చిత్తూరు

శ్రీవారి బ్రహ్మోత్సవాల తొలిరోజు కోటీ 78 లక్షల భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 4: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకల ద్వారా కోటి 78లక్షలా 60వేల రూపాయల ఆదాయం లభించినట్లు టిటిడి పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్జిత సేవల టిక్కెట్‌ల విక్రయాల ద్వారా రూ.37,500 వేలు, ఇక ప్రసాదాల విక్రయం ద్వారా రూ.33లక్షలా 5వేల 990 రూపాయలు ఆదాయం లభించింది. కాగా 32,105వేల మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 34,994 వేల మంది ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లగా 42వేలా 31 మంది తిరుమల నుంచి ఆర్టీసీ బస్సులో కిందకు ప్రయాణం చేశారు. 29.93లక్షల గ్యాలన్ల నీరు వినియోగం జరిగింది. 3వేల 244 మంది శ్రీవారి సేవకులు సేవలందించారు. 4,177 వేల మంది భక్తులు టిటిడి వైద్యసేవలు అందుకున్నారు. 2లక్షలా 32వేలా 8 లడ్లు భక్తులకు విక్రయించారు. 37వేల చిన్నలడ్లను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. వసతి సౌకర్యం కల్పించడం ద్వారా 1కోటి 63లక్షలా 6వేల 950 రూపాయలు టిటిడికి ఆదాయం లభించింది.
అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చిన భక్తులను సాంస్కాతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయ. మంగళవారం సాయంత్రం లక్ష్మీసువర్ణ, మల్లేశ్వరావుబృందంచే మంగళధ్వని, తిరుమల వేద పాఠశాల విద్యార్థులచే నిర్వహించి చతుర్వేద పారాయణ, వాణి బృందంచే నిర్వహించిన విష్ణు సహస్తన్రామం, సముద్రాల శఠగోపాచార్యుల ధార్మిక ప్రవచనం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే చెన్నైకు చెందిన అరుణప్రభ బృందంచే మృదుమధురంగా ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు, అలాగే కడైనల్లూరు రాజగోపాలునిచే నామసంకీర్తన, అన్నమాచార్యప్రాజెక్టు కళాకారులు వి. రఘునాథ్ బృందం సంకీర్తన ఆలాపన, కదిరికి చెందిన నాగమణి భాగవతార్ హరికథాగానం హైలెట్‌గా
నిలిచాయి. అలాగే ఆస్థానమండపంలో తిరుపతికి చెందిన రవిచంద్ర, మంజుల బృందం భక్తి సంగీత కార్యక్రమం కూడా ఆహుతులను అలరించింది.
గరుడ వాహనం రోజున శ్రీవారికి ప్రత్యేక గొడుగు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ రోజున శ్రీవారికి కానుకగా చెన్నైకు చెందిన ప్రత్యేక గొడుగులను ఈ ఏడాదికూడా హిందూ ధర్మార్థ సమితి దాతలు అందించనున్నారు. దీనికి సంబంధించి చెన్నై నుంచి ఈ ప్రత్యేక గొడుగులు అక్టోబర్ 1వ తేదీ ఊరేగింపుగా ప్రారంభమై ఈనెల 6న తిరుమల చేరుకోనున్నాయి. అయితే సదురు సంస్థకు చెందిన దాతలు స్వచ్ఛందంగా శ్రీవారికి కానుకగా సమర్పిస్తున్న గొడుగుల మాత్రమే కాని ఇందులో టిటిడి ప్రమేయం ఎంతమాత్రం లేదు. కనుక భక్తులు కూడా ఈ విషయాన్ని గమనించి చెన్నై నుంచి తిరుమలకు గొడుగులు ఊరేగింపుగా చేరుకునే క్రమంలో ఎటువంటి కానుకలుగానీ, డబ్బులు గానీ సదరు సంస్థకు సమర్పించరాబడదని తెలిపారు. ఈ కానుకలు టిటిడి నిధులకుగానీ, శ్రీవారి హుండీలో కానీ జమచేయబడదని భక్తులు గ్రహించాలని తెలిపారు. ప్రత్యేకంగా చెన్నై పోలీసు యంత్రాంగంపై తెలిపిన విషయాలను గమనించి భక్తులు విరాళాలు , కానుకలను ఊరేగింపు సమయంలో చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.