చిత్తూరు

జిల్లాకు 5 వేల ఈ-పాస్ యంత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 19: చిత్తూరు జిల్లాలో ప్రజల సౌకర్యార్థం 5వేల ఈ పాస్ యంత్రాలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ గిరీషా చెప్పారు. తిరుపతి డివిజన్‌లోని శ్రీ విద్యానికేతన్ కళాశాల, పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో విద్యార్థులతో నగదు రహిత లావాదేవీలపై అవగామన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఎస్వీయూ కాలేజ్ డెవలప్‌మెంట్ డీన్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ కాలేజీ ప్రిన్సిపాళ్లతో నగదు రహిత సేవలపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 400 మీసేవ కేంద్రాల్లో నగదు లావాదేవీలు జరపడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. రూపే కార్డులను యాక్టివేట్ చేయడంతోపాటుగా విద్యార్థులకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ప్రిన్సిపాళ్లను కోరారు. గ్రామాల్లో నగదు రహితసేవలపై ప్రజలకు అవగామన కల్పించేందుకు ఒక్కో కళాశాల రెండు గ్రామాల చొప్పున దత్తత తీసుకోవాలన్నారు. ప్రతి పెట్రోల్ బంక్, గ్యాస్ డీలర్లు దగ్గర, చౌకదుకాణాలలో ఈపాస్ యంత్రాలను పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సంయుక్త కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా తిరుపతి సబ్ కలెక్టర్ నిషాంత్‌కుమార్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఇప్పటికే 610 ఈపాస్ యంత్రాలు పనిచేస్తున్నాయని, త్వరలో 500 పాస్ యంత్రాలను డివిజన్‌లో అన్ని మండలాలలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయూ రిజిస్ట్రార్ దేవరాజులునాయుడు,డి ఆర్ డి ఏ పి డి రవిప్రకాష్, సాంఘిక సంక్షేమశాఖ జెడి విజయకుమార్, బిసి కార్పొరేషన్ ఉపసంచాకులు శ్రీనివాసకుమార్, బ్యాంక్ అధికారులు లక్ష్మీనారాయణ, మురళీకృష్ణ, ప్రొఫెసర్ నవళినీకుమారి, ప్రొఫెసర్ కాత్యాని విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
నోట్ల రద్దుతో రద్దీ తగ్గినా..
వెంకన్న ఆదాయానికి కొరతలేదు

* 10 రోజుల్లో 29.12కోట్లు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, నవంబర్ 19: దేశంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తూ ఈనెల 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేసిన నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ తగ్గినా వెంకన్న ఆదాయం మాత్రం గత ఏడాది కన్నా ఈసారి రూ.7కోట్లు పెరిగింది. ఈనెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానులక ద్వారా రూ.29.12 కోట్లుగా లెక్కతేలింది. అయితే హుండీలో సమర్పించిన కానుకల్లో పాత రూ.500, రూ.1000నోట్లు అత్యధికంగా ఉన్నట్లు సమాచారం. గతేడాది 10 రోజుల్లో రూ.21.91 కోట్లు హుండీ ద్వారా ఆదాయం లభించింది. గతేడాది నవంబర్ 9వ తేదీన రూ.3.24కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది రూ. 2.76కోట్లు ఆదాయవం వచ్చింది. అలాగే గతేడాది 10వతేదీన రూ.1.50కోట్లు, ఈ ఏడాది రూ.2.28 కోట్లు, 11వ తేదీన రూ.2.13కోట్లయితే ఈ ఏడాది రూ. 3కోట్లు లభించింది. గతేడాది 12వ తేదీన రూ.1.48కోట్లతే ఈ ఏడాది రూ. 2.79 కోట్లు, గతేడాది 13న రూ.2.47 కోట్లయితే ఈ ఏడాది రూ.2.95 కోట్లు వచ్చింది. గతేడాది 14న రూ. 2.3 కోట్లయితే ఈ ఏడాది రూ. 3కోట్లు లభించింది. గతేడాది 15న రూ. 2.72 కోట్లయితే ఈ ఏడాది రూ. 3.31 కోట్లు, గతేడాది 16 రూ. 2.38 కోట్లయితే ఈడాది రూ. 2.84కోట్లు, గతేడాది 17న రూ. 2.42 కోట్లు వస్తే ఈ ఏడాది రూ. 3.35కోట్లు వచ్చింది. గతేడాది 18న రూ. 1.24 కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది రూ. 3.14కోట్లు ఆదాయం లభించింది. ఈ అదనపుమొత్తాన్ని నల్ల కుబేరులు వేశారో లేక ఈ చెల్లని నోట్లు తమకెందుకని సామాన్య, మధ్య తరగతి ప్రజలు వేశారో ఆ వెంకన్నకే తెలియాలి. ఏదేమైనా గతేడాదికన్నా ఈ ఏడాది సుమారు రూ. 7కోట్లు ఆదాయం లభించడం టిటిడి అధికారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

రాజకీయ లబ్ధికోసమే పాదయాత్ర
* ఏనాడైనా మంజునాథ్ కమీషన్‌ను కలిశారా?
