చిత్తూరు

జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జనవరి 8: జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న మూడు రెవెన్యూ డివిజన్లు ఇకపై ఐదు కానున్నాయి. ప్రస్తుతం చిత్తూరు, మదనపల్లి, తిరుపతి కేంద్రాలుగా రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం కొత్తగా మరో రెండు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో తాజాగా శ్రీకాళహస్తి, కుప్పం ప్రాంతాలు కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాలు దాదాపుగా ఖరారయ్యాయి. ఈ మేరకు అధికారులు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లాలో గతంలో చిత్తూరు డివిజన్ పరిధిలో 20 మండలాలు, తిరుపతిలో 14, మదనపల్లిలో 31 మండలాలు ఉండగా, వీటిని విభజించి పాలనాపరంగా వీలు ఉండేలా శ్రీకాళహస్తి, కుప్పం కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అనేక సంవత్సరాలుగా జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు వాదన వినపడుతూనే ఉంది. తాజాగా ఇటీవల రాష్ట్ర విభజన అనంతరం కొత్త రెవెన్యూ డివిజన్ల సంఖ్య పెంచాలని నిర్ణయించడంతో పాటు జిల్లాను ఐదు రెవెన్యూ డివిజన్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో శ్రీకాళహస్తి కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఖరారు కాగా, కుప్పంపై కొంత తర్జనభర్జన కొనసాగింది. పలమనేరును రెవెన్యూ డివిజన్‌గా చేయాలని అ ప్రాంతవాసులు ఇటీవల ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పంను కొత్త రెవెన్యూ డివిజన్‌గా అధికారులు నిర్ణయించి ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. కొత్త ప్రతిపాదనల మేరకు కుప్పంలో ఆరు మండలాలు, చిత్తూరులో 15, శ్రీకాళహస్తి పరిధిలో 11, మదనపల్లి డివిజన్‌లో 20 మండలాలు రానున్నాయి. అయితే గంగవరం మండలాన్ని ఏ డివిజన్‌లో చేర్చాలన్నది స్పష్టం కావడంలేదు. జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్ల వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చింది. అయితే అధికారులు జిల్లాలోని 65 మండలాలను ఈ డివిజన్లకు కేటాయిస్తూ ప్రతిపాదనలు తయారు చేశారు. కొత్త డివిజన్ల ప్రకారం మదనపల్లి పరిధిలోకి తంబళ్లపల్లి, బి.కొత్తకోట, కురబలకోట, పెద్దమండ్యం, మొలకలచెరువు, పిటిఏం, పీలేరు, వాల్మీకిపురం, గుర్రంకొండ, కలికిరి, కలకడ, కె.వి.పల్లి, మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం, పుంగనూరు, పలిచెర్ల, రొంపిచెర్ల, చౌడేపల్లి, సోమల మండలాలు, శ్రీకాళహస్తిలో డివిజన్ పరిధిలో శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, తొట్టంబేడు, సత్యవేడు, నారాయణవనం, కెవిబిపురం, బిఎన్ కండ్రిగ, వరదయ్యపాళ్యం, నాగలాపురం, పిచ్చాటూరు, మండలాలు రానున్నాయి, కుప్పం రెవెన్యూ డివిజన్‌లో కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లి, వి.కోట, బైరెడ్డిపల్లి మండలాలు చేరనున్నాయి. చిత్తూరు డివిజన్‌లో జి.డి.నెల్లూరు, పెనుమూరు, కార్వేటినగరం, వెదురకుప్పం, పాలసముద్రం, ఎస్‌ఆర్ పురం, చిత్తూరు, గుడిపాల, పూతలపట్టు, యాదమరి, బంగారుపాళ్యం, తవణంపల్లి, ఐరాల, పలమనేరు, పెద్దపంజాణి మండలాలు, తిరుపతి డివిజన్‌లోకి చంద్రగిరి, రామచంద్రాపురం, తిరుపతి రూరల్, పాకాల, చిన్నగొట్టిగళ్లు, ఎర్రావారిపాళ్యం, నగరి, పుత్తూరు, వడమాలపేట, నిండ్ర, విజయపురం, సదుం మండలాలు రానున్నాయి. జిల్లాను ఐదు రెవెన్యూ డివిజన్లను ఈ మేరకు విభజించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

