చిత్తూరు

1న, వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 17: నూతన ఆంగ్ల సంవత్సరం 2017 జనవరి 1, జనవరి 8,9వ తేదీలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు. శనివారం ఉదయం ఇ ఓ అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఆలయం ఎదుట ఇ ఓ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎదురైన ఆటుపోట్లను సవరించుకొని మరింత ఉన్నతంగా భక్తులకు దర్శనం, అన్నప్రసాదాలు, బస తదితర వసతులు కల్పిస్తామన్నారు. గతేడాది చేసిన ఏర్పాట్లను కొనసాగిస్తూనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన చర్యలు చేపడతామన్నారు. భక్తుల సహకారంతో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. అంతకుముందు అలిపిరి మార్గంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. భాష్యకారుల సన్నిధి వద్ద ఉన్న ప్రథమ చికిత్స కేంద్రంలో భక్తులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నడకమార్గంలో ఎదురవుతున్న సమస్యలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, రోడ్డుకు ఇరువైపులా గోడల మరమ్మతులు చేపట్టాలని , పైప్‌లైన్ ఏర్పాటుచేయాలని, భక్తుల్లో ఆధ్యాత్మిక భావన పెంచేలా శ్రీవారి కీర్తనలు వినిపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జి ఎన్ సి టోల్‌గేట్ వద్ద ఉన్న సమాచార కేంద్రాన్ని పరిశీలించారు. 2017 డైరీలు, క్యాలెండర్ల విక్రయాలను అడిగి తెలుసుకున్నారు. తిరుమలలోని అన్ని సమాచార కేంద్రాల్లో డైరీలు, క్యాలెండర్లను విరివిగా భక్తులకు అందుబాటులో ఉంచాలని ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ టి.రవిని ఆదేశించారు. అనంతరం శ్రీవారి ఆలయంలో జనవరి 1, వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను ఇ ఓ పరిశీలించారు. భక్తుల రద్దీకి తగ్గట్టు చేయాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఇ ఓ వెంట శ్రీవారి ఆలయ డెప్యూటీ ఇ ఓ కోదండరామారావు, పేష్కార్లు సెల్వం, అశోక్, వి ఎస్ ఓ రవీంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శర్మిష్ట ఇతర అధికారులు పాల్గొన్నారు.
పూలమండీలు, చిల్లర దుకాణాలు భస్మీపటలం
* 10లక్షల ఆస్తినష్టం
*ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మున్సిపల్‌చైర్మన్ పరిశీలన
మదనపల్లె, డిసెంబర్ 17: అర్ధరాత్రి విద్యుత్‌షాక్ సర్కూట్‌తో సుమారు 12 పూలమండీలు, చిల్లర దుకాణాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈసంఘటన శుక్రవారం అర్ధరాత్రి మదనపల్లె నడిబొడ్డున బెంగళూరు బస్టాండులో చోటుచేసుకుంది. వివరాల మేరకు మదనపల్లె పట్టణ నడిబొడ్డున బెంగళూరు బస్టాండు ప్రాంతంలో మున్సిపల్ స్థలంలో సుమారు పాతికేళ్ళుగా పూలమండీలు, చిల్లర దుణాకాలు, టీకొట్లలో సుమారు పాతిక కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు బస్టాండు ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో విద్యుత్‌షాక్ సర్కూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, ఆసమయంలో ఎవరూ లేకపోవడంతో మంటలు విస్పోటకంగా చెలరేగాయి. అగ్నిప్రమాదం నుంచి సెగలు, విపరీతమైన పొగ వాసన పసిగట్టిన సమీప వ్యాపారులు అగ్నిమాపక కార్యాలయానికి, అక్కడి వ్యాపారులకు సమాచారం అందించారు. అగ్నిప్రమాద కేంద్ర వాహనం హుటాహుటిన రావడంతో ప్రక్కనే ఉన్న మరిన్ని పూలమండీలు, చిల్లరదుకాణాలు అదుపుచేయగలిగారు. అప్పటికే 8పూలమండీలు, రెండు చిల్లర దుకాణాలు, ఒక టీకొట్టు సైతం భష్మీపటలమైయ్యాయి. శనివారం ఉదయం మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్, వైస్‌చైర్మన్ భవాని ప్రసాద్ అగ్నిప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన నష్టంపై రెవెన్యూ అధికారులు సుమారు రూ.10లక్షల వరకు నష్టం జరిగిందని అంచనాలు వేశారు.
