చిత్తూరు

డాక్టర్ మాధవీలతపై దౌర్జన్యం చేసిన వారిపై నిర్భయ కేసు నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 4: చిత్తూరు ఎంపి శివప్రసాద్ కుమార్తె, డాక్టర్ మాధవీలతపైన, ఆమె డ్రైవర్‌పైన దాడిచేసి, కులం పేరుతో దూషించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి యాక్ట్, నిర్భయ కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పలుదళిత సంఘాల నేతలు,పిసిసి కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పిసిసి కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళిత ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు జయరాం, నాయకులు రామచంద్రయ్య, దాసు, మునిరత్నం, గోవిందస్వామి, ఎన్.వి.రమణ మాట్లాడుతూ మహిళ డాక్టర్‌పై దాడి దారుణమని అన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, నాయకులు మధు,ప్రమీలమ్మ,సమాచార హక్కుచట్టం రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి, నాయకుడు రఫి మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతులు కావాలని ప్రభుత్వం ఒక పక్క ప్రచారం చేస్తుంటే మరోపక్క తిరుపతిలాంటి విద్యాకేంద్రంలో, పట్టపగలు ఒక మహిళ డాక్టర్‌కు తీరిని అవమానం జరగడం విచారించదగ్గ విషయమన్నారు. ఒక ఎంపి కుమార్తెగా ఉన్న ఆమెనే కులం పేరుతో దూషించిన వ్యక్తి దర్జాగా తిరుగుతుంటే పట్టుకోవాల్సిన పోలీసులు స్పందించకపోవడం సరికాదన్నారు. అఖిలభారత షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి బండిరమేష్‌బాబు, నాయకులు రవీంద్రబాబు, అంజప్ప, చెంగల్రాయులు, కె.మురగయ్య, సంపత్, సుబ్బరత్నమ్మ, తంగేరి మురుగయ్య మాట్లాడుతూ దళిత మహిళకు జరిగిన అన్యాయం తమకు జరిగినట్లు భావిస్తున్నామని అన్నారు. ఇందుకు కారకులైనవారు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
అలాగే డాక్టర్ మాధవీలతపై జరిగిన దాడిని పోలీసులు పట్టించుకోక పోవడాన్ని నిరసిస్తూ మాలమహానాడు జిల్లా అధ్యక్షులు గొడుగుచింత రాజేష్ ఆధ్వర్యంలోదాము, హరీష్, సురేష్, చందు తదితరులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. దళితుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తామంటున్న అధికారులు స్వయంగా ఎంపి కుమార్తెకే అన్యాయం జరిగితే స్పందించిన తీరు సరికాదన్నారు.
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి: జెసి

చిత్తూరు, ఫిబ్రవరి 4: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జాయింట్ కలెక్టర్ గిరీషా తెలిపారు. శనివారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని జెసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ప్రతినెల మొదటి శనివారం విధిగా కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల కోసమే ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విధిగా అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఈ ప్రత్యేక దివ్యాంగుల ప్రజవాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యలపైనా అనేక కష్టనష్టాలను ఓర్చివచ్చే దివ్యాంగులను తరచూ తిప్పుకోవడం భావ్యం కాదన్నారు. వీరిపట్ల అందరూ సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఈసందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలువురు దివ్యాంగులు అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా పక్కాగృహాల నిర్మాణం, పింఛన్లు, ఉపకార వేతనాలు, భూ కేటాయింపులు తదితర సమస్యలను పరిష్కరించాలని దివ్యాంగులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జెసి ప్రతినెల మొదటి శనివారం వచ్చే ఫిర్యాదులను అప్‌డేట్ చేసి వచ్చే నెలలో వీరికి పరిష్కార మార్గాలు చూపాలని పూర్తి వివరాలను అందించాలని జెసి జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో అదనపుజాయింట్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, డిఆర్‌డిఎ పిడి రవిప్రకాష్‌రెడ్డి, ఇన్‌చార్జి డిఇఒ శామ్యూల్, ఇతర పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.