చిత్తూరు

జాతీయ నాయకుల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 11: సమసమాజ నిర్మాణంలో, దేశభక్తిలోనూ ధార్మిక చింతన వ్యాప్తి చేయడంలో ఎంతో విశేష కృషి చేసిన మహనీయులు, త్యాగధనుల జయంతి, వర్ధంతులు నిర్వహించడం ద్వారా భావితరాల్లో స్ఫూర్తి నింపి వారిని సమసమాజ నిర్మాణం వైపు నడిపించేందుకు ఎంతగానో దోహదపడతాయని టిటిడి కార్యనిర్వాహణాధికారి సాంబశివరావు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావుపూలే జయంతిని సోమవారం టిటిడి పరిపాలనా భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇఓ సాంబశివరావు ప్రసంగిస్తూ మహారాష్టల్రో మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన జ్యోతిరావుపూలే వర్ణ వ్యవస్థతో కునారిల్లుతున్న సమాజానికి సంస్కారం నేర్పారని కొనియాడారు. అణగారిన వర్గాల సమున్నతి కోసం విద్యే సరైన ఆయుధమని భావించి పాఠశాలలు నెలకొల్పారని, స్ర్తి విద్యను ప్రోత్సహించారని, వితంతు పునర్వివాహానికి నాంది పలికారని వివరించారు. అన్ని వర్గాల వారికి విద్య, ఉపాధి రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారని చెప్పారు. భారతీయ ధర్మం సమానత్వాన్ని ప్రభోదిస్తుందని, టిటిడి ఉద్యోగులు కూడా ఇదే సమానత్వాన్ని పాటించాలని ఆయన కోరారు. టిటిడి విద్యా సంస్థలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు టిటిడి కృషి చేస్తుందని తెలిపారు. తిరుపతి సంయుక్త కార్యనిర్వాహణాధికారి పోలా భాస్కర్ ప్రసంగిస్తూ వెనకబాటు, కులతత్వం తదితర అనేక కారణాల వల్ల భారతీయ సమాజంలో మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. ఇలాంటి నాయకుల్లో జ్యోతిరావుపూలే ఒకరని చెప్పారు. స్వాతంత్య్రోద్యమానికి ముందు సాంఘిక సంస్కరణోద్యమం ద్వారా సమాజంలోని వివిధ రుగ్మతలను రూపుమాపేందుకు పూలే విశేష కృషి చేశారన్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పాత్రికేయులు భాష్యం యాదగిరి మాట్లాడుతూ పూలే జాతి ప్రయోజనాల కోసం పలు రచనలు చేశారని, అవి వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. పూలేని సంఘసంస్కర్తగా, రచయితగా, ఆధ్యాత్మికవేత్తగా, పండితుడిగా, మానవతావాదిగా అభివర్ణించారు. పూలే తన భార్య సావిత్రిభాయికి విద్యాబుద్దులు నేర్పించి మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా చరిత్రలో నిలిచిపోయేలా చేశారన్నారు. నాగరికతకు పుట్టినిల్లు భారతదేశమని, దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని, అయినా అభివృద్ధి చెందకపోవడానికి కారణం కులవ్యవస్థ అని తెలియజేశారు. చంద్రగిరి పంచాయతీరాజ్ ఎఇ దినకర్ మూర్తి ప్రసంగిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుడే పూలేని గురువుగా భావించారని తెలిపారు. వర్ణ వ్యవస్థతో కునారిల్లిన సమాజానికి సంస్కారం నేర్పిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. నిమ్నజాతుల అభివృద్ధికి సాయపడినపుడే పూలేకి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు. ఎస్వీయూ తెలుగు విభాగం టీచింగ్ అసిస్టెంట్ డాక్టర్ మస్తానమ్మ మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమానికి ముందు సాంఘిక సంస్కరణోద్యమం ద్వారా సమాజంలోని వివిధ రుగ్మతలను రూపుమాపేందుకు జ్యోతిరావుపూలే విశేష కృషి చేశారని తెలిపారు. టిటిడి విద్యాసంస్థల్లో పూలే, అంబేద్కర్ తదితర జాతీయ నాయకుల జయంతి కార్యక్రమాలు నిర్వహించి వారి గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేయాలని కోరారు. అనంతరం పలువురు టిటిడి ఉద్యోగులు ప్రసంగించారు. టిటిడి సహాయ ప్రజా సంబంధాల అధికారి కుమారి పి.నీలిమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈకార్యక్రమంలో డిఇఓ విజయ్‌కుమార్, బిసి సెల్ లైజన్ ఆఫీసర్ సిహెచ్ రవిప్రభాకర్, ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వాహణాధికారి మునిరత్నంరెడ్డి, డిప్యూటీ ఇఓ కృష్ణారెడ్డి, స్నేహలత, లక్ష్మీనారాయణ, బి.మనోహరం, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో టిటిడి ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.