చిత్తూరు

కలంకారి కళారీతులు అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 10: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో పురుడుపోసుకున్న కలంకారి కళారీతులు అద్భుతమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అభినందించారు. రెండు రోజుల జిల్లా పర్యటను ముగించుకుని ఆదివారం ఢిల్లీకి బయలుదేరిన ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు జిల్లా న్యాయమూర్తి టి. ఆనంద్, తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి ఎస్.నాగార్జున, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్‌చంద్, జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి, టిటిడి లా ఆఫీసర్ డి.వెంకటరమణ, జె ఇ ఒ శ్రీనివాసరాజు వీడ్కోలు పలికారు. తొలుత విమానాశ్రయంలో శ్రీకాళహస్తి గ్రామీణ హస్త కళాకేంద్రం ఏర్పాటుచేసిన కలంకారి వస్త్ర, కొయ్యబొమ్మల ప్రదర్శనను ప్రధాన న్యాయమూర్తి ఆసక్తిగా పరిశీలించారు. శ్రీరామపట్ట్భాషేకం, శ్రీకృష్ణ లీలలు, రామాయణం వంటి పురాణగాధలతో రూపుదిద్దుకున్న కలంకారి అందాలను పరిశీలించారు.
పద్మావతీ అమ్మవారి సేవలో...
తిరుచానూరు: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి. ఎస్ ఠాకూర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్ వి రమణ దర్శించుకున్నారు. వీరికి తిరుమల, తిరుపతి జెఇఓలు శ్రీనివాసరాజు, పోలాభాస్కర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం గజ మండపం వద్ద అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.