చిత్తూరు

నాయకత్వ పటిమ పెంపునకు శిక్షణ తరగతులు దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 29: టిడిపిలో ప్రతి కార్యకర్తలను నాయకత్వ లక్షణాలుంటాయని, అయితే వాటిని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈకార్యక్రమాన్ని నిర్వహించిన టిఎన్‌ఎస్‌ఎఫ్ నేతలను అభినందిస్తున్నామని ఎమ్మెల్సీ గౌనిగారి శ్రీనివాసులు, టిటిడి చైర్మన్ చదలవాడ, డాక్టర్ సుధారాణి అన్నారు. టి ఎన్ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో గత నెల 11న టిడిపి కార్యకర్తలకు నాయకత్వ పటిమపై తిరుపతిలో ప్రారంభమైన శిక్షణ శిబిరాలు శనివారంతో ముగిశాయి. ఈసందర్భంగా టి ఎన్ ఎస్ ఎఫ్ నేతలు ముఖ్య అతిథుల చేతులమీదుగా కేక్‌లు కట్‌చేయించి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ 40 రోజుల వ్యవధిలో 100 బ్యాచిలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ శిక్షణ కాలంలో రాజకీయాల్లో ఎంతో అనుభవం కలిగిన అనేకమంది ఇచ్చిన సలహాలను ప్రతి కార్యకర్త అనుసరించి నాయకత్వ పటిమను పెంచుకోవాలని హితవు పలికారు. దివంగత ఎన్ టి ఆర్ తరువాత ఎంతో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి చంద్రబాబునాయుడన్నారు. ఆయన నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకున్న బాబు కుమారుడు లోకేష్ బాబు అన్నారు. ఆయన ఆలోచన మేరకే నేడు కార్యకర్తలకు నాయకత్వ లక్షణాలలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగి ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు ప్రజాసంక్షేమం కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తల భుజస్కందాలపై ఉందన్నారు. అంతేకాకుండా తిరుపతిలో ఎప్పుడు ఎలాంటి ఎన్నికలొచ్చినా వాటిలో టిడిపి అభ్యర్థులను గెలిపించేవిధంగా కార్యకర్తలు ప్రజలను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కార్యక్రమం కో- ఆర్డినేటర్ రాగాల ఆనంద్‌రావు, భాస్కర్‌యాదవ్, కిరణ్‌కుమార్, ఎల్లయ్య, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన టి ఎన్ ఎస్ ఎఫ్ నేతలను చదలవాడ, గౌనిగారి శ్రీనివాసులు సన్మానించారు.

హంద్రీ-నీవా సొరంగం పనులు నిలిపివేత
* 21కోట్లు మట్టిపాలు - పట్టిసం తరహాలో ఎత్తిపోతలకు శ్రీకారం
* అదనంగా 152 కోట్లు భారం - కేబినేట్ ఆమోదమే తరువాయి
మదనపల్లె, అక్టోబర్ 29: హంద్రీ-నీవా సృజల స్రవంతి పథకంలో కీలకమైన పెద్దమండ్యం-కలిబండ సొరంగమార్గం పనులను ప్రభుత్వం ఎట్టకేలకు నిలిపివేసింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా పట్టిసీమ తరహాలో ఎత్తిపోతల, పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు అదనంగా రూ.152కోట్లు వ్యయం అవుతుందని, అయితే తక్కువ సమయంలో పనులు పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సర్వేతోపాటు, అంచనాలు, సాంకేతిక అనుమతులు, అలైన్‌మెంట్ రూపొందించుకోవాలని ప్రభుత్వం నుంచి అధికారులకు సూత్రపాయంగా సూచించింది. దీపావళి తర్వాత జరిగే రాష్ట్ర కేబినేట్‌లో ఆమోదం అనుమతితో టెండర్లు పిలవాల్సివుంది. ఈ ఏడాది చివరికి కృష్ణాజలాలను జిల్లాకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ఇందులో భాగంగా హంద్రీ-నీవా-2 దాదాపు 80శాతం పనులు పూర్తయ్యాయి. అయితే పెద్దమండ్యం మండలం సి.