చిత్తూరు

రథసప్తమి నాడు లడ్డూ కౌంటర్లు 24 గంటలు పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 31: రథసప్తమి పర్వదినాన తిరుమలకు వచ్చే భక్తులకు అవసరమైనన్ని లడ్డూలు అందించాలని, ఇందుకు తగినన్ని లడ్డూలు సిద్ధం చేసుకోవడంతోపాటుగా లడ్డూ కౌంటర్లు 24గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని టిటిడి ఇఒ డాక్టర్ డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో జెఇఓ శ్రీనివాసరాజుతో కలసి ఆయన రథసప్తమి ఏర్పాట్లను సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 3వ తేదీన రథసప్తమి పర్వదినాన స్వామివారి వాహన సేవలను దర్శించుకునేందుకు నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి భక్తులు పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా వారికి అవసరమైన అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ విరివిగా అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం 6లక్షల తాగునీటి ప్యాకెట్లు, 1.5 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. గ్యాలరీల్లోకి భక్తులు ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఉన్న మార్గాలు, వాహన సేవల సమయం, సమాచారం భక్తులకు అందుతున్న సౌకర్యాలు, భక్తులు పాటించాల్సిన నియమావళి ఇతర అంశాలను వారికి అర్థమయ్యేలా వివిధ భాషల్లో రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్ ద్వారా తరచూ వినిపించాలని చెప్పారు. తిరుమాడ వీధుల్లో ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు నీటిని పిచికారి చేయాలని, ఇందుకోసం ట్యాంకర్లను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. దక్షిణ మాడవీధిలోని కదిలే వంతనను భక్తులకు ఇబ్బందులు ఎదురవకుండా మార్పు చేయాలని, ఇందుకు అవసరమైన సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే లగేజి డిపాజిట్, తిరిగి వాటిని పొందే సమయంలో కౌంటర్ల వద్ద ఆలస్యం జరగకుండా వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రథసప్తమి పర్వదినాన ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తోరణాలు ఏర్పాటు చేయాలని ఉద్యానవన విభాగం అధికాలకు సూచించారు. మాడ వీధుల్లో భక్తులకు వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్‌ను ప్రథమ చికిత్సా కేంద్రాల్లో డాక్టర్లను, పారామెడికల్ సిబ్బంది, మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తిరుమల జెఇఒ శ్రీనివాసరాజు మాట్లాడుతూ గ్యాలరీలను సక్రమంగా నిర్వహించడానికి, భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించానికి గ్యాలరీల వారీగా సీనియర్ అధికారులను నియమిస్తున్నట్లు తెలియజేశారు. ఇన్‌చార్జ్ సివిఎస్‌ఓ జి.శ్రీనివాస్ మాట్లాడుతూ గ్యాలరీల నిర్వహణ చక్కగా జరగాలని, మాడవీధుల్లోకి ఎక్కువ మంది ప్రవేశించకుండా చూడాలన్నారు. విద్యుత్ వైర్లు, కేబుళ్లను చెక్ చేసుకోవాలన్నారు. భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే మాడవీధుల్లోని సిబ్బంది వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి మాట్లాడుతూ గ్యాలరీల్లోకి వెళ్లే, వచ్చే మార్గాలను తెలిపే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఇంజినీరింగ్ స్ట్రక్చర్, ఎల్‌ఇడి విద్యుత్ దీపాల ఇన్‌చార్జ్ అధికారులు అందుబాటులో ఉండాలని, వారి జాబితాను పోలీసులకు, విజిలెన్స్ అధికారులకు ఇవ్వాలని చెప్పారు. ఈ సమావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎఫ్‌ఏసిఏఓ బాలాజీ, ఎస్‌ఇ-2 శ్రీరామచంద్రారెడ్డి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉదయం 5.30గంటలకు సూర్యప్రభ వాహనం
ఫిబ్రవరి 3వ తేదీన రథసప్తమి వేడుకలు ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రి 8గంటలకు చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయని జెఇఓ శ్రీనివాసరాజు అన్నారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు ఇన్‌చార్జ్ సివిఎస్‌ఓ జి.శ్రీనివాస్, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మితో కలసి తిరుమల చతుర్మాడ వీధులను పరిశీలించారు. గ్యాలరీల్లో ఉన్న భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని, మరుగుదొడ్లను అనుసంధానం చేశామని, రద్దీ నేపథ్యంలో భక్తులు టిటిడి యంత్రాంగం చేసే సూచనలను పాటించి సహకరించాలని కోరారు.