చిత్తూరు

తులాభారానికి డబ్బు తెచ్చిన భక్తుని అడ్డుకున్న విజిలెన్స్ సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 13: తన కుమార్తె(16)కు తులాబారం వేయడానికి రూ.30వేలు చిల్లర నాణ్యాలు తెచ్చుకున్న విజయవాడకు చెందిన వెంకటసుబ్బారావు అనే భక్తుడికి చేదు అనుభవం ఎదురైన సంఘటన ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగింది. వివరాల్లోకి వెడితే విజయవాడ- ఉయ్యూరికి చెందిన వెంకటసుబ్బారావు వెంకన్నపట్ల అపారమైన నమ్మకం. అందుకే ఆయన తన పేరు ముందు వెంకట అని పెట్టుకున్నారు. తన 16 సంవత్సరాల కుమార్తెకు తులాబారం వేయడానికి విజయవాడలో 30వేలకు చిల్లర నాణ్యాలు తీసుకున్నాడు. ఆదివారం స్వామివారి దర్శనానికి వెడుతూ తులాభారం వేయడానికి తెచ్చిన సొమ్మును తన వెంట తీసుకువెళ్ళాడు. విజిలెన్స్ సిబ్బంది భక్తులు ఎవరూ చిల్లర నాణ్యాలు హాల్లోకి తీసుకురాకూడదని, తులాబారంకు అవసరమైన సౌకర్యం టిటిడి కల్పిస్తుందని చెప్పారు. తాము ఎంతో దూరం నుంచి చిల్లర నాణ్యాలను మోసుకుని తీసుకువచ్చామని, దీనికి అడ్డు చెప్పడం ఏమిటదని విజిలెన్స్ సిబ్బందిని ప్రశ్నంచారు. అయితే ఆలయంలో ఉన్న ఛైర్మన్ చదలవాడ సమాచారం తెలుసుకుని ఆభక్తుని కుమార్తెకు తులబారం వేసి పంపించారు. శ్రీవారికి తులాబారం వేయదలచుకున్న భక్తుడి బరువును టిటిడి అధికారులు ఆలయ పడికావాలి వద్ద తులాబారం వేస్తారు. బరువుకు తగ్గ మొత్తాన్ని భక్తుడు నుంచి తీసుకుని రశీదు ఇచ్చే సాంప్రదాయం కొనసాగుతోంది. ఇది భక్తులకు సౌకర్యమే. అందులో అనుమానం లేదు. అయితే ఓ భక్తుడు ఎంతో దూరం నుంచి తీసుకువచ్చిన సొమ్మును విజిలెన్స్ అధికారులు వెనెక్కి తిప్పి పంపడమంటే ఆభక్తుని మనో బావాలను దెబ్బతీసినట్లే. భద్రతాకారణాలు ఏవైనా ఉన్నా విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేసి ఇలాంటి వారి మనోభావాలు దెబ్బతినకుండా ఆ సొమ్ముతోనే వేయడం ద్వారా జరిగే నష్టం ఏమీ ఉండదని భక్తుల వాధన. టిటిడి యాజమాన్యం అడపాదడపా ఇలా వచ్చేవారిని మనోవేధనకు గురిచేయకుండా అనుమతించి మరోమారు ఇలా సంఘటనలు తలెత్తకుండా టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలను వివరిస్తే చాలని భక్తులు అంటున్నారు.
మదనపల్లె సబ్‌కలెక్టర్‌కు జెసిగా పదోన్నతి
* గుంటూరు జిల్లాకు బదిలీ
* కొత్త సబ్‌కలెక్టర్‌గా వెట్రిశెల్వి
మదనపల్లె, నవంబర్ 13: మదనపల్లె సబ్ కలెక్టర్ కృతికబాత్రకు జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. మదనపల్లె నూతన సబ్‌కలెక్టర్‌గా వెట్రిశెల్విని నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గత ఏడాది 2015 డిసెంబర్ 5న మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా కృతికబాత్ర బాధ్యతలు చేపట్టారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, సబ్‌కలెక్టర్ కార్యాలయానికి ప్రజల నుంచి వచ్చే అర్జీలను వారాంతంలో పరిష్కారం చేస్తూ మన్ననలు అందుకున్నారు. అంతేకాకుండా మదనపల్లె పౌరసరఫరాల శాఖలో అవినీతి అక్రమాలకు అడ్డుకట్టవేసి కార్డుదారులకు సకాలంలో నిత్యావసర సరకులు అందించేలా చర్యలు తీసుకున్నారు. తొమ్మిది నెలలు విధులు నిర్వహించిన సబ్‌కలెక్టర్ కృతికబాత్ర జాయింట్ కలెక్టర్‌గా గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు రావడంతో త్వరలో ఇక్కడి నుంచి రిలీవ్ కానున్నారు.
విమానాశ్రయంలో పనిచేయని ఎటిఎంలు
* ప్రయాణీకులకు తప్పని తిప్పలు
రేణిగుంట, నవంబర్ 13: అంతర్జాతీయ విమానాశ్రయంలో గత నాలుగు రోజులుగా ఏటిఎంలు పనిచేయక పోవడంతో ప్రయాణీకులకు తిప్పలు తప్పడం లేదు. వివరాల్లోకి వెడితే విమానాశ్రయం వెలుపల ఉన్న ఆంధ్ర బ్యాంక్ ఏటిఎం గత నాలుగు రోజులుగా పనిచేయక పోవడంతో ప్రయాణీకులకు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు విమానాశ్రయం వెలుపల ఉన్న షాపుల్లోని తినబండారాలు తీసుకోవాలంటే చిల్లర లేకపోవడంతో రూ.500, రూ.1000లకు సైతం ఆ మొత్తానికి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అలాగే విమానాశ్రయం ఎదురుగా ఉన్న హోటళ్లు సైతం చిల్లర సమస్యతో మూసివేశారు. ఇదిలా ఉండగా గతంలో అత్యవసరంగా విమానాశ్రయంలో ప్రయాణించే వారు నేరుగా నగదు చెల్లింటి టికెట్లు పొందేవారు. అయితే ఇప్పుడు పెద్ద నోట్లు చెల్లక పోవడంతో ఆయా విమాన సంస్థలు టికెట్లను ఆన్‌లైన్లో విక్రయిస్తున్నాయి. గత రెండు రోజులుగా నేరుగా కొనుగోలు చేసిన టికెట్లకు చిల్లర సమస్య రావడంతో ఆన్‌లైన్లో విక్రయాలు చేస్తున్నారు. అయితే విమాన ప్రయాణీకులకు వెంటనే ఏటిఎం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.