చిత్తూరు

తిరుమల పరిశుభ్రతపై మరింత ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 17: తిరుమల పరిశుభ్రతపై మరింత ప్రత్యేక దృష్టి సారించి భూలోక స్వర్గంలా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని టిటిడి తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టిటిడి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జె ఇ ఓ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిశుభ్రత విషయంలో తిరుమలను ఆదర్శంగా తీసుకోవాలని ప్రకటన చేశారని, స్వచ్ఛ్భారత్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా మొదటి విడతగా ఎంపికైన 10 నగరాలలో తిరుమలకు కూడా చోటుదక్కిందన్నారు. ఈ తరుణంలో టిటిడి అధికారులు, సిబ్బంది పరిశుభ్రత విషయంలో మరింత ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలు పెరటాసి మాసం వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు శ్రీవారి భక్తులు విశేషంగా వచ్చారని, వారికి సేవలందించిన టిటిడి అధికారులు, సిబ్బంది, పోలీసులు, విజిలెన్స్ విభాగం సిబ్బంది, ఆర్టీసీ యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. అలానే భవిష్యత్తులో భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల మొదలుకొని ఇప్పటి వరకు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీకి తగ్గట్లుగా టిటిడి అధికారులు, సిబ్బంది శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, భద్రత, వసతి తదితర విషయాల్లో సంతృప్తి కర సేవలందించారని అన్నారు. ఈ సమావేశంలో ఆలయ డిప్యూటీ ఇ ఓ కోదండరామారావు, ఎస్ ఇ -2 రామచంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి షర్మిష్ట, వి ఎస్ ఓలు రవీంద్రారెడ్డి, విమలాకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.