చిత్తూరు

హోరాహోరీగా జాతీయ స్థాయి కుస్తీ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 10 : చిత్తూరు నగరంలోని మెసానికల్ క్రీడా మైదానంలో శుక్రవారం నిర్వహించిన 36వ జాతీయ స్థాయి బాలుర సబ్ జూనియర్, 19వ నేషనల్ కేడెట్ బాలికల సబ్ జూనియర్ కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ క్రమంలో హర్యానా, పంజాబ్, చత్తీస్‌ఘడ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, ఉత్తరాఖంఢ్‌కు చెందిన పలువురు క్రీడాకారులు తమ సత్తాచాటి గ్రీక్ రోమన్, ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఎన్ శివప్రసాద్, మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు కఠారి ప్రవీణ్, టిడిపి మైనారిటీ విభాగం జిల్లా నాయకులు సయ్యద్, బంగారుపాళ్యం మండలాధ్యక్షులు సుచిత్ర జయప్రకాష్, ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడులు సందర్శించారు. ఈనేపథ్యంలో జడ్పీ చైర్‌పర్సన్, ఎంపి, ఇతర ప్రముఖులు ఐక్యత చాటుతూ గాలిలోకి బెలూన్ల వదిలారు. అనంతరం క్రీడాకారులతో కరచాలనం చేసి వారిని ఉత్సాహపరిచారు. కాసేపు ఉల్లాసంగా, ఉత్సాహంగా కుస్తీ పోటీలను తిలకించారు. ఇదిలా ఉండగా పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులు, పోటీలను తిలకించేందుకు వచ్చిన వారిలో జోష్‌ను నింపేందుకు ప్రత్యేక నృత్యపోటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు విద్యార్థులు, డ్యాన్సర్లు భరతనాట్యం, కూచిపూడి నాట్యంతో పాటు తెలుగు, హిందీ, తమిళం సినిమా పాటలకు అనుగుణంగా బ్రేక్, షేక్ డ్యాన్స్‌లు చేసి అలరించారు. కాగా ఈ కార్యక్రమంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ కార్యదర్శి ప్రసూద్, రెజ్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌రెడ్డి, కోశాధికారి పద్మనాభం, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, కోశాధికారి శరత్, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎన్‌పి జయప్రకాష్, రైఫిల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వైవి శివకుమార్, జిల్లా అధ్యక్షులు ఎల్‌వి సుధాకర్, జిల్లా క్రీడాభివృధ్ది అధికారి కె ఆనందలక్ష్మి, స్పాన్సర్స్ జిందాల్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు, నేచురో శివమోహన్‌రెడ్డి, జైన్‌ఫుడ్స్ నిర్వాహకులు సమీర్, స్వరూప్, ప్రవీణ్ , ఆయా రాష్ట్రాల జట్ల కోచ్‌లు, క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఆధునిక వైద్య విజ్ఞానాన్ని
యువ డాక్టర్లు అందిపుచ్చుకోవాలి
తిరుపతి, ఫిబ్రవరి 10: ఆధునిక వైద్య విజ్ఞానంలో వస్తున్న ఆధునిక పోకడలను యువ డాక్టర్లు అందిపుచ్చుకోవాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్విమ్స్ రేడియేషన్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో రేడియేషన్ ఆంకాలజీ గోల్డ్‌మెడల్ ఛైర్ ఓరేషన్ కార్యక్రమాన్ని ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారన్నారు. అలాగే మన దేశంలోను ప్రజారోగ్యానికి ప్రాధ్యనత ఇవ్వడం జరుగుతోందని వివరించారు. గుర్గావ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ రేడియేషన్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ బి.కె.మొహంతి మాట్లాడుతూ ది ల్యాండ్ స్కేప్ ఆఫ్ క్యాన్సర్ అనే అంశంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి మనిషి శరీరంలోని ఏ అవయవానికైనా రావచ్చని చెప్పారు. నేటి ఆధునిక ప్రపంచంలో వివిధ రకాలైన రసాయన పదార్థాలు అధికంగా వాడటం వల్ల క్యాన్సర్ వ్యాపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 40 సంవత్సరాల్లో ఈవ్యాధి ప్రపంచంలో రెండితలైందని అన్నారు. ఈసందర్భంగా డాక్టర్ మొహంతిని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, డాక్టర్ కెవి జగన్నాథరావునాయుడు, డాక్టర్ బి.వి.సుబ్రమణ్యం గోల్డ్