గొల్లపల్లె నుంచి కడపజిల్లా చిన్నమండెం మండలం కలిబండ వరకు సొరంగం పనులు కృష్ణాజలాల రాకకు అడ్డంకిగా మారింది. సొరంగం తవ్వకాలలో బురదమట్టి రావడం, వర్షాలకు పైభాగం నుంచి బురద వస్తుండటంతో తొలుత పనులు నిలిపివేశారు. పనులు ప్రతిపాదన ముందు బోర్ల తవ్వకాలు, ఎలక్ట్రికల్స్ పరికరాలతో సొరంగంలోని రాతి గట్టితనాన్ని అంచనా వేసేందుకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరిశీలనలో రాయిగట్టిగా ఉన్నట్లు రిపోర్టులు రావడంతో సుమారు రెండుకిలోమీటర్లకు పైగా సొరంగం పనులు చేపట్టేశారు. ఆపై తవ్వకాలలో శుద్ధరాయిమట్టి బయటపడటంతో తవ్వేందుకు కష్టసాధ్యమైంది. అనవసర సమయం వృధాతో పాటు నిధులు కూడా వృథా అయిందని అధికారులు పనులు నిలిపివేశారు. దీంతో ప్రభుత్వం హైపవర్ కమిటీచే పరిశీలించిన తర్వాత పనులు కొనసాగించవచ్చునని చెప్పింది. కాంట్రాక్టర్లను మార్చి రెండుమార్లు కొత్తగా టెండర్లు పిలిచినా ప్రయోజనంలేకుండా పోయింది. అయితే బురద, మెతువుమట్టితో కూడిన కొండలు, సొరంగం తవ్వేకొద్దీ పూడిపోతూ వస్తోంది. దీంతో కష్టసాధ్యమని కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు నివేదికలు ఇవ్వడంతోప్రత్యామ్నాయంగా పట్టిసీమ తరహాలో ఎత్తిపోతలకు ప్రభుత్వం సిద్ధమైంది.
అదనంగా రూ.152కోట్లు - రూ.21కోట్లు మట్టిపాలు:- జిల్లాలోని పడమటి ప్రాంతం పెద్దమండ్యం మండలం సి.గొల్లపల్లె సొరంగం ద్వారా పీలేరు నియోజకవర్గం కె.వి.పల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్, కడపజిల్లా రాయచోటి సమీపంలోని శ్రీనివాసపురం రిజర్వాయర్లకు నీరు చేరడం ద్వారా పీలేరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాలకు నీటి సమస్య శాశ్వితంగా పరిష్కారం కానున్నాయి. ఈ పనులను మొదటిగా రూ.130కోట్లతో చేపట్టారు. ఎత్తిపోతల పథకానికి రూ.282కోట్లు అవుతుందని అధికారులు అంచనాలు వేశారు. ఇదివరకు సి.గొల్లపల్లె-కలిబండ సొరంగమార్గం పనులు చేపట్టిన ఇద్దరు కాంట్రాక్టర్లకు ఇదివరకే రూ.21కోట్లు చెల్లించడం మిగిలిన పనులు నిలిపివేశారు. ఎత్తిపోతల పథకంగా మార్పుచేయడం ద్వారా ప్రభుత్వానికి రూ.152కోట్లు అదనంగా వ్యయం చేయాల్సి వస్తుండగా ఇదివరకే జరిగిన సొరంగం పనులకు రూ.21కోట్లు మట్టిపాలైంది. తవ్విన సొరంగం ప్రారంభం, మధ్యమార్గంలో పూర్తిగా మూసివేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలావుండగా సొరంగం తవ్వకాలకు 200ఎకరాలు భూసేకరణ చేపట్టగా పనులు నిలిపివేసి పట్టిసీమ తరహాలో చేపట్టనున్న ఎత్తిపోతల పథకంలో పైప్‌లైన్ ఏర్పాటుతో పాటు, వాటి పక్కనే వాహనాలు వెళ్ళేందుకు కేవలం 25ఎకరాల నుంచి 40ఎకరాల వరకు అవసరముంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. కెవిపల్లె మండలం తిమ్మాపురం సబ్‌స్టేషన్ నుంచి ప్రత్యేక కరెంటులైన్ తీసుకుని 20మెగావాట్ల విద్యుత్‌తో ప్రతి 2.50కిలోమీటర్ల మేర 60మీటర్ల ఎత్తుకు మోటార్లు ద్వారా నీరు ఎత్తిపోయాల్సివుంది. ఇందుకు ఒక లిఫ్ట్‌కు 4మోటార్లు, అక్కడ్నించి రెండు పైప్‌లైన్‌లద్వారా కాల్వలోకి నీటిని పంపింగ్ చేయనున్నారు.