* ముద్రగడపై మంత్రి నారాయణ రుసరుస
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, నవంబర్ 19 : రాజకీయ లబ్ధికోసమే ముద్రగడ పద్మనాభం పాదయాత్రలు చేయడానికి సన్నద్ధం అవుతున్నట్టుందని రాష్ట్ర మంత్రి నారాయణ ఆరోపించారు. శనివారం చిత్తూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నిజంగా ముద్రగడకు కాపులపై ప్రేమ ఉంటే కాపు రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంజునాధ్ కమీషను ఒక్కసారైనా కలిశారా అని ప్రశ్నించారు. గతంలో పలు పదవుల్లో ఉన్నప్పుడు కాపుల గురించి పట్టించుకోని ఆయన నేడు తన ఉనికిని కాపాడు కోవడానికి , ఉద్యమాల పేరుతో రాష్ట్రంలో మారో మారు అల్లకల్లోం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. సొంత లాభం కోసం పాదయాత్రలు చేస్తున్నారే తప్పా కాపుల ప్రయోజనాల కోసం కాదన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఏనాడు కాపుల రిజర్వేషన్ల గురించి ప్రస్తావించని ముద్రగడనేడు ఈ అంశాన్ని రాజకీయం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం వైకాపా కాంగ్రెస్ పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తూ కాపుల ప్రయోజనాలను అడ్డుకొంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా లోటులో ఉన్నా ఇచ్చిన మాట కోసం కాపులకు ఏకంగా వెయ్యి కోట్లను కేటాయంచిన ఘనత చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. ఎన్నికలు ముందు ఇచ్చిన హామీ మేరకు నేడు కాపుల రిజర్వేషన్ల కోసం ప్రత్యేక కమిషన్ వేశారన్నారు. కాపులకు అటు బిసిలకు న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆదిశగానే ముందుక వెళ్తున్నట్టు చెప్పారు. గతంలో ఏప్రభుత్వం చేయని విధంగా కాపుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఉద్యమాలు చేయాలంటే మందుస్తు పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉందని, అలాంటివి పట్టింకోక మరో మారు ప్రతి పక్షాలతో కలసి రాష్ట్రంలో విద్వంస్వం సృష్టించాలని పన్నాగం పన్నుతున్నట్లు చెప్పారు. ముద్రగడ కాపులకు చెడ్డ పేరు తెస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఈవ్యవహారాన్ని ఆసరాగా తీసుకొని నేడు వైకాపా బిసిలను రెచ్చగొట్టి రాష్ట్రంలో అరాచకం సృష్టంచాలని ప్రయత్నిస్తున్నదన్నారు.

ఎస్వీయూ పరీక్షల నియంత్రణాధికారికి
మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, నవంబర్ 19: ఎస్వీయూ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్ష ప్రశ్నా పత్రాల్లో దొర్లిన తప్పులపై ఎస్వీయూ పరీక్ష నియంత్రణాధికారి, సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్‌కు శనివారం విసి ఆవుల దామోదరం ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీటికి మూడు రోజుల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. వారిచ్చే వివరణ ఆధారంగా వారిపై నియమ నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నారు. ప్రశ్నాపత్రాల్లో దొర్లిన తప్పులపై విసి ఆవుల దామోదరం విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.సిలబస్, మోడల్ ప్రశ్నాపత్రాలను, వెలువడిన ప్రశ్నాపత్రాలతో సరిచూసి ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లినట్లు కమిటీ గుర్తించింది. ఈ మేరకు విచారణ కమిటీ, అధికారులు ఈమేరకు విసికి నివేధిక ఇచ్చారు. దీనిపై స్పందించిన విసి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకుంటామని వర్శిటీ అధికారులు తెలిపారు.
