చిత్తూరు

ఆర్టీసీబస్సు ఢీకొని బిటెక్ విద్యార్థి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జనవరి 9: రోడ్డుప్రక్కన కూర్చుని ఉన్న బిటెక్ విద్యార్థిని ఆర్టీసీబస్సు ఢీకొనడంతో ఆవిద్యార్థి మృతిచెందిన సంఘటన సోమవారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. సంఘటన స్థలాన్ని మదనపల్లె రూరల్ ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి పరిశీలించారు. ఎస్‌ఐ కథనం మేరకు కడప జిల్లా రాయచోటి మండలం సి సుండుపల్లెకు చెందిన వెంకటరమణ, లక్ష్మీదేవమ్మల కుమారుడు వెంకట ఆకాష్(20) మదనపల్లె-పుంగనూరు రోడ్డుమార్గంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మెకానికల్ ఫైనలియర్ చదువుతున్నాడు. మదనపల్లె పట్టణంలో తోటి స్నేహితులతో కలసి గది అద్దెకు తీసుకుని కళాశాలకు బస్సులో వెళ్ళివచ్చేవాడు. సోమవారం విద్యార్థి వెంకటఆకాష్ కళాశాలకు వెళ్ళి మధ్యాహ్నామే తన స్నేహితుడితో కలసి ఇంటికొచ్చేందుకుమదనపల్లె-పుంగనూరు రోడ్డుప్రక్కన కూర్చుని స్నేహితుడి కోసం వేచివున్నాడు. పుంగనూరు నుంచి వస్తున్న ఆర్టీసీబస్సు, మదనపల్లె నుంచి వెళ్తున్న లారీని తప్పించిబోయి ప్రమాదవశాత్తూ రోడ్డుప్రక్కన కూర్చుని ఉన్న విద్యార్థిని ఢీకొంది. దీంతో బిటెక్ విద్యార్థి వెంకటఆకాష్‌కి తీవ్రరక్తగాయాలు కాగా సహచర విద్యార్థులు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరికి తరలించారు. ఆర్టీసీబస్సు వేగం వల్లే రోడ్డుప్రక్కన ఉన్న విద్యార్థిని ఢీకొందని సహచర విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి తండ్రి వెంకటరమణ జీవనం కోసం విదేశాలలో ఉండడంతో తల్లి లక్ష్మీదేవమ్మకు సమాచారం అందించారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవిప్రకాష్ తెలిపారు.
శ్రీనివాసమంగాపురంలో వైభవంగా చక్రస్నానం
తిరుపతి, జనవరి 9 : టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య పుష్కరిణిలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి తిరుపతి జెఇఓ పోలా భాస్కర్ మాట్లాడుతూ ద్వాదశి నాడు వైభవంగా చక్రస్నాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. భక్తులందరిపై స్వామివారి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. ద్వాదశి నాడు రాత్రి వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్లు తెలిపారు.
తిరుచానూరులో...
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ద్వాదశి నాడు ఉదయం 7 నుంచి 9 గంటల నడుమ చక్రత్తాళ్వార్‌కు చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా చక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా తీసుకెళ్లి పంచమీతీర్థ మండపంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఇఓ మునిరత్నంరెడ్డి, పేష్కార్ శ్రీ రాధాకృష్ణ, సూపరింటెండెంట్ మాధవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
అప్పలాయగుంటలో...
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి 10.15 గంటల నడుమ శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఇఓ పోలా భాస్కర్, ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఇఓ మునిరత్నంరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.