శ్రీవారి వైభవ రూపకర్త
శ్రీమాన్ సాధుసుబ్రహ్మణ్య శాస్ర్తీ
* శే్వత సంచాలకులు డాక్టర్ తాళ్లూరు ఆంజనేయులు
తిరుపతి, డిసెంబర్ 17: తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి కృషిచేసిన మహనీయుడు సాదు సుబ్రహ్మణ్య శాస్ర్తీ అని టిటిడి శే్వతా సంచాలకులు డాక్టర్ తాళ్లూరు ఆంజనేయులు అన్నారు. సుబ్రహ్మణ్యశాస్ర్తీ 127వ జయంతిని పురస్కరించుకొని శనివారం శే్వత భవనం ఎదురుగా ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా శే్వత సంచాలకులు మాట్లాడుతూ శ్రీవారి ఆలయ పేష్కార్‌గా ఉంటూ ఎపి గ్రాఫిస్టుగా 1167 రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించినట్లు చెప్పారు. అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా రాగి రేకులను వెలకితీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చినట్లు వివరించారు. వీటిని 1931వ సంవత్సరంలోనే ఎపిగ్రాఫిక్స్ సీరిస్‌గా మద్రాసులోని తిరుపతి శ్రీమహంతుల ప్రెస్‌లో ప్రచురించినట్లు తెలిపారు. దేవస్థానం ఉద్యోగిగా మాత్రమే కాకుండా పురాతన వస్తు పరిశోధనా శాస్తవ్రేత్తగా స్వామివారి వైభవాన్ని మొట్టమొదటి సారిగా ఎలుగెత్తి చాటిన ఘనత శాస్ర్తీకి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యశాస్ర్తీ చిన్నకుమార్తె సాధు, గిరిజ, శిష్యుడైన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి, శే్వత సిబ్బంది పాల్గొన్నారు.

‘సాదాసీదాగా వచ్చాను... సామాన్య భక్తులకు పెద్ద పీట వేశాను’

* టిటిడి ఇఒగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సాంబశివరావు
* కాలినడకన వెళ్లి మొక్కులు తీర్చుకున్న ఇ ఓ
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, డిసెంబర్ 17: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరుని కొలువుకు సాదాసీదాగా వచ్చిన డాక్టర్ దొండపాటి సాంబశివరావు సామాన్య భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట వేసి తన కార్యదక్షతను చాటుకున్నారు. టిటిడిలో ఇఒగా బాధ్యతలు నిర్వహించడం అంటే ఏ ఐఏఎస్ అధికారికైనా కత్తిమీద సాములాంటిదే. అందుకు ప్రధాన కారణం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరిన క్షేత్రంలో ఏచిన్న సంఘటన జరిగినా అది విశ్వవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. అయితే మంచి పనుల కన్నాకొన్ని సందర్భాల్లో జరిగే చిన్నచిన్న పొరబాట్లు పెద్ద దుమారాన్ని రేపుతాయి. వాటిని తట్టుకుని పనిచేయడమంటే అంతసులభం కాదన్నది ఇప్పటి వరకు పనిచేసిన ఐఏఎస్ అధికారులకు తెలియని అంశం కాదు. ఇక సౌకర్యాల అంశాలను పరిశీలిస్తే ఒక రాజ్యాధికారి అయిన రాజుకు ఉండే రాజమర్యాదలు, గౌరువాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గత రెండు సంవత్సరాల క్రితం డిసెంబర్ 17వ తేదీన టిటిడి కార్యనిర్వహణాధికారిగా సాంబశివరావు బాధ్యతలు స్వీకరించారు. గౌరువ మర్యాదలకు అలవాటు పడకుండా తాను టిటిడిలో ఒక గురుతర బాధ్యతలు తెలిసిన ఉద్యోగిని మాత్రమేనని భావించి నిరంతరం సామాన్యభక్తులకు మెరుగైన వసతులు కల్పించడం కోసం అధునిక పరిజ్ఞానాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. సర్వసాధారణంగా టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడింది అంటే శ్రీవారి కొలువులో ఇ ఒగా పనిచేయడం మరో అగ్ని పరీక్షే. అయితే సాంబశివరావు టిటిడి ధర్మకర్తల మండలికి చైర్మన్ అయిన చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని బోర్డు సభ్యులను వారిని నొప్పించకుండా వారిచేతనే సామాన్య ప్రజలకు పెద్దపీట వేయడంలో సఫలీకృతుడయ్యాడనే చెప్పాలి. మితభాషిగా కనిపించే సాంబశివరావుఅవసరమైనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో అపరిచితుడిని తలపిస్తాడనే చెప్పాలి. అంతేకాదు మరో భారతీయుడనే చెప్పాలి. ముఖ్యంగా రూ.300 టికెట్లను, ఆర్జిత సేవలను వేల సంఖ్యలో ఆన్‌లైన్లో పెట్టి దళారీల ఆటకట్టించి, శ్రీవారి భక్తుల మన్ననలు పొందారు. ఉద్యోగుల విషయంలోను న్యాయమైన సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి నాన్చుడు ధోరణితో వ్యవహరించకుండా తక్షణ నిర్ణయాలు తీసుకునే అధికారిగా కూడా గుర్తింపుపొందారు. ఇక ఈయనకు కుడి, ఎడమలుగా తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు, తిరుపతి జెఇఓ పోలభాస్కర్, ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి అడిషినల్ ఎఫ్ అండ్ సిఏఓ బాలాజీ, సి ఇ చంద్రశేఖర్ రెడ్డి తమ వంతు విధులను నిర్వహించడం, ఇఒ నిర్ణయాల విజయాల వెనుక తమవంతు పాత్ర పోషించారు. ఇదిలావుండగా రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో శనివారం సాంబశివరావు కాలినడకన తిరుమలకు వెళ్లి తలనీలాలు సమర్పించాక, స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. కాలినడకన భక్తుల కోసం ఏర్పాటుచేసిన వైద్య సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. తాను శ్రీవారి భక్తులకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా అది స్వామివారి ఆశీస్సులతో, ఉద్యోగస్థుల సహకారంతోనే సాధ్యమయ్యిందని చెప్పి తన నిరాడంబరతను చాటుకున్నారు. ఈసందర్భంగా టిటిడి విశ్రాంత డిప్యూటి ఇ ఒ, ఎస్వీ నాట్యకళాపరిషత్ నాయకులు చిన్నంగారి రమణ, కొత్తపల్లి మునిరత్నం, దండు రుక్మాంగధ రెడ్డిలు శనివారం ఇ ఓను కలసి అభినందించి సన్మానించారు. భక్తులకు, భగవంతుని సేవలో రెండు సంవత్సరాల పూర్తిచేసుకోవడమే కాకుండా ఎస్వీ నాట్య కళాపరిషత్‌కు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 21న జరుగనున్న గరుడ ఉత్సవాల అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అలాగే టిటిడిలోని పలువురు అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఇ ఒను కలసి శుభాకాంక్షలు తెలిపారు.
పర్యాటక రంగంలో ఏపిని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం
* 2020 నాటికి 10వేల కోట్లతో ప్రాజెక్టులు
* శ్రీశైలం నుంచి తిరుపతి వరకు పర్యాటక నగరాల అభివృద్ధి
* పర్యాటక రంగ అభివృద్ధి కమిటీ చైర్మన్ జయరామిరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, డిసెంబర్ 17: పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ముందుకు వెడుతున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కమిటీ చైర్మన్ వి.జయరామిరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో ఏపి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో టూరిజం, ఫుడ్ ప్రాసింగ్ ఔత్సాహితక వేత్తలతో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. రాయలసీమ జిల్లాలోపాటు నెల్లూరు, ఆధ్యాత్మిక నగరాల ప్రాంతాలపై ప్రత్యేక పర్యాటక విధానాన్ని సి ఎం రూపొందించారని చెప్పారు. 2020 నాటికి రూ. 10వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులతో 5లక్షల ఉద్యోగాలను తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఇందుకోసం ఏరాష్ట్రంలోను ఇవ్వనన్ని రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేలా రూపకల్పన చేసినట్లు తెలిపారు. రాయలసీమలోని 7 పుణ్య క్షేత్రాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. పర్యాటక పరంగా రాష్ట్రాన్ని 9 పెద్ద, 42 మధ్య, 19 చిన్న ప్రాజెక్టులుగా విభజించి అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. శ్రీశైలం నుంచి తిరుపతి వరకు ఆధ్యాత్మిక పర్యాటక నగరాలుగా గుర్తించి వాటిని అభివృద్ధి చేయడానికి రూ.70 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.60 కోట్లతో పర్యాటక రంగం ద్వారా పలు అభివృద్ధిపనులు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్ర పర్యాటక రంగం ఎం.డి. గిరిజాశంకర్ మాట్లాడుతూ ఏపికి 970 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతం, గోదావరి, కృష్ణా నదీతీరాలు, అద్భుతమైన ద్వీపాలు ఉన్నాయన్నారు. ప్రతి ప్రాంతంలోను 5,3,2 నక్షత్ర హోటల్స్, బొటానికల్ గార్డెన్స్, రెస్టారెంట్లు, అమ్యూజిమెంట్ పార్కులు, మ్యూజియంలు, ఫుడ్‌కోర్టులు, జలసాహస క్రీడలు ఏర్పాటు చేయడానికి ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలోనే ప్రైవేట్ పద్ధతిలోనే 885 కోట్లు రూపాయల విలువైన ప్రాజెక్టులు రానున్నాయన్నారు. పర్యాటక ప్రాజెక్టుల్లో పన్ను మినహాయింపు, వౌలిక వసతుల అభివృద్ధి బాధ్యత ప్రభుత్వానిదేనని, 21 రోజుల్లో ప్రాజెక్టులు అప్పగించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో టూరిజం సబ్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, రాయలసీమ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.్భస్కర్, రీజనల్ టూరిజం డైరెక్టర్ చంద్రవౌళి, జిల్లా టూరిజం అధికారి డి.చంద్రవౌళి రెడ్డి, అధికారులు సురేష్‌కుమార్ రెడ్డి, తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మంజునాథ్, ఐదు జిల్లాలకు చెందిన వివిధ హోటల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇస్కాకు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తాం
* రాయలసీమ రేంజ్ ఐజి శ్రీ్ధర్‌రావు వెల్లడి
తిరుపతి, డిసెంబర్ 17: ఎస్వీ యూనివర్శిటీలో జనవరి 3వ తేదీ నుంచి జరుగునున్న ఇస్కా సమావేశాలకు దేశం నలు మూలల నుంచి వస్తున్న ప్రతినిధులకు పటిష్టమైన భద్రత కల్పిస్తామని రాయలసీమ రేంజ్ ఐ జి శ్రీ్ధర్‌రావు తెలిపారు. శనివారం ఆయన అనంతపురం రేంజి డి ఐ జి ప్రభాకర్‌రావు, తిరుపతి ఎస్పీ జయలక్ష్మిలతో కలసి ఆయన కమాండ్ కంట్రోల్ రూమును, వర్శిటీలో సమావేశాలు జరిగే ప్రాంతాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన ఇతర విభాగాల అధికారులతో కలసి సమన్వయం చేసుకుంటామన్నారు. సమావేశాలు జరిగే ప్రాంతాలే కాకుండా తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, చిత్తూరును ఒక సెక్యూరిటీ జోన్‌గా ఏర్పాటు చేస్తామన్నారు. విఐపిలకు ప్రత్యేక భద్రతలో శిక్షణ పొందిన సిబ్బందితో భద్రత కల్పిస్తామన్నారు. ఇస్కా సమావేశాలకు విచ్చేసే ప్రతినిధులతో స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించడంపై శిక్షణ ఇస్తున్నామన్నారు.

తుఫాన్ పంటనష్టంపై ప్రభుత్వానికి నివేదిక
* 1,821 హెక్టార్లలో పంటలకు అపార నష్టం
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, డిసెంబర్ 17: జిల్లా వార్దా తుఫాన్ తాకిడికి చోటు చేసుకొన్న పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు డిఆర్‌ఓ విజయ్ చందర్ తెలిపారు. శనివారం చిత్తూరులో విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల వార్ధా తుఫాన్ కారణంగా తూర్పు మండలాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టంపై పలుశాఖలు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తరువాత నివేదికులు సిద్ధం చేసినట్లు వివరించారు. ముఖ్యంగా జిల్లాలో సత్యవేడు, నాగలాపురం , నారాయణ వనం, శ్రీకాళహస్తి, వదయ్యపాళ్యం, నగరి, పుత్తూరు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఈ తుఫాన్ వల్ల పంటలక నష్టం వాటిల్లిందన్నారు. ఈ తుఫాన్ కారణంగా వరి 663 హెక్టార్లు, వేరుశనగ 345 హెక్టార్లు, ఉద్దులు 164, పెసలు 16 హెక్టార్లలో నష్టం వాటిల్లగా, ఉద్యాన పంటలకు అపార నష్టం జరిగిందని చెప్పారు. మామిడి, కాయకూరలు, బొప్పాయి, పూలతోటలు తదితర పంటలు 629 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు తెలిపారు. ఉద్యాన పంటలకు సుమారు 6.70 కోట్లు వరకు నష్టం జరిగినట్లు చెప్పారు. అలాగే పశుసంవర్ధక పరిధిలో నాలుగు ఆవులు, ఐదు దూడలు, రెండు గెదలు, మృతి చెందాయని వీటి విలువ సుమారు 2.45 లక్షలుగా అంచనా వేసామన్నారు. తుఫాన్ నేపథ్యంలో వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడి చంద్రగిరి, నాగలాపురం మండలాలు చెందిన ఇద్దరు మరణించారని వారికి ఆర్థిక సహాయాన్ని త్వరలోనే ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కొన్ని చోట్ల కల్వర్టులు, కొన్ని గ్రామీణ రోడ్లు కూడా ధ్వంసం అయ్యాయిని చెప్పారు. పంట నష్టపరిహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. నివేదికలు అందిన తరువాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి తదుపరి నష్టపరిహారాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.