లైంగిక వేధింపులపై బాలల్లో అవగాహన పెరగాలి
* ఎస్పీ జయలక్ష్మి పిలుపు
తిరుపతి, నవంబర్ 19: చిన్నపిల్లలపై జరుగుతున్న లైగింక దాడులకు సంబంధించి వారిలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ విజయలక్ష్మి అన్నారు. శనివారం బాలల లైంగిక వేధింపులపై అవగాహన కల్పించడంలో భాగంగా తిరుపతిలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మహతి ఆడిటోరియం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రధాన వీధులు గుండా సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మన చుట్టూ నివసిస్తున్నవారు, పాఠశాలల్లో తదితర ప్రాంతాల్లో చిన్నారి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు ఉన్నారని అన్నారు. తమపట్ల అవతలి వ్యక్తులు ఏలా ప్రవర్తిస్తున్నారో, ఎలా వ్యవహరిస్తున్నారో కూడా చిన్నారులకు తెలియదన్నారు. దీనిని వారు అర్థం చేసుకునే వయస్సు కాకపోవడం, ఎవరికి చెప్పలేక పోవడంతో రెచ్చిపోతున్నవారు మరిన్ని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇది సమాజంపై దుష్పరిణామాలకు దారితీస్తోందని, దీనిని నివారించడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈకార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, మెప్మా పిడి లక్ష్మి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా ఇందిరాగాంధీ జయంతి
చిత్తూరు, నవంబర్ 19: భారతదేశ దివంగత ప్రధాని, మాజీ ఎఐసిసి అధ్యక్షురాలు ఇందిరాగాంధీ 100వ జయంతి వేడుకలను రాష్ట్ర, జిల్లా, యువజన, మహిళా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటి (డిసిసి) అధ్యక్షులు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఇందిరమ్మ చిత్రపటానికి పూలమాలలువేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తమపార్టీ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది చివరి వరకు ‘ఇంటింటా సౌభాగ్యం - ఇందిరమ్మ రాజ్యం ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. దేశానికి ఎంతోచేసి అశువులు బాసిన మాజీ ప్రధాని ఇందిరమ్మ ఆశయాలను నేటి తరానికి తెలియజేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి నాయకుడు, కార్యకర్త సంసిద్దులుగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక ఎంఎస్‌ఆర్ సర్కిల్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాగా ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భోజనపాటి రవీంద్రనాయుడు, చిత్తూరు నగర అధ్యక్షుడు టికారామ్, పిసిసి కార్యనిర్వాహక కార్యదర్శి సిద్దారెడ్డి, పిసిసి కార్యదర్శి రాజగోపాల్, పార్టీ జిల్లా అధికారప్రతినిధి ప్రసాద్, మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సంధ్య, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిషోర్, ఎస్సీ సెల్ విభాగం నగర అద్యక్షులు ఉదయ్‌కుమార్, ఐఎన్‌టియుసి ఆటోవర్కర్స్ యూనియన్ నేత ఖాధర్‌తో పాటు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు పాల్గొన్నారు.
* కాణిపాకంలో పూజలు : దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పార్టీకి పూర్వ వైభవం రావాలని కోరుతూ పిసిసి కార్యదర్శి పరదేశి ఆధ్వర్యంలో శనివారం కాణిపాకం వరసిద్ది వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తొలుత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని నిర్వహించారు. ఆలయంలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధి, ఆమె తనయుడు రాహుల్‌గాంధీ, తనయ ప్రియాంకాగాంధీ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక అర్చనలు చేయించారు.
‘మోదీ ప్రజలకు నరకం చూపిస్తున్నారు’
తిరుపతి: మాజీ ప్రధాని ఇందిరాగాంధి తన సమర్థవంతమైన నాయకత్వంతో దేశాన్ని ప్రగతి బాటలో నడిపిస్తే ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ తన చేతకాని తనంతో ప్రజలకు నరకం చూపిస్తున్నారని తిరుపతి నగర కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు పొలకల మల్లిఖార్జున విమర్శించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధి జయంతిని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఆమె చిత్రపటం ఉంచి పూజలు చేసి, పుష్పాంజలి ఘటించారు. ఈకార్యక్రమంలో ఆపార్టీ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి, వెంకటనరసింహులు, చుక్కలదాము, నైనారు శ్రీనివాసులు, రాంభూల్ రెడ్డి, కుమార్, మస్తాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో
స్థానిక దామినేడులోని ఇందిరాగాంధి విగ్రహానికి శనివారం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరెడ్డి, పిసిసి కార్యదర్శి వెంకట నరసింహులు ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూల మాలలు వేసి నివాళులు అర్పించిన తరువాత కేక్ కేట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఈకార్యక్రమంలో నాయకులు రాజా, టి.ప్రసాద్, చైతన్య, ప్రకాష్, వంశీ, వెంకటేష్, బి.తరుణ్, హర్షవర్థన్ పాల్గొన్నారు.
