చిత్తూరు

పట్టుపరిశ్రమ అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలమనేరు, అక్టోబర్ 25 : రైతులందరూ పట్టుపరిశ్రమ అభివృద్ధికి భాగస్వాములు కావాలని కేంద్ర పట్టు మండలి చైర్మన్ హనుమంతరాయప్ప పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పట్టుపరిశ్రమశాఖ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుపరిశ్రమ అభివృద్ధికి దేశ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర ప్రాంతాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకొని పట్టుపరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన విధానాలను రూపొందిస్తున్నామని అన్నారు. పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎన్నో సబ్సిడీ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. కిలో పట్టుగూళ్లకు అదనంగా ప్రభుత్వం రూ.50 అందిస్తుందని, అలాగే రైతులకు పట్టుగూళ్లు ఏర్పరచుకునేందుకు ఓ భవనాన్ని సబ్సిడీ రూపంలో అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడి వచ్చేందుకు కృషి చేయాలన్నారు. పట్టుపరిశ్రమ అభివృద్ధి కోసం 800 మంది పట్టుపరిశ్రమ శాస్తవ్రేత్తలు రోజూ ప్రయోగాలు చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో పట్టు పరిశ్రమకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నామని తెలిపారు. కమిషనర్లు, జాయింట్ డైరెక్టర్లతో సమావేశమై రైతుల అభిప్రాయాలు తీసుకుని వాటిని అమలు చేస్తామన్నారు. శాస్తవ్రేత్తలు ప్రసాద్, భాషా, సత్యనారాయణమూర్తి రైతులు పాల్గొన్నారు.