చిత్తూరు

మనగుడి సామగ్రికి శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 4: టిటిడి ఆధ్వర్యంలో ఈనెల 11నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని 12వేల దేవాలయాల్లో జరుగనున్న 8వ విడత మనగుడి ఉత్సవానికి సంబంధించిన కంకణాలు, అక్షింతలు, తదితర సామగ్రిని శుక్రవారం స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జె ఇ ఓ శ్రీనివాసరాజు, తిరుపతి జె ఇ ఓ పోలాభాస్కర్‌లు, ఆల్ ప్రాజెక్ట్స్ సంచాలకులు ముక్తేశ్వరరావు, ఆలయ డిప్యూటీ ఇ ఓ కోదండరామారాజు, ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయంలో మనగుడి సామగ్రికి పూజలుచేశారు. అక్కడనుంచి పూజా సామగ్రిని తలపై ఉంచుకొని మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయ మహద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి చేరుకున్నారు. అనంతరం పూజాసామగ్రిని ఆలయ ప్రధానార్చకులు స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజాసామగ్రిని మనగుడి ఉత్సవం నిర్వహించే ఆయా ప్రాంతాల్లోని ఆలయాలకు తరలించారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ హైందవ సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షించడంలోనూ, ప్రజల్లో ధార్మిక చైతన్యాన్ని కల్పించడంలోనూ టిటిడి యాజమాన్యం అహర్నిశలూ కృషిచేస్తూందన్నారు. ఇందులో భాగంగా అనేక హైందవ సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలను నిరాఘాటంగా కొనసాగిస్తున్నారన్నారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో నిరాధరణకు గురైన గ్రామాల్లో ఆలయాలకు పూర్వ వైభవం కల్పించేందుకు టిటిడి దేవాదాయ, ధర్మాదాయ శాఖ సంయుక్తంగా మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటి వరకు 7 విడతలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని, 8వ విడత ఈనెల 11నుంచి ప్రారంభమవుతుందన్నారు. మనగుడి జరిగే ప్రాంతాల్లోని గ్రామప్రజలు స్వచ్ఛందంగా తమ ప్రాంతంలో ఉన్న ఆలయాలనుశుద్ధిచేసుకొని శ్రీవారి నామాన్ని గ్రామల్లోస్మరించుకునేలా ఏర్పాట్లుచేపట్టామన్నారు. మనగుడి అంటే మన ఇంటి పండగలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జె ఇ ఓ శ్రీనివాసులు రాజు మాట్లాడుతూ టిటిడి , రాష్ట్ర దేవాదాయ శాఖ లు సంయుక్తంగా రెండు తెలుగురాష్ట్రాల్లోనూ మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంచేసేందుకు రథసారథులు కావాలని పిలుపునిచ్చారు. జె ఇ ఓ పోలాభాస్కర్ మాట్లాడుతూ గుడి ప్రాధాన్యతను వివరిస్తూ ధార్మిక, ఆధ్యాత్మిక భావనను పెంపొందించడమే మనగుడి కార్యక్రమం లక్ష్యం అన్నారు. ఈ ఉత్సవాలు జరిగే ప్రతి ఆలయంలోనూ భక్తులకు కంకణాలు, అక్షింతలు అందించడం జరగుతుందన్నారు. టిటిడి ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఎన్.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ మనగుడిలోని ఆలయాల్లో స్థానిక భక్తులను, భజన మండలి సభ్యులను, శ్రీవారి సేవకులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బొక్కసం బాధ్యులు గురురాజారావు పాల్గొన్నారు.