వినోదం... కన్నీళ్లు కలగలసిన సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విక్కీడోనర్ సినిమా చూసినపుడు షాక్ తగిలింది. మన తెలుగువాళ్లు ఇలాంటి కథలను ఒప్పుకుంటారా అని అనిపించింది. ఒకప్పుడు సిగరెట్ తాగడం నేరం. అలా తాగేవాళ్లు ఇలా దాచుకునేవారు. ఆ తరువాత అది మామూలైపోయింది. మందు తాగడం కూడా వహ్వా అనుకునేవారు. ఇప్పుడెవరైనా తాగరూ అంటే హీనంగా చూస్తున్నారు’ అని నటుడు తనికెళ్ల భరణి తెలిపారు. సుమంత్ కథానాయకుడిగా మల్లిక్‌రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నరుడా డోనరుడా’. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- ‘ఈ చిత్రంలో సున్నితమైన అంశం వుంది. పిల్లలు లేనివాళ్ళకైతే నరకం అని వర్ణించలేం. అలాంటివారికోసమే ఫెర్టిలిటీ సెంటర్లు వున్నాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆ అవసరం ఉన్నవాళ్లకు మాత్రమే తెలుస్తుంది. అవసరమున్నా చెప్పుకోలేని పరిస్థితి చాలామందికి వుంది. ఎందుకంటే ఆ విషయం అలాంటిది కనుక. అయినాగానీ సినిమాలో భలే బోల్డ్‌గా చెప్పాడు అనుకున్నా. హిందీ సినిమా ఇక్కడ కూడా ఆడింది. ఈ సినిమాలో సందర్భం వచ్చినపుడు మాత్రమే ఎంటర్‌టైన్‌మెంట్‌తో చెప్పాం. 99 శాతం వినోదంతో కన్నీళ్లు పెట్టేలా ఓ సందేశం కూడా ఇచ్చాం. మాతృకను వున్నది వున్నట్టు తీశారు. తప్పక ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం వుంది’ అని ఆయన వివరించారు.