వైకుంఠ ఏకాదశి పర్వదినాన
శ్రీవారిని దర్శించుకున్న లక్ష మంది భక్తులు

తిరుపతి, జనవరి 8: వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలేశుని ఆదివారం సుమారు లక్షమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టే టిటిడి అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. 90శాతం మంది భక్తులు ఏర్పాట్లపై సంతృప్తి వ్యకం చేయగా 10శాతం మంది తమను పట్టించుకోలేదంటూ, సదుపాయాలు కల్పించలేదంటూ విమర్శించారు. ఇక విఐపిల సంఖ్యను 3వేల లోపే కుదించడంతో సామాన్య భక్తుల దర్శనానికి ఎక్కువ సమయం కేటాయించే అవకాశం కలిగింది. కాగా ఆదివారం తెల్లవారు జామున 1 గంటల నుంచి టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు, జె ఇ ఓ లు శ్రీనివాసరాజు, పోలభాస్కర్‌లు, సి వి ఎస్ ఓ రవీంధ్రనాథ్ రెడ్డితోపాటు అన్ని విభాగాల అధికారులు భక్తుల క్యూలైన్లను పర్యవేక్షిస్తూ చర్యలు చేపట్టారు. ఉదయం 4గంటల నుంచే అల్పాహారం, టీ, పాలు, కాఫీలు అందించడం ప్రారంభించి అర్థరాత్రి ఒంటి గంట వరకు నిరంతరాయంగా కొనసాగించారు. ఇక భోజన వసతిలో కూడా ఎలాంటి కొరతలేకుండా జాగ్రత్త పడ్డారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 6లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచడంతో ప్రసాదాల కొరతకూడా లేకుండా పోయింది. ఇదిలావుండగా ఆలయంలో పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణతోపాటు వైభవోత్సవ మండపం పక్కన సప్తద్వారాలతో ఏర్పాటు చేసిన మహావిష్ణువు సెటింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9 నుంచి 11 గంటలకు స్వామి, అమ్మవార్లు స్వర్ణరథాన్ని అధిరోహించి ఉత్తరమాడా వీధుల్లో విహరించారు. ఈసందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నారు.
నేటి అర్థరాత్రి వరకే వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన అత్యంత విశిష్టత ఉన్న ఉత్తర వైకుంఠద్వార దర్శనం సోమవారం అర్థరాత్రి వరకే పరిమితం చేశారు. వైకుంఠద్వార దర్శనం చేసుకుంటే, సర్వపాప హరణం జరిగిన వైకుంఠప్రాప్తి లభిస్తుందనే భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ నేపధ్యంలో శనివారం అర్థరాత్రి తరువాత, ఆదివారం వేకువ జామున ఆలయాన్ని తెరిచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ఆతరువాత వి ఐ పి లను, సామాన్యులను అనుమతించారు. కాగా ఈ క్రమంలో ఏకాదశి, ద్వాదశి రోజుల్లో భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వారాలు తెరచివుంచుతారు. ఈనేపథ్యంలో సోమవారం ద్వాదశి రోజున అర్థరాత్రి ఒంటి గంట వరకు ఈ ఉత్తర ద్వారం గుండా భక్తులను అనుమతిస్తారు.