జిల్లాలో చౌకదుకాణాల ప్రక్షాళన

ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, అక్టోబర్ 29: జిల్లాలోనిత్యావసర వస్తువుల కోసం నిర్దేశించిన చౌకదుకాణాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికార యంత్రాంగం కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం జిల్లాలో పలు ప్రాంతాల్లో 2నుండి మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి ప్రజలు ప్రతి నెలా నిత్యావసర వస్తువులను తీసుకుంటున్నట్లు పుకార్లు గుప్పించారు. ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు అతి సమీపంలోనే ఈ చౌకదుకాణాలు ఏర్పాటు చేయాలని అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ పరిధిలో, వార్డులు, డివిజన్ పరిధిలోని వీటిని అందించే విధంగా జిల్లా యంత్రాంగం సన్నద్దమైంది. దీని కోసం ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా కనీసం ఒక కిలోమీటరు పరిధిలోనే నిత్యావసర సరుకులు తెచ్చుకునే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 171, పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె మున్సిపాల్టీల్లో 179చౌక దుకాణాలు ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా కార్పొరేషన్, మున్సిపాల్టీలోను డీలర్లు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో ఈ చౌకదుకాణాలను ఏర్పాటు చేసారు. అయితే పలు ప్రాంతాల్లో ఈ చౌకదుకాణాలు సుదూర ప్రాంతాల్లో ఉండడంతో ప్రతి నెల నిత్యావసర సరుకులు తీసుకెళ్లడం అందరికి అసౌకర్యంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చౌకదుకాణాల పరిధిని పునర్ విభజన చేయడంతో పాటు ఈ దుకాణాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్దేశించిన వార్డులు, డివిజన్ పరిధిలోని అనువైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే దిశగా అధికారులు సన్నద్దమైయ్యారు. ఒకే డివిజన్‌లో ఎక్కువ గృహాలు ఉంటే మరో దుకాణం ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఆర్ డి ఒ ఇచ్చే నివేధికల ఆదారంగా దుకాణాల ఏర్పాటులో మార్పులు, (మిగతా 7వ పేజీలో)
(1వపేజీ తరువాయ)చేర్పులు కానున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వీటిని ఏర్పాటుకు ఆర్ డి ఓ లు, సంబంధిత తహశీల్దార్లు కార్యచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా డీలర్లు తమకు నచ్చిన స్థలాల్లో ఇష్టారాజ్యంగా వీటిని ఏర్పాటు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరికొన్ని చోట్ల ప్రతినెలా నిత్యావసర వస్తువులు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. వీటన్నింటిని చక్కదిద్దడానికి అధికారులు సన్నద్దమైయ్యారు. త్వరలోనే జిల్లాలోని రెండు కార్పొరేషన్‌లతో పాటు ఆరు మున్సిపాల్టీల్లో చౌకదుకాణాల సర్వే నిర్వహించి అందరికి అందుబాటులో ఉండే విధంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు డి ఎస్ ఒ నాగేశ్వర్‌రావు తెలిపారు. ప్రజలు సౌకర్యార్థమే ఈ దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆర్‌డి ఓలు, తహశీల్దార్లు ఇచ్చే నివేధిక ఆధారంగానే వీటిని పునర్ విభజన చేస్తామని తెలిపారు.
