చిత్తూరు

ఊపందుకున్న ప్రత్యేకహోదా ఆందోళన లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 27: ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు ఊపందుకున్నాయి. గత రెండు రోజులుగా వైకాపా, విద్యార్థి, యువజన సంఘాలు, సిపిఐ, జనసేన పార్టీ నేతలు రోడ్లపైకి వచ్చి ప్రత్యేకహోదా నినాదంతో గళం విప్పుతున్నారు. తిరుపతిలో 30, 144 సెక్షన్‌లు అమలవుతున్న నేపధ్యంలో పోలీసులు వీరిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి రాత్రి వరకు స్టేషన్లోనే కూర్చోపెట్టి ఆతరువాత విడిచి పెడుతున్నారు. అయితే ప్రతిపక్షాలు కూడా పట్టువదలని విక్రమార్కుడిలా తిరిగి ఆందోళనకు దిగుతున్నారు. ఈక్రమంలో శుక్రవారం గాంధి విగ్రహం వద్ద వైకాపా ఎంపి వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేకహోదా ఇవ్వాలని, విశాఖ విమానాశ్రయంలో తమ అధినేత జగన్‌ను నిర్బంధించడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. నల్ల దుస్తులు ధరించి రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తునమోహరించారు. నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనను విరమించుకోవాలని కోరారు. అయితే ఆందోళనకారులు వాటిని లెక్కచేయక పోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు సమాయత్తమయ్యారు. వైకాపా నాయకులు, కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదాలు, తోపులాటలు జరిగాయి. చివరకు పోలీసులు అందరినీ అరెస్టుచేసి ఈస్ట్‌పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా ఎంపి వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ సి ఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారని అన్నారు. ప్రత్యేకహోదా తీసుకువస్తామని, అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చారని అన్నారు. బాబు వస్తేనే జాబ్‌లు వస్తాయని నమ్మించారన్నారు. అయితే అధికారంలోకి వచ్చినవెంటనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వం ప్రత్యేక హోదాపై మాట మార్చాయన్నారు. ఇప్పుడు హోదానే అవసరం లేదని అనడం దారుణమన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సి ఎం చంద్రబాబు నాయుడులు ప్రత్యేక హోదాతో పనిలేదని, ప్యాకేజీ చాలని ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఈ దుర్మార్గపు విధానాలను విమర్శిస్తూ విశాఖలో యువత చేపట్టిన వౌనదీక్షకు వెళ్లిన జగన్‌ను నిర్భందించడం వారి దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. పోలీసులతో ఉద్యమాన్ని అణగ దొక్కాలని చూస్తే మరింత గుణపాఠం తప్పదని అన్నారు. బ్రిటీష్ పాలకులకన్నా దుర్మార్గంగా బాబు ప్రజల గొంతు కోస్తున్నారని మండిపడ్డారు. కాగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి తుమ్మలగుంట వద్ద ఉన్న చామండేశ్వరి ఆలయం వద్ద వాహనాలను తుడిచి తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే వీరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నగర కార్యదర్శి పెంచలయ్య ఆధ్వర్యంలో ఆపార్టీ నాయకులు ప్రత్యేక హోదాకై అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. ఈసందర్భంగా వారు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల విధానాలను దుయ్యబట్టారు. కాగా పోలీసులు వీరిని కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగ వారు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. కాగా డివై ఎఫ్ ఐ, ఎస్ ఎఫ్ ఐ, ఐద్వా, జనసేన పార్టీల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కల్లకు నల్లగంతులు కట్టుకుని మోకాళ్ళపై కూర్చుని నిరసన వ్యక్తంచేశారు. వీరిని కూడా పోలీసులు అరెస్టు చేసి ఆతరువాత సొంత పూచీ కత్తుపై విడిచిపెట్టారు. మొత్తం మీద నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమోగే తిరుపతి నగరం ఇప్పుడు ప్రత్యేక హోదా నినాదంతో మారుమోగుతోంది.