చిత్తూరు

జిల్లాలో 53 మండలాల్లో కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, అక్టోబర్ 21 : జిల్లాలో 53 మండలాలను కరవు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. జిల్లాలో ఈ ఏడాది 35 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలని, అదేవిధంగా మరో 18 మండలాల్లో నెలకొన్న అసాధారణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మొత్తం 53 మండలాలను కరవు మండలాల జాబితాలో చేర్చాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. దీంతో జిల్లాలో 53 మండలాలను కరవు మండలాలుగా గుర్తించింది. ఇందులో మదనపల్లి డివిజన్ పరిధిలోని 31 మండలాలు, చిత్తూరు డివిజన్‌లో 14, తిరుపతి డివిజన్‌లో 8 మండలాలు ఉన్నాయి. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కొంతవరకు వర్షాలు కురిసినా తదుపరి మూడు నెలలుగా వర్షాలు కురవకపోవడంతో ఈ ఖరీఫ్‌లో వేరుశనగ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే పలుచోట్ల నీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావం, వర్షాల మధ్య అంతరం, పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అధికారులు కరవు మండలాలను ప్రభుత్వానికి నివేదించారు. వాస్తవానికి గత నాలుగు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా 439 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే జిల్లాలో కేవలం 340 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది. ప్రధానంగా వేరుశనగ పంట చేతికి వచ్చే తరుణంలో వరుణ దేవుడు కనుకరించకపోవడంతో ఈ పంట తుడిచి పెట్టుకుపోయింది. దీంతో ప్రధాన వాణిజ్య పంట వేరుశనగ చేతికి రాకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఈ పంట సాగుకు పెట్టిన పెట్టుబడులకు వడ్డీ కూడా గిట్టుబాటు కాని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జిల్లా యంత్రాగం క్షేత్రస్థాయిలో విలయతాండవం చేసిన కరవు పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించింది. జిల్లా అధికారుల నివేదికలను పరిశీలించిన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో జిల్లాలోని 53 మండలాల్లో కరవు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం సంబంధిత మండలాలను కరవు మండలాలుగా ప్రకటించింది. ఇందులో మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లోని మొత్తం 31 మండలాలతో పాటు చిత్తూరు డివిజన్‌లో బంగారుపాళ్యం, యాదమరి, గుడిపాల, పూతలపట్టు, ఐరాల, తవణంపల్లి, జిడి నెల్లూరు, పెనుమూరు, పాలసముద్రం, ఎస్‌ఆర్ పురం, కార్వేటినగరం, వెదురుకుప్పం, పాకాల, చిత్తూరు రూరల్ మండలాలు ఉన్నాయి. అదేవిధంగా తిరుపతి డివిజన్‌లో రేణిగుంట, శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, చంద్రగిరి, రామచంద్రాపురం, బిఎన్ కండ్రిగ, సత్యవేడు మండలాలను కరవు మండలాలుగా ప్రకటించింది.