చిత్తూరు

కొనసాగుతున్న ఉగ్రవాదుల విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 3: చిత్తూరు కోర్టులో బాంబు పేలుడు కేసులో కస్టడిలో ఉన్న ఉగ్రవాదులను పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు కోర్టు బాంబు పేలుడుకేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు ఉగ్రవాదులను ఇటీవల బెంగళూరు నుంచి చిత్తూరు కోర్టులో విచారణ నిమిత్తం హాజరు పరిచారు. వీరికి ఈనెల 10వతేది వరకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశించారు. దీంతో కేసు విచారణ కోసం వీరిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టు ను ఆశ్రయించారు. రిమాండ్‌లో ఉన్న నిందితులు అబ్బాస్, దావుద్ సులేమాన్, ఖరమ్‌రాజ్, మహ్మద్ అయ్యూబ్, సంషుద్దీన్‌లను తమ కస్టడీలోకి తీసుకొన్నారు. ముఖ్యంగా ఈ విచారణలో భాషతో వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు హిందీ, ఉర్దూ పండితుల సమక్షంలో విచారిస్తున్నట్లు తెలిసింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో చిత్తూరు కోర్టులో బాంబు పేలుడు ఘటన చోటు చేసుకోవడం అందులో ఒకరికి గాయాలు కావడంతో పాటు పలు వాహనాలు ధ్వంసమైన సంగతి తెలిసిందే, ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈఘటన అనంతరం దేశంలో పలుచోట్ల ఇదే తరహాలో బాంబు పేలుడు సంఘటనలు చోటు చేసుకోవడంతో ఎన్‌ఐఏ సంస్థ రంగంలోకి దిగింది. దీంతో ఈ ఘటనలకు ప్రమేయం ఉన్న ఈ ఐదుగురు ఉగ్రవాదులను ఇటీవల అరెస్టుచేసి బెంగుళూరు జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో చిత్తూరు కోర్టు బాంబు కేసు విచారణ కోసం అక్కడ నుంచి అత్యంత బందోబస్తు మధ్య వీరిని చిత్తూరుకు తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ఈ ఐదుగురు ఉగ్రవాదలను చిత్తూరు పోలీసులు పలుకోణాల్లో విచారిస్తున్నారు, భాష సమస్య నెలకొడంతో హింది, ఉర్దూ పండితుల ద్వారా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.