నోట్ల మార్పిడి ముఠా గుట్టు రట్టు

* పోలీసుల అదుపులో నిందితులు

చిత్తూరు, జనవరి 8: కొత్త నోట్లు ఇస్తే మూడింతలు పాత నోట్లు ఇస్తామని నమ్మించి ఓ ముఠా తొమ్మిది లక్షలతో ఉడాయించిన సంఘటన ఐరాల మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో కొందరిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన రాణి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేది. వ్యాపారం నిమిత్తం చిత్తూరుకు వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలో రాణితో చిత్తూరుకు చెందిన శేఖర్‌నాయుడుకు పరిచయం ఏర్పడింది. ఇటీవల కేంద్రప్రభుత్వం నోట్లను రద్దుచేసిన నేపథ్యంలో వీరిరువురు మరికొందరితో కలిసి నోట్ల మార్పిడి వ్యవహారాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో శేఖర్‌నాయుడుకు కాణిపాకం గ్రామానికి చెందిన రఫీ, ఇరాల మండలం పందికొట్టూరుకు చెందిన వాసులతో ఇది వరకే పరిచయం ఉంది. కొత్తనోట్లు ఇస్తే దానికి మూడింతల పాత నోట్లు ఇస్తామని శేఖర్‌నాయుడు ముఠా రఫి, వాసులను మభ్యపెట్టారు . దీంతో అత్యాశకుపోయిన రఫి రూ.5 లక్షలు, వాసు రూ.4 లక్షల కొత్త నోట్లు ఇచ్చి అంతకు మూడింతలు పాత నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తొమ్మిది లక్షల కొత్త నోట్లు తీసుకొని అగరంపల్లి సమీపంలోని మామిడితోపు వద్దకు వస్తే అక్కడ మూడింతల పాత నోట్లను ఇస్తామని ముఠా సభ్యులు తెలపడంతో, రఫి, వాసు తొమ్మిది లక్షలు తీసుకుని మామిడితోపులో వేచి ఉన్నారు. ఇంతలోనే అక్కడికి కారులో వచ్చిన నకిలీ పోలీసులు వారిని బెదిరించి ఇంత కొత్త కరెన్సీ ఎక్కడిది అంటూ వారి వద్దనున్న తొమ్మిది లక్షల కొత్త కరెన్సీని లాక్కొని, విచారణ నిమిత్తం చిత్తూరు పోలీసుస్టేషన్‌కు రావాలని చెప్పి కారులో నగదుతో పరారయ్యారు. దీంతో పోలీసుస్టేషన్‌కు వెళ్తే మరిన్ని కష్టాలు వస్తాయన్న భయంతో రఫి, వాసు గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ వ్యవహారం జరిగి రెండు వారాలైంది. అయితే వచ్చింది నకిలీ పోలీసులన్న విషయాన్ని గుర్తించిన బాధితులు ఆ తరువాత కాణిపాకం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠాలోని కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాణిపాకం ఎస్సై నరేష్‌కుమార్ తెలిపారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుపతి, జనవరి 8: తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పలువురుప్రముఖులు ఆదివారం స్వామివారిని ఉత్తరద్వారం గుండా వెళ్లి దర్శించుకుని పునీతులయ్యారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు, వైసిపి ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే లారి ఆదిత్య, ఎమ్మెల్సీ ప్రభాకర్, ప్రముఖ మృదంగ వాయిద్య కళాకారుడు, నటుడు రాక్లిన్‌వెంకేటష్, దర్శకుడు-టిటిడి బోర్డు సభ్యులు రాఘవేంద్రరావు, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, విశే్వశ్వర రెడ్డి, శ్రీనివాసగౌడ్, పుట్టా మధుసూధన్,వివేకానంద, అనిత, వేణుగోపాల్ రెడ్డి, శంకర్, భూమ అఖిలప్రియ, ఎంపి రామ్మోహన్ నాయుడు, శాసన మండలి ఛైర్మన్ చక్రపాణి, సినినటుడు మోహన్‌బాబు, జడ్పీ చైర్మన గీర్వాణి, ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్, స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపి గరికపాటి రామ్మోహన్‌రావు, మంత్రి మృణాళిని, తెలంగాణ డిప్యూటి సి ఎం కడియ శ్రీహరి, వైసిపి ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, రఘుపతి, గాలి జనార్థన్ రెడ్డి, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపి వైవి సుబ్బారెడ్డి, హైకోర్టున్యాయమూర్తి జస్టిస్ శ్యామ్‌ప్రసాద్, ఎంపి మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి రాయపాటి సాంబశివరావు, డి ఐ జి ప్రభాకర్‌రావు, ఎపి క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గంగరాజు, కలెక్టర్ విద్యాసాగర్, ఐ జి శ్రీ్ధర్‌రావు, చెన్నయ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మాల్య, చెన్నయ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సత్య, ఎస్ సి కమీషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎంపి శివప్రసాద్, శాసనమండలి డిప్యూటి ఛైర్మన్ సతీష్ రెడ్డి, విప్ మేడా మల్లిఖార్జున రెడ్డి, ఎమ్మెల్యే సత్యప్రభ, తెలంగాణ మంత్రి మహేంధర్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మంత్రి గంటా శ్రీనివాసరావు, కెమెరామెన్ గోపాల్ రెడ్డి, ఎన్నికల మాజీ చీఫ్ కమీషనర్ గోపాల్ శర్మ, కేంద్రమంత్రి సుజనాచౌదరి తదితరులు శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.
శ్రీనివాసమంగాపురంలో వైకుంఠ ద్వార దర్శనంతో పులకించిన భక్తులు