లక్ష రూపాయలతో సంఘమిత్ర లీడర్ పరార్
* ఎంఆర్‌పల్లి పోలీసులను ఆశ్రయించిన బాధిత డ్వ్రాక్రా మహిళలు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, డిసెంబర్ 17: ఎంఆర్‌పల్లి శ్రీనగర్‌నగర్ కాలనీలో ఉన్న 42 డ్వాక్రా మహిళలకు సంబంధించిన సంగమిత్ర లీడర్‌గా ఉన్న స్వప్నకుమారి అనే మహిళ లక్షల రూపాయలతో ఉడాయించడంతో డ్వాక్రా సంఘ మహిళలు ఎంఆర్‌పల్లి పోలీసులను ఆశ్రయించిన సంఘటన శనివారం తిరుపతిలో జరిగింది. లక్షల రూపాయలు రుణాలు ఉన్నారంటూ బ్యాంకు అధికారులు డ్వాక్రా మహిళల సంఘ సభ్యుల వద్దకు రావడంతో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే గత 16 సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా ఉన్న స్వప్నకుమారిని 42 సంఘాల సభ్యులు నమ్మి వారు తీసుకున్న రుణాలను ఆమెకు చెల్లించేవారు. గత 15 రోజులక్రితం స్వప్నకుమారి పరారైంది. రుణాలు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు డ్వాక్రా మహిళల వద్దకు రావడంతో వారు ఖిన్నులయ్యారు. తమ రుణాలు ఎప్పుడో చెల్లించాసమని మొరపెట్టుకున్నారు. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే కొంతమంది మహిళలు బ్యాంకులో రుణాలు తీసుకోకపోయినా వారి పేరు మీద లక్షల రూపాయలు రుణాలు ఉన్నట్లు అధికారులు చెప్పడంతో మహిళలు షాక్‌కు గురయ్యారు. తమ అనుమతి లేకుండా, తమ సంతకాలు లేకుండా రుణాలు ఇవ్వడం వెనుక సంగమిత్ర అధికారి మునిలక్ష్మి బ్యాంక్ అధికారులకు కూడా సంబంధాలు ఉన్నట్టు మహిళలు ఆరోపిస్తున్నారు. వెంటనే మునిలక్ష్మిని అరెస్టు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఫిర్యాదు చేసి కోరారు.
‘పెట్రో ధరలు తగ్గించాలి’
తిరుపతి, డిసెంబర్ 17: పెంచిన పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో శనివారం సిపిఐ ఆటోను మోస్తూ తమ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో తమ వాహనాలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారం కానున్నాయని అన్నారు. శనివారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఆటోను కర్రలకు కట్టి మోస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఆపార్టీ జిల్లా కార్యదర్శి రామానాయుడు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి హరికృష్ణలు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో ఇప్పటి వరకు 10సార్లు పెట్రోల్, డీజల్ ధరలు పెంచారని అన్నారు.
పెద్దనోట్లు రద్దు చేసి సామాన్య,పేద ప్రజలను నట్టేట ముంచడమే కాకుండా ధరలను పెంచి పేదవాడి బ్రతుకులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజల్ ధరలు పెంచి కార్మికుల జీవితాలను సైతం దెబ్బతీస్తున్నారని మోదీకి, బాబుకు ప్రజలు, కార్మికులు సరైన రీతిలో బుద్ధి చెబుతారని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆపార్టీ నాయకులు చిన్నం పెంచలయ్య, వెంకటరత్నం, పి ఎల్ నరసింహులు, పి.మురళి తదితరులు పాల్గొన్నారు.