చిత్తూరు

నేడు గరుడసేవ సందర్భంగా శ్రీవారి క్షేత్రం అష్టదిగ్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 6: కలియుగ నాథుడు శ్రీహరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 7.30 గంటలకు జరుగనున్న గరుడసేవకు శ్రీవారి క్షేత్రాన్ని అధికారులు అష్టదిగ్బంధం చేశారు. జి ఎన్ సి టోల్ గేట్ మొదలుకొని ఆలయ తిరుమాడ వీధుల వరకు అన్ని ప్రవేశ నిష్క్రమణ మార్గాలలో సిబ్బందిని మోహరించి ఆంక్షలు విధించారు. మాడ వీధులలోని గ్యాలరీలలోకి భక్తులను అనుమతిస్తూనే బస్టాండ్, పార్కింగ్ స్థలాల నుంచి మాడవీధుల ప్రవేశమార్గాల వరకు చేరుకునే అన్ని దారులను అష్టదిగ్బంధం చేశారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలను జిఎన్‌సి టోల్‌గేటు వద్ద ఎడమ వైపునకు, ఆర్టీసీ బస్సులను కుడి వైపునకు మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షల ప్రకారం ఇది సరైన నిర్ణయమే. ప్రైవేటు వాహనాలలో వచ్చే భక్తులను ఎడమ వైపునకు మళ్లించి, ఆలయం చేరుకునే దారుల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేశారు. ఇలా ముందు వచ్చిన వారికి ఆలయానికి సమీపంలో పార్కింగ్ స్థలం దొరుకుతుంది. దీంతోవారు సులువుగా గ్యాలరీల వైపుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఆలయం సమీపం నుంచి జి ఎన్ సి వరకు ఉన్న పార్కింగ్ స్థలాలు ఒక్కొక్కటిగా నిండుతూ చివరకు టోల్ గేట్ వద్దనే వాహనాలను నిలపివేసే పరిస్థితి ఏర్పడుతోంది. ఎక్కడో దూరంగా వాహనాలు పార్కుచేసినా అటు తరువాత వారు కాలినడకన గ్యాలరీలకు రావడానికి కొంత సమయం పట్టడంతో అప్పటికే గ్యాలరీలు నిండిపోయి ఉంటాయి. మరోచోట్లో ఉత్తర, దక్షణ, పడమర మాడవీధుల్లో వెళ్లదామనుకున్నప్పటికీ వీరు వెళ్లే సమయానికి అక్కడకూడా గ్యాలరీలు నిండిపోయే పరిస్థితి కనబడుతోంది. దీంతో వాహన సేవను చూడటానికి వచ్చే భక్తులు తిరుమలలో చుట్టుకుంటూ రావడానికే ఉన్న పుణ్యకాలం పూర్తయిపోతుంది. కొంత మంది భక్తులు వాహనాలు చూడలేక నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం వస్తున్న రద్దీ ఒక మోస్తారుగా ఉన్నా శుక్రవారం నాటి గరుడసేవకు 3లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి ఎదురైతే ఇక భక్తులు గోడు ఆ వెంకనే్న ఆలకించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇలా నడిచి నడిచి విసిగిపోయిన భక్తులు ప్రవేశమార్గాల వద్ద ఉన్న సిబ్బందిని ప్రశ్నిస్తే వారు కూడా అలిసిపోయి ఉండటంతో భక్తుల పట్ల అసహనంగా వ్యవహరిస్తున్నారు. ఎటువైపు వెళ్లినా భక్తులు వినవస్తున్న మాటలు ఒక్కటే... ఇటువైపు ప్రవేశం లేదు... ఎన్నిమార్లు చెప్పాలి... మనుషులేనా మీరు... మాట వినరా.... లాగి పారేయండయ్యా... ఇలాంటి మాటల తూటాల వర్షం భక్తులపై సునామీలా కురుస్తోంది. కొంత మంది భక్తులు మాట్లాడుతూ దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడంటే ఇదే నని నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడం ఎంతైనా అవసరం.