తిరుపతి, జనవరి 8: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన వైకుంఠ ద్వార దర్శనంతో భక్తులు పులకించిపోయారు. తెలంగాణ రాష్టమ్రంత్రి తలసాని యాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఆదివారం ఉదయం 3 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. 9న ద్వాదశి రోజున కూడా వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ద్వాదశి సందర్భంగా సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రస్నానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా టిటిడి తిరుపతి జె ఇ ఓ పోలాభాస్కర్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని భక్తులకు విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తిరుమలకు వెళ్లలేని భక్తులు ఈ ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారని వివరించారు. గతేడాది మొదటసారిగా ఇక్కడి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించామని, భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని, తాగునీరు అందుబాటులో ఉంచామని తెలిపారు. కాగా, ఆలయంలో ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్ అలంకరణలు చేపట్టారు. భక్తులకు శ్రీవారి సేవకులు, స్కౌట్లు విశేష సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇ ఓ వెంకటయ్య, ఎఇఓ ధనంజయులు, సూపరింటెండెంట్ దినకర్‌రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం శ్రీ సీతలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపుచేసి ఆస్థానం నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ధనుర్మాస కైంకర్యాల అనంతరం ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. 9న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి 10.15 గంటల నడుమ స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు.

వైకుంఠనాథుని దర్శనం.. సర్వపాపహరణం...
* కల్యాణ వేంకటేశ్వరుని ఆలయంలో పోటెత్తిన భక్తజనం
* 2వేలమందికి బిజెపి నేత గుండాల గోపీనాథ్ ప్రసాద వితరణ

తిరుపతి, జనవరి 8: పరమపవిత్రమైన వైకుంఠ ఏకాదశినాడు ఆ వైకుంఠనాధుని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమేకాకుండా సర్వపాపహరమని బిజెపి నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి, కట్టమంచి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి స్థానిక కొత్తవీధిలోని కల్యాణవేంకటేశ్వర స్వామి మహిమాన్వితుడని స్థానికుల విశ్వాసం. ఈ క్రమంలో ఆదివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు గుండాలగోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 2వేల మందికి మిరియాల పొంగలి, చక్కెర పొంగలి, కేశరి, పులిహోరాను పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీవారి భక్తులైన తాము ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశినాడు భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేయడం జరుగుతోందని చెప్పారు. కల్యాణవేంకటేశ్వర స్వామిని దర్శించుని మొక్కుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని వివరించారు. ఈనేపధ్యంలో స్వామివారి భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలోబిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్,నాయకులు కట్టమంచి చంద్రబాబు, మంచాల నాగేశ్వరాచారి, రజకల సెల్ నాయకులు గంధం వెంకటముని,, ఆకేపాటి నారాయణ రెడ్డి, ఫణిభూషణ్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, ధనరాజ్, అనిల్, తిరుపతి మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ప్రసన్న కుమార్ రెడ్డి, గురవారెడ్డి, గంగయ్య, రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కె ఎన్ రాజా, రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి పథకాలకు
1.13 కోట్లు విరాళం
తిరుపతి, జనవరి 8: టిటిడి నిర్వహిస్తున్న పలు పథకాలకు ఆదివారం రూ.1.13 కోట్లు విరాళాలు అందాయి. ఎస్వీ అన్నప్రసాదానికి రూ.185 లక్షలు, ఎస్వీ గో సంరక్షణకు రూ.25వేలు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదినికి రూ.1.10 కోట్లు, ఎస్వీ వేద పరిరక్షణ సదస్సుకు రూ.1లక్షను వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు విరాళంగా అందించారు. ఈ మొత్తానిన చెక్కుల రూపంలో డోనార్ సెల్ డిప్యూటి ఇ ఓ బాలాజీకి అందించారు. ఈసందర్భంగా దాతలకు టిటిడి అధికారులు పట్టు వస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందించారు.

