చిత్తూరు

అభివృద్ధే అంతిమ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏర్పేడు, జనవరి 9: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తుందని రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం మండలంలో నాల్గవ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా సీతారామపేట గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు గృహ వైద్య, విద్య, పింఛన్లు వంటివి అమలు చేస్తుందన్నారు. ఈ పథకాలను ప్రజలకు చేరవేస్తూ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే టిడిపి సభ్యత్వం లక్ష్యాన్ని అధిగమించిందన్నారు. మండలంలో రూ.13 కోట్లతో సిసి రోడ్లు, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు పూర్తి చేశామన్నారు. అనంతరం గర్భిణులకు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాన్ని ఘనంగా నిర్వహించారు. చంద్రన్న కానుకలను రేషన్ కార్డుదారులకు బృందమ్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే వికలాంగులకు, వృద్ధులకు మంత్రి గోపాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులను జడ్పీ సిఇఓ పెంచలకిశోర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జన్మభూమి కమటీ సభ్యులు సతీష్, ఎంపిపి నాగరాణి, వైస్ ఎంపిపి మురగన్, మండల టిడిపి ఇన్‌ఛార్జ్ పొన్నారావు, పార్టీ ఇన్‌ఛార్జ్ ధనంజయులునాయుడు, నాగరాజునాయుడు, తహశీల్దార్ వెంకట్రాయులు, ఎంపిడివో చిన్నరెడ్డెప్ప, ఎస్‌ఐ రామకృష్ణ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

చెక్‌పోస్టులపై ఏసిబి దాడులు
* 86 వేలు నగదు స్వాధీనం

చిత్తూరు, జనవరి 9: జిల్లాలో రవాణా, వాణిజ్య పన్నుల శాఖల చెక్ పోస్టు అక్రమ వసూళ్లకు అడ్డాగా మారాయి, పలు మార్లు ఏసిబి అధికారలు దాడులు నిర్వహిస్తున్నా ఇక్కడ అధికారుల్లో మార్పు రాక పోగా ఈ దందా మాత్రం యధేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. ఈ చెక్ పోస్టుల్లో కొందరు అధికారులు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులపై ఏసిబి అధికారుల దాడుల పరంపర కొనసాగింది, ఈనేపథ్యంలో జిల్లాలోని గుడిపాల మండలంలోని నరహరిపేట, పలమనేరు ప్రాంతాల్లోని వాణిజ్య పన్నుల శాఖ చెందిన చెక్ పోస్టులపై దాడుల నిర్వహించి అనధికారకంగా ఉన్న సుమారు 86వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. నరహరిపేట వద్ద 51,200 రూపాయలు, పలమనేరులో అదనంగా ఉన్న 35వేల రూపాయలను స్వాధీనం చేసుకొన్నారు. సోమవారం ఉదయం ఏసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నరహరిపేట వాణిజ్య పన్నుల శాఖకు చెందిన చెక్ పోస్టుపై దాడులు చేపట్టారు. చెక్‌పోస్టు కార్యాలయంలో అదనంగా వసూళ్లచేసిన మొత్తాలను వివిధ చోట్ల దాచి ఉంచిన వైనాన్ని ఏసిబి అధికారుల గుర్తించారు. ఇందులో లెక్కలు మించి ఉన్న 51.200 రూపాయలను స్వాధీనం చేసుకొన్నారు. అలాగే అక్కడ ఉన్న ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల విచారించి వారి ఇళ్లను సైతం తనిఖీచేసారు. అయితే వారి వద్ద ఎలాంటి నగదు లభ్యంకాకపోవడంతో కార్యాలయంలో అదంగా ఉన్న నగదు వ్యవహారంపై కేసునమోదు చేసారు. అలాగే అక్కడే ఉన్న రవాణాశాఖకు చెందిన చెక్‌పోస్టులోను సోదాలు చేసారు. అక్కడ ఏలాంటి నగదు లభించలేదు, ఈ చెక్ పోస్టులో ఎవరైనా ప్రైవేట్ వ్యక్తలు వసూళ్లకు పాల్పడుతున్నారా అని ఆరా తీసారు. అయితే గత నెలలో ఇదే చెక్ పోస్టు పై రాష్ట్ర రవాణా శాఖ కమీషనర్ స్వయంగా తనిఖీలు నిర్వహించారు. ఈ చెక్ పోస్టులో అక్రమ వసూళ్ల భారీగా జరుగుతున్నాయని ఇటీవల కొందరు డ్రైవర్లు తగిన సాక్షాధారాలో కమీషనర్‌కు ఫిర్యాదు చేసారు. దీంతో కమీషనరే స్వయంగా రంగంలోకి దిగి అక్కడ జరిగే అక్రమ వసూళ్ల పర్వాన్ని గుర్తించారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరిపై వేటు వేసారు. ప్రధానంగా నరహరిపేట రాష్ట్రానికి సరహద్దులో ఉండటంతో అక్కడ రవాణాశాఖ తోపాటు వాణిజ్యపన్నుల శాఖలకు చెందిన చెక్ పోస్టులున్నాయి, ఇక్కడ పలుమార్లు ఏసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నా అక్రమవసూళ్ల యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మూడేళ్ళ కాలంలో ఈచెక్‌పోస్టులపై వరుసుగా ఐదు పర్యాయాలు ఏసిబి అధికారలు దాడులు చేపట్టారు. ప్రతిసారి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకొన్నారు. అలాగే సోమవారం పలమనేరులోని కమర్షియల్ టాక్స్ చెక్‌పోస్టుపై కడప ఏసిబి డిస్పీ నాగరాజు ఆధ్యర్యంలో దాడులు చేసారు. అక్కడ అదనంగా ఉన్న 35 వేల రూపాయలను స్వాధీనం చేసుకొని రికార్డులను తనిఖీ చేసారు. కార్యాలయంలో లెక్కకు మించి అదనంగా ఉన్న నగదుపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పి తెలిపారు. ఈ దాడుల్లో ఏసిబి సిఐలు విజయశేఖర్ , లక్ష్మికాంత్ రెడ్డి పాల్గొన్నారు.