చిత్తూరు

జిల్లాకు 145 కోట్లు కొత్త కరెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జనవరి 7: నోట్లు రద్దు నేపధ్యంలో తాజాగా జిల్లాకు 145 కోట్లు కొత్త కరెన్సీ వచ్చింది. శనివారం భారీ బందో బస్తు మధ్య కర్నాటకా రాష్ట్రం మైసూరు నుంచి ప్రత్యేక వాహనం ద్వారా ఈ కరెన్సీని చిత్తూరుకు తీసుకొచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లును రద్దు చేసిన నేపధ్యంలో జిల్లాలో కరెన్సీ కష్టాలు తారా స్థాయికి చేరుకొన్నాయి, గతంలో బ్యాంకులు, ఏటి ఎం ల వద్ద డబ్బుల కోసం జనం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి , పడరాని పాట్లు పడ్డారు. ఈతరుణంలో ఇది వరకే సుమారు తొమ్మిది విడతలుగా కొత్త కెరెన్సీ రావడంతో కొంత వరకు నోట్ల వ్యవహారం సద్దుమణిగింది. తాజాగా జిల్లాకు 145 కోట్లు కొత్త కెరెన్సీ వచ్చింది. ఇందులో ఇండియన్ బ్యాంకుకు 75 కోట్లు, ఎస్ బి ఐ కి 30 కోట్లు, ఆంధ్రాబ్యాంకుకు 40 కోట్లును కేటాయించారు. ఈ ప్రధాన బ్యాంకుల ద్వారా జిల్లాలోని మిగిలిన 40 బ్రాంచులకు ఈ మొత్తాన్ని బ్యాంకు అధికారులు పంపిణీ చేయనున్నారు. దీంతో నోట్ల సమస్య కొంత వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు
పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు
తిరుపతి, జనవరి 7: ఎస్వీ యూనివర్శిటీలో జరుగుతున్న ఇస్కా సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించడానికి శనివారం సాయంత్రం కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి, ఎగ్జిబిషన్‌ను రద్దుచేసినట్లు తెలుసుకుని తీవ్ర నిరాశకు గురైయ్యారు. ఈనెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన సైన్స్ కాంగ్రెస్ సందర్బంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌కు ప్రతి రోజు 25వేల మంది విద్యార్థులు సందర్శిస్తారని అంచానవేశారు. అయితే దాదాపు ఈ ఐదు రోజుల్లో 5లక్షల మంది వరకు సందర్శించడం గమనార్హం. కాగా శనివారం ఇస్కా సమావేశాలు ముగియడంతో సాయంత్రం 4గంటలకే ఎగ్జిబిషన్‌ను మూసివేసినట్లు ప్రకటించారు. అయితే దీనిన సందర్శించడానికి అప్పటికే క్యూలో ఉన్న వారిని, సందర్శించడానికి వచ్చిన వారిని సైతం లోనికి అనుమతించకుండా వెనెక్కి పంపేశారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం తీవ్ర నిరాశకు గురైయ్యారు. కాగా శనివారం సైతం పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.
రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమపథకాలు అమలు
*కలికిరి జన్మభూమి-మాఊరు గ్రామసభలో జడ్‌పి చైర్మన్
కలికిరి, జనవరి 7: రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నది టిడిపి ప్రభుత్వం అని జడ్‌పి చైర్మన్ గీర్వాణి అన్నారు. శనివారం మండలంలోని నగిరిపల్లెలో పార్టీ నాయకులు నల్లారి తిమ్మారెడ్డి అధ్యక్షతన జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. అన్ని వర్గాలకు సమన్వయంతో అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు వలనే సాధ్యం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని మాజీ ఎంపి సాయిప్రతాప్ అన్నారు. ప్రజలు చైతన్యవంతులై ప్రభుత్వం పథకాలపై అవగాహన పెంచుకోవాలని టిడిపి ఇన్‌చార్జ్ ఇక్బాల్‌అహ్మద్ అన్నారు. అనంతరం రేషన్‌కార్డులు, పించన్లు, ప్రక్క ఇళ్ళు తదితర వాటిపై ప్రజలు అర్జీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నట్రజన్, ఎంపిడివో ఇందిరా, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.