తిరుమలకు పోటెత్తిన విఐపిలు, సామాన్య భక్తులు
* ఉత్తర ద్వార దర్శనంపై సర్వత్రా హర్షం

తిరుపతి, జనవరి 8: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని ఆదివారం తిరుమలకు విఐపిలు, సామాన్య భక్తులు పోటెత్తారనే చెప్పాలి. ఆదివారం సెలవుదినం కావడంతో కాలినడకన భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే గతంలోలా కాకుండా ఈసారి వారం ముందు నుంచి టిటిడి అధికారులు ముందస్తుగా వేసిన ప్రణాళికలు, తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చింది. ఇందులో సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని వారికి పెద్దపీట వేస్తూ, వి ఐ పి దర్శనాలను పూర్తిగా కుదించాలే చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు, వి ఐ పి లు స్వయంగా వస్తేనే దర్శనానికి అనుమతిస్మాని ప్రకటించడంతో ఏకాదశి రోజున తిరుమలకు చేరుకుని ప్రముఖులు ఉత్తరద్వార దర్శనం చేశారు. అదే క్రమంలో జె ఇ ఓ అన్నిశాఖల అధికారులను అప్రమత్తం చేస్తూ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి, దర్శనాలను కల్పించడంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే సామాన్యులకు దర్శన ఏర్పాట్లు, వసతిలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా కృషి చేశారు. లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకున్నా పోలీసులు, విజిలెన్స్ అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తలేదు.
సామాన్యులు, విఐపిల ప్రశంసలు
తిరుమల్లో వైకంఠ ఏకాదశి సందర్భంగా తక్కువ సంఖ్యలో వచ్చిన వి ఐ పిలు టిటిడి ఏర్పాటు చేసిన సౌకర్యాలతో సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇందుకు కృషి చేసిన టిటిడి అధికారులను అభినందించారు. టిటిడి ఇ ఒ సాంబశివరావు ఆదేశాలతో జెఇఓ శ్రీనివాసరాజులు ముందుగా అనుకున్న ప్రకారం దర్శన ఏర్పాటు చేసినట్లు పలువురు అభినందించడం గమనార్హం.

ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలి
* మంత్రి బొజ్జల పిలుపు

తిరుపతి, జనవరి 8: పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సి ఎం చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కోరారు. నాల్గవ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో బాగంగా ఆదివారం స్థానిక నెహ్రూమున్సిపల్ హైస్కూల్లో జరిగిన గ్రామసభలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిపై ప్రజలు విశ్వాసం ఉంచి సిఎం చేశారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పరిపాలనా దక్షకుడిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు వరమైతే రాయసీమకు జీవధారగా పట్టిసీమ నిలిచిపోతుందన్నారు. నదులు అనుసంధానం చేసిన ఏకైక సి ఎం చంద్రబాబునాయుడని, నోబెల్ బహుమతి గ్రహీతలకు రూ.100 కోట్లు బహుమతిని ప్రకటించిన ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలంటే సి ఎం కు రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని చెప్పారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ జన్మభూమి గ్రామసభల నిర్వహణ అర్థాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రజల వద్దకు అధికారులను పంపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పదవిని తన అభివృద్ధి కోసం కాకుండా భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పనిచేస్తున్న ముఖ్యమంత్రికి అన్ని వర్గాల ప్రజలు అండగానిలవాలన్నారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ కుటుంబ సంక్షేమం-సమాజ సంక్షేమంపై ప్రత్యేక దృష్టితో సిఎం జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఇళ్ళులేని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తున్న పేదలందరికీ ఉగాదిలోగానే ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. పూరిళ్లలోని పేదలు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు రెండున్నర లక్షలు రుణంగా ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. ఈసందర్భంగా అర్హులైనవారికి రేషన్‌కార్డులు, కుట్టుమిషన్లు, దీపం కనెక్షన్లు మంజూరు చేశారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు సూరాసుధాకర్ రెడ్డి, నరసింహయాదవ్, సంజయ్, కొండాహరిబాబు, వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ దేవెళ్ళ మురళి, ఎస్వీయూ మాజీ విసి మురళి, మనె్నం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.