల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 4: ఆంధ్రప్రదేశ్‌ను దోమలరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేస్తున్నామని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సత్యప్రకాశ్ ఠక్కర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం తిరుమలలో జరిగిన హంస వాహన సేవలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దోమల రహిత రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రణాళికాబద్ధంగా ఒక్కో కార్యక్రమాన్ని అమలుచేస్తున్నామని అన్నారు. ఇందులోభాగంగా బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ప్రకటించామని, ఇందులో భాగంగా మొదట అర్బన్ ప్రాంతాల్లో ఆపై రూరల్ ప్రాంతాల్లో విరివిగా మరుగుదొడ్లు నిర్మిస్తామని తెలిపారు. వీటి నిర్మాణంలో ఏడాదికి 10 నుంచి 15 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకొని నాలుగు సంవత్సరాలలో నిర్మాణ కార్యక్రమం పూర్తిచేస్తామని అన్నారు. అలానే ఘన మరియు ద్రవ వ్యర్థాలు మట్టిలో కలిసి దోమల బెడదకు కారణమవుతున్నాయని వీటిని నివారించి అదే మట్టిని సారవంతం చేసేందుకు అవసరమైన రసాయనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు అమరావతిలో విధులు నిర్వర్తించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నుండి పనిచేసేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తున్నామని, అయితే పూర్తిస్థాయిలో ఉద్యోగులు ఇక్కడకి వచ్చి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.