‘ఉక్కు మహిళ ఇందిరాగాంధీ’
తిరుపతి, నవంబర్ 19: స్వాతంత్రోద్యమకాలంలోను, అటు తరువాత దేశాభివృద్ధిలోను పలు కీలక నిర్ణయాలు, సాహసోపేతమైన పనులు ద్వారా మాజీ ప్రధాని ఇందిరాగాంధి ఉక్కు మహిళగా పేరుగాంచారని కాంగ్రెస్‌పార్టీ నాయకురాలు శ్రీదేవి అన్నారు. ఇందిరాగాంధి జయంతిని పురస్కరించుకుని శనివారం స్థానిక కొర్లగుంటలో ఇందిరా చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి, పిసిసి అధికార ప్రతినిధి దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సింధూజ, డి ఎంసి భాస్కర్, మళ్లీశ్వరి, పూర్ణిమ, శివలక్ష్మి పాల్గొన్నారు.
సహాయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో
భారతరత్న దివంగత ఇందిరాగాంధీ జయంతిని స్థానిక సహాయ విద్యాసంస్థల ప్రాంగణంలో శనివారం కాంగ్రెస్ పార్టీ పిసిసి రాష్ట్ర కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థల స్థాపకులు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు డాక్టర్ పెనుబాల పెంచలయ్య ముందుగా ఇందిరమ్మ చిత్రపటానికి పూల మాలవేసి పుష్పాంజలి ఘటించారు. ఈకార్యక్రమంలోనాయకులు పెనుబాల అశోక్‌కుమార్, సహాయ కళాశాల కరస్పాండెంట్ వై.గీతాదేవి, నాయకులు దామోధరం, వెంకటేశ్వరచౌదరి, రవినాయుడు, నీలకంఠం, శిలామని, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం
తిరుపతి, నవంబర్ 19: స్థానిక శ్రీ కోదంరామాలయంలో కొలువైవున్న శ్రీసీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో టిటిడి ప్రతి నెలా కల్యాణం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం 6గంటలకు శ్రీ సీతారాములు, లక్ష్మణుడి మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు శ్రీరామ జయరామ జయజయ రామ అంటూ భక్తి పారవశ్యంతో రామనామాన్ని జపిస్తుంటే ఉదయం 11 గంటలకు ఆలయంలోని కల్యాణ మండపంలో కల్యాణోత్సవ ఘట్టం ప్రారంభమైంది. వివిధ రకాల పుష్పాలు, పచ్చటి అరటి చెట్లు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించిన వేధికపైకి అర్చకులు వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సుమూహూర్తంలో శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. ప్రపంచానికే ఆదర్శమూర్తయిన శ్రీరామ చంద్రుని కల్యాణ ఘట్టాన్ని తిలకించి భక్తులు ఆనంద పరవశులైయ్యారు. సాయంత్రం 5గంటలకు శ్రీ సీతారామలు, లక్ష్మణుడి ఉత్సవర్లను ఆలయ నాలుగు మాడా వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అక్కడ నుంచి శ్రీ రామచంద్ర పుష్కరణికి ఊరేగిపుంగా తీసుకువచ్చి ఊంజల్ సేవ నిర్వహించారు. ఈకార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డిప్యూటి ఇ ఒ బి.మునిలక్ష్మి, సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
మాస్టర్ ప్లాన్ అమలును వేగవంతం చేయండి

శ్రీకాళహస్తి, నవంబర్ 19: శ్రీకాళహస్తి దేవస్థానం మాస్టర్ ప్లాన్‌ను త్వరగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని దేవస్థానం ట్రస్ట్ బోర్డు అధికారులను ఆదేశించింది. శనివారం అధ్యక్షులు గురవయ్యనాయుడు అధ్యక్షతన శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది. ఇటీవల సి ఎం చంద్రబాబు నాయుడు ఆమోదించిన మాస్టర్ ప్లాన్‌పై ఇఒ భ్రమరాంబ, ఇ ఇ వెంకటనారాయణ ట్రస్ట్ బోర్డుకు వివరించారు. దీనిపై బోర్డు సభ్యులు చర్చించారు. మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయడం వల్ల ఆలయానికి సమీపంలో ఉన్న భవనాలను తొలగించాల్సి ఉంటుందని దీనిపై నివేధిక