టిటిడి చైర్మన్, ఇఓ దీపావళి శుభాకాంక్షలు
తిరుపతి, అక్టోబర్ 29: టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి. సాంబశివరావు శ్రీవారి భక్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని శనివారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు. అందరూ ధర్మమార్గంలో నడవటం ద్వారా శ్రీవారి కృపకు పాత్రులు కావాలని టిటిడి ఛైర్మన్, ఇ ఓ

ఏకగ్రీవంగా పాలసొసైటీ ఎన్నికలు
* మళ్లీ చైర్మన్‌గా మునిరాజానాయుడు
శ్రీ కాళహస్తి, అక్టోబర్ 29: శ్రీ కాళహిస్తి సహకార పాలసొసైటీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నవంబర్ 4వ తేదీన జరగాల్సిన ఎన్నికలకు నామినేషన్లు జరగడం తెలిసిందే. నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఎన్నికల అధికారి 22 మంది అభ్యర్థుల నామినేషన్లలో తిరస్కరించారు. 12మంది నామినేషన్లు మాత్రమే మిగిలాయి. వీటిలోకూడా ఒక్కొక్కరూ రెండేసి నామినేషన్లు వేయడం జరిగింది. మొత్తం 9 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. 12 మందిలో ఇద్దరు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అయితే శ్రీ కాళహస్తి మండలం తొండమనాడుకు చెందిన మహాలక్ష్మి అనేఅభ్యర్థిమాత్రం తమ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. ఈమె వైసిపి నాయకుల ఆధీనంలో ఉన్నట్లు టిడిపి నాయకులు గుర్తించారు. అయినా ఆమెను పోటీ నుంచి విరమింపచేయడానికి ప్రయత్నాలుచేశారు. అయితే ఆమె ఆచూకీ తెలియకపోవడంతో తమ ప్యానల్‌లోని ఒక అభ్యర్థిచేత నామినేషన్లు ఉపసంహరింపచేశారు. దీంతో కమిటీ మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయింది. మొదటిసారి వైసిపికి చెందిన అభ్యర్థి డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. గతంలో రెండుసార్లు చైర్మన్‌గా ఎన్నికైన మునిరాజానాయుడు తిరిగి 3వ సారి ఎన్నిక కానున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్ల జాబితాను ఎన్నికల అధికారి ఈశ్వర్‌బాబు ప్రకటించారు. మునిరాజానాయుడు, జానకమ్మ, శోభ, మహాలక్ష్మి, గురుస్వామి, పార్థసారధిరెడ్డి, రవి, రామచంద్రనాయుడు, సుబ్రహ్మణ్యంలు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. ఉదయం నుంచి మునిరాజానాయుడు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు చెంచయ్యనాయుడు, శ్రీ కాళహస్తి మండలం పార్టీ అధ్యక్షుడు కామేష్‌యాదవ్, నామినేషన్లను ఉప సంహరించే ఘట్టంలో తీరికలేకుండా పనిచేశారు. చివరికి ఏకగ్రీవంగా ఎన్నికకావడం విశేషం. వైసిపి నామమాత్రంగా పోటీకి దిగింది. కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులెవరో నామినేషన్లు కూడా వేయలేదు. పాలసొసైటీకి ఏకగ్రీవ ఎన్నిక జరగడంతో టిడిపి నాయకులు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. మునిరాజానాయుడు అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి, ఆయన కుటుంబానికి సన్నిహితులు.
టపాసుల రవ్వలు పడి
అగ్నిప్రమాదం
* పూరిళ్లు, చిల్లర దుకాణం, గడ్డివామి దగ్ధం
* 2లక్షల ఆస్తి నష్టం
పెద్దపంజాణి, అక్టోబర్ 29: దీపావళి పండుగకు తెచ్చిన టపాసులు కాల్చుతుండగా అందులో నుంచి వెలువడిన నిప్పురవ్వలు పడి గడ్డివాము, పూరిళ్ళు, చిల్లరదుకాణం దగ్ధమైన సంఘటన శనివారం రాత్రి పెద్దపంజాణి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. దీపావళి పండుగకోసం తెచ్చుకున్న టపాకాయలను చిన్నపిల్లలు కాల్చుతుండగా అందులోనుంచి ఎగిసిపడిన నిప్పుచువ్వ గడ్డివాముపై పడింది. మండల కేంద్రం పెద్దపంజాణి సమీపంలోని దినె్నపల్లెకు చెందిన కొందరు పిల్లలు టపాసులు కాల్చుతుండగా అందులోనుంచి నిప్పు చువ్వలు ఎగిసిపడి పక్కనే ఉన్న గోవిందస్వామి గడ్డివామిపై పడింది. ఒక్కసారిగా నిప్పులు చెలరేగడంతో పక్కనే ఉన్న పూరిళ్ళుకు అంటుకుంది. మంటల చెలరేగడంతో స్థానికులు పలమనేరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడం గంట ఆలస్యం కావడంతో సమీపంలో ఉన్న చిల్లరదుకాణంకు అంటుకున్న మంటలతో పూర్తిగా కాలిపోయింది. అప్పటికే సుమారు రూ.2లక్షలు నష్టం వాటిల్లింది. సంఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు ఆస్థినష్టం అంచనా వేశారు. అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కష్టం, నష్టం మిగిల్చిన వేరుశనగ
రొంపిచెర్ల, అక్టోబర్ 29: మండలంలో ఖరీఫ్ వేరుశనగ సాగుచేసిన రైతులకు కష్టం,నష్టం మిగిలింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంట కాలపరిమితి మించినా పంట దిగుబడులను దక్కించుకోలేని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. దిగుబడులు సక్రమంగా లేకపోయినా ఉన్న దిగుబడులను, వేరుశనగ తీగలను దక్కించు కుందామన్నా రైతులకు వీలుకావడం లేదు. నేల గట్టిపడిపోయి వేరుశనగ మొక్కలు ఎండుతుండటంతో మొక్కలు పెరికి తండును రక్షించుకోవడం రైతులకు సమస్యగా మారింది. కొంత మంది రైతులు ట్యాంకర్లలో నీళ్ళు తెచ్చి పొలాలు తడిపి పెరుకుతున్నారు. మరికొందరు ట్రాక్టరు నాగళ్ళతో పొలాలు దున్ని పెరుకుతున్నారు. మరికొందరు పెట్టుబడులు కూడా రాని పంటకు ఇంకా పెట్టుబడులు పెట్టి నష్టపోవడమా అని ఆలోచిస్తున్నారు. మండలకేంద్రంలో ఒక రైతు వేరుశెనగ పంట సాగుచేసి నాలుగు నెలలు పైబడిన ఎమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈయన గతంలో నిల్వ చేసుకున్న వేరుశనగ విత్తనాలతో వేరుశనగ సాగు చేశాడు. పంట పెట్టుబడుల కింద రూ. 15,000 ఖర్చు పెట్టాడు. ట్రాక్టరుతో దున్న కాలకు రూ. 850, విత్తనాల మడకకు రోజుకు రూ. 1500, కూలీలకు రోజుకు అన్నం పెట్టి ఒక్కొక్కరికి రూ.200, గుంటవ తవ్వడానికి రూ. 1200,కలుపు మొక్కలు తొలగించేందుకు రోజుకు కూలీకి రూ. 200 వంతున పంట పెట్టుబడులుగా వెచ్చించాడు. కూలీలు కాకుండా రైతు ఒక్కడే కష్టపడి కొన్నాళ్ళు కలుపు మొక్కలు తొలగించుకున్నాడు. పూత, పిందె, కాయలు, గింజ దశలో వర్షాలు అనుకూలించకపోవడంతో రైతు పంట బాగా దెబ్బతినేసింది. పంట సాగు చేసి నాలుగు నెలలు పైన అయ్యింది. ఊడలు, పిందె, కాయ, గింజ అభివృద్ది లేకుండా ఉండిపోయింది. పంటను పెరుక్కునేందుకు కూడా వీలుకాని పరిస్థితి నెలకొనడంతో ఏమిచేయాలో రైతుకు పాలుపోవడం లేదు. మొక్కలు వాడి ఎండి పోతుండటంతో ట్రాక్టరుతో దున్నించి పెరకాలంటే మొక్కలు దెబ్బతినిపోతాయని రైతు ఆవేదన చెందుతున్నారు. ఇదే విధమైన పరిస్థితి మండలంలో అక్కడక్కడ కొంత మంది రైతులు ఎదుర్కొటున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది వర్షాలు ఖరీఫ్ వేరుశెనగ రైతులను నిలువునా కష్టం, నష్టాలు పాల్జేసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
.

పశువులకు, గొర్రెలకు మేతగా వేరుశనగ పంట *రైతులకు కన్నీటిని మిగిల్చిన ఖరీఫ్
పెద్దపంజాణి, అక్టోబర్ 29: మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో ఖరీప్‌లో రైతులు సాగు చేసిన వేరుశనగ పంట ఈ ఏడాది పశువులకు, గొర్రెలకు మేతగా వదిలేశారు. శనివారం మండలంలో నిలువునా ఎండిపోయిన వేరుశనగ పంటను పశువులకు, గొర్రెలకు మేతగా వదిలేశారు. పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి, గంగవరం, పలమనేరు, బైరెడ్డిపల్లె, వి.కోట మండలాల్లో రైతులు సాగు చేసిన వేరుశనగ పంట రైతులను నీలువున ముంచింది. అయితే కొంతమంది రైతులు అప్పులు చేసి వెరుశెనగ పంటను సాగు చేశారు. అయితే అదునులో వర్షాలు కురవకపోతే పంట చేతికి రాదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీప్‌లో వేరుశనగ పంటను సాగు చేసిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.

జిఎన్‌సి టోల్‌గేట్ వద్ద జర్రిపోతు హల్‌చల్
తిరుమల, అక్టోబర్ 29: తిరుమల జి ఎన్ సి టోల్‌గేట్ వద్ద ఉన్న నడకమార్గం చివరిమెట్టు వద్ద శనివారం ఓ జర్రిపోతు పాము హల్‌చల్ చేసింది. అటవీప్రాంతం నుంచి చివరిమెట్టు సమీపాన ఉన్న విద్యుత్ పవర్ హౌస్ వద్దకు సమీపించి జర్రిపోతు పాము అటు ఇటు తిరుగుతూ భక్తులను, సిబ్బందిని పరుగులు తీయించింది. సుమారు అరగంట పాటు జర్రిపోతు హల్‌చల్ చేయడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్కడున్న వారు టిటిడి అటవీశాఖకు సమాచారం అందించగా పాములు పట్టే ఫారెస్ట్ ఉద్యోగి భాస్కర్‌నాయుడు అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా బాలాజీనగర్‌లో నివాసముండే మునస్వామిని అధికారులు సంఘటనా స్థలానికి పిలిపించారు. అతడు జర్రిపోతు పామును చాకచక్యంగా పట్టుకొని అడవిలో విడిచి పెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
శీతాకాల సమావేశాల్లో విభజన హామీలపై చర్చిస్తాం
* టిడిపి ఎంపి అవంతి వెల్లడి

తిరుమల, అక్టోబర్ 29: రాబోవు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై టిడిపి ఎంపిలు అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని టిడిపి ఎంపి అవంతి శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విభజన సమయంలో రాష్ట్రానికి కేంద్రం కురిపించిన హామీలలో కొంత వరకు నెరవేర్చారని అయితే రాష్ట్రానికి సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీ, విశాఖ రైల్వేజోన్ మొదలైన హామీలను కేంద్రం ఇంకా నెరవేర్చాల్సి ఉందని అన్నారు. వీటిని సాధించేందుకు రాబోవు పార్లమెంటు శీతాకాల సమావేశాలను వేదిక చేసుకున్నామని తెలిపారు. కేంద్రానికి టిడిపి మిత్ర పక్షం అయినప్పటికీ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో పోరాడి సాధించేందుకు తీవ్ర కృషి చేస్తోందని టిడిపి మిత్రపక్షం అయినప్పటికీ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో పోరాడి సాధించేందుకు తీవ్రకృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులుగా ప్యాకేజి దక్కిందని, అయితే ప్రస్తుతం అందిన నిధులతో కొంత వరకు మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు కూడా రాష్ట్రానికి తోడ్పాటు అందించేందుకు సుముఖతతో ఉన్నారని తెలిపారు. అరుణ్‌జైట్లీ వెంకయ్యనాయుడు కూడా రాష్ట్రానికి తోడ్పాటు అందించేందుకు సుముఖతతో ఉన్నారని తెలిపారు. అరుణ్‌జైట్లీ రాష్ట్రం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆయన ఆమోదించి ప్రధానికి సిఫార్సు చేస్తే మరిన్ని నిధులు తప్పక విడుదల అవుతాయని అన్నారు. ఇక రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇటీవల కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ చేతుల మీదుగా జరిగిన శంకుస్థాపన కార్యక్రమాల గురించి ప్రతిపక్ష నేతలు పొరబడి అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నవ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే అరుణ్ జైట్లీ రాజధానిలో నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తే అరుణ్‌జైట్లీ రాజధానిలో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారని, ఈ విషయాన్ని ప్రతిపక్ష నేతలు గ్రహించాలని హితవు పలికారు. ఇక ఇదే సమయానికి టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నిర్మాత అంబికాకృష్ణకూడా శ్రీవారిని దర్శించుకొని తరించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ప్యాకేజి వద్దంటే వెనక్కి తీసుకునే అవకాశాలు
* ప్యాకేజిని స్వాగతిస్తూ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తాం
* ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు
తిరుమల, అక్టోబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజిని తిరస్కరిస్తే వాటిని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం ఉదయం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ససమ్యలను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా తప్పనిసరి అని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం చట్టపరంగా హోదా ఇవ్వడం సాధ్యం కాదని ప్రకటించి, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిందని అన్నారు. అలా ప్రకటించిన ప్యాకేజిని మనం వ్యతిరేకించి తిరస్కరిస్తే వాటిని వెనక్కు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోదీ సంపూర్ణ మెజారిటీతో ప్రధానమంత్రి అయ్యారని, ఆయనకు తెలుగదేశంపార్టీ ఎంపిల మద్దతు అంతగా అవసరం లేకపోవచ్చని అన్నారు. ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకునే తాము మొదటగా ప్యాకేజిని స్వాగతించామని, అయితే ప్రత్యేక హోదా కోసం మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తామని అన్నారు. ఇక ఈ ఏడాది జరిగిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను టిటిడి చక్కగా నిర్వహించిందని ప్రశంసించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ దేవదేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అలానే తెలుగు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

కుంభాభిషేకానికి విరాళం
శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం కుంభాభిషేకానికి ఆదాయ పన్ను శాఖ కమిషనర్ జీవాల నాయక్ రూ.25వేలను శనివారం విరాళంగా అందజేశారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవస్థానం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ కోలా ఆనంద్ , బిజెపి నాయకుడు రాజు, దేవస్థానం సూపరింటెండెంట్ ధనపాల్, ఎపి ఆర్ ఓ శ్రీమన్నారాయణ తదితరులు స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. ఫిబ్రవరిలో జరుగనున్న కుంభాభిషేకానికి రూ.25వేల రూపాయలను విరాళంగా అందజేశారు.