చిత్తూరు

మహిళాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, అక్టోబర్ 17: మహిళలను ఆర్థికంగా ఆదుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం శ్రీ కాళహస్తి మునిసిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 163 మంది మహిళలకు ఆయన కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మహిళల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. డ్వాక్రా సంఘాలను ఏర్పాటుచేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం టిడిపి హయాంలోనే జరిగిందన్నారు. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి డ్వాక్రా సంఘాలు బాగా పనికొచ్చాయని తెలిపారు. అంతేకాకుండా డ్వాక్రా రుణాలను మాఫీ చేయడం, వడ్డీలేని రుణాలివ్వడం తదితర పథకాల గురించి వివరించారు. అందువల్లే మహిళలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని, వారి కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెడతామని తెలిపారు.
పట్టణ పేదరిక నిర్మూలన పథకం మెప్మా కింద నిరుద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నారని, ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. 3నెలల పాటు శిక్షణ పొందిన వారికి ఉచితంగా మిషన్లు అందజేస్తున్నామని, వీటి ద్వారా కుటుంబ పోషణకు మహిళలే కీలకంగా మారే అవకశం ఏర్పాటు అయిందన్నారు. మహిళల సమస్యలను పరిష్కరంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో మునిసిపల్ చైఛైర్‌పర్సన్ రాధారెడ్డి, వైస్ చైర్మన్ పార్థసారథి, శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు, కౌనె్సలర్లు, మెప్మాపిడి నాగపద్మజ, మునిసిపల్ కమిషనర్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.