త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎన్ని భవనాలను తీసుకోవాల్సి ఉంటుంది, ఎంత మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలి అనే విషయాలను త్వరగా తేల్చాలన్నారు. అంతేకాకుండా స్వాధీనం చేసుకున్న భవనాలను వీలయినంతగా తొలగించి ఆలయానికి అవసరమైన నిర్మాణాలను చేపట్టాలన్నారు. సన్నిధివీధిలో జలవినాయకుని ఆలయం నుంచి తూర్పు గోపురం వరకు ప్రహరీగోడ పక్కన క్యూలైన్ ఏర్పాటు చేస్తే భక్తులు ఆలయంలోకి వెళ్లి దక్షిణ గోపురం ద్వారా బయటికి వచ్చేలా ప్లాన్ తయారు చేయాలన్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న గాలిగోపురం పక్కన ఉన్న ప్రైవేట్ స్థలాలను కూడా త్వరగా స్వాధీనం చేసుకుని సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. పుష్పగిరి మఠం వరకు ఉన్న ఆస్తులను తీసుకోవాల్సి ఉంటుందని దాని కోసం కూడా నివేదికను తయారు చేయాలన్నారు. ఈ బోర్డు సమావేశంలో అధ్యక్షుడితోపాటు సభ్యులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
బంగారు కలశాల ఏర్పాటుకు
ముందుకు వచ్చిన దాతలు
శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించిన 21 రాజ కలశాలకు బంగారు పూత వేయడానికి కొందరు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. శనివారం ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు గురువయ్యనాయుడు, ఇ ఓ భ్రమరాంబను కలిసి కళశాలకు బంగారు పూత వేయించడానికి 9మంది దాతలు అంగీకరించారు. వీరిలో శ్రీకాళహస్తి, నాయుడుపేట, చెన్నయ్‌కి చెందిన జయచంద్రనాయుడు, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, అప్పాస్వామి, మధుసూధన్‌రెడ్డి, ఆంజనేయవర్మ, రమేష్‌బాబు, రాజేష్ నాయుడు, వెంకటేశ్వర్లు ఉన్నారు. అలాగే అన్నదాన పథకానికి శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన భానుప్రకాష్ అనే వ్యక్తి రూ.50 వేలు తన తండ్రి జ్ఞాపకార్థం ట్రస్ట్‌బోర్డు అధ్యక్షునికి అందించారు. హైదరాబాదుకి చెందిన కనకదుర్గ అనే భక్తురాలు అన్నదాన పథకానికి రూ.50వేలు విరాళంగా అందించారు.

తిరుమలలో పరిశుభ్రత భేష్
* స్వచ్ఛ్భారత్ కమిటీ సభ్యులు వెల్లడి
తిరుపతి, నవంబర్ 19: తిరుమలలో పాటిస్తున్న పరిశుభ్రత ఎంతో బాగుందని దీనిని దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తామని స్వచ్ఛ్భారత్ కమీటీ సభ్యులు తెలిపారు. తిరుమలలో పరిశుభ్రతను పరిశీలించడానికి శుక్రవారం తిరుపతికి చేరుకున్న 10 ఆధ్యాత్మిక క్షేత్రాల స్వచ్ఛ్భారత్ కమిటీ సభ్యులు శనివారం తిరుమలకు చేరుకుని శ్రీవారిన దర్శించుకున్నారు. వీరికి తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు దర్శన ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు అందిస్తున్న స్వామి వారి ప్రసాదం, అన్నప్రసాదం అద్భుతంగా ఉన్నాయన్నారు. ప్రధానంగా తిరుమలలో పరిశుభ్రతతకు తీసుకుంటున్న చర్యలు అమోఘమన్నారు. తాము ఇక్కడ పరిశీలించిన విధానాలను వైష్ణవి దేవి ఆలయంతోపాటు ప్రముఖ ఆలయాల్లోకూడా అమలు చేయడానికి కృషి చేస్తామని చెప్పారు.
వైద్యపరిజ్ఞానాన్ని పెంచుకుని పేదలకు ఉత్తమ వైద్యసేవలు అందించం
డి
* స్విమ్స్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్

తిరుపతి, నవంబర్ 19: నిరంతర వైద్య విద్యా కార్యక్రమాల్లో వైద్య విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ వైద్య పరిజ్ఞానాన్ని మెరుగు పరచుకొని అత్యున్నతమైన వైద్య సేవలను పేద ప్రలజకు అందించాలని స్విమ్స్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ కోరారు.