చిత్తూరు

గ్రూప్ 1,2ల నోటిఫికేషన్లు విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 27: గ్రూప్ 1,2 నోటిఫికేషన్లను తక్షణం విడుదలచేయాలని అకాడమీ పుస్తకాలను ఇవ్వాలని ఆమ్ ఆద్మీపార్టీ యువజన విభాగం, నవ్యాంధ్ర విద్యార్థి జెఎసి నేతలు డిమాండ్‌చేశారు. తమ డిమాండ్లను అమలుచేయాలంటూ గురువారం వీరు స్థానిక బాలాజి నగర్ అంబేద్కర్ భవన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా బాలాజి కాలనీ సర్కిల్ వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయకౌన్సిల్ సభ్యులు, యువనాయకులు గట్టు రంజిత్‌కుమార్, నీరుగట్టు నగేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువతకు అనేక వరాలిచ్చారన్నారు. అయితే అధికారంలోకి రాగానే వారిని పట్టించుకోకుండా నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుకుంటున్నారని నిప్పులు చెరిగారు. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాలన్నారు. నవ్యాంధ్ర జె ఎ సి నేతలు కిరణ్, బాలాజి మాట్లాడుతూ బాబు వస్తే జాబువస్తుందని నిరుద్యోగ యువతకు ఆశలుపెట్టారన్నారు. ఆ ఆశలు నిరాశ చేశారన్నారు. ఇక ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో ప్రతి విద్యార్థికి నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చి ఆ హామీని కూడా అటకెక్కించామన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను దగాచేయడంతో పాటు విద్యార్థులను మరింత దగాచేసి వారి భవిష్యత్‌పై నీళ్లుచల్లారన్నారు. అందుకే నేడు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రూప్ 1,2 నోటిఫికేషన్ విడుదలచేయాలని, పాఠ్యపుస్తకాలను అందజేయాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేయాలన్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ -2 పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థులు, యాప్ నాయకులు వివేక్, కుమార్, గణేష్, విద్యార్థినాయకులు బాలాజి, మంజు, నాగార్జున, అనిత, కాంతమ్మ, సుబ్రహ్మణ్యం, అరుణ, హరి తదితరులు పాల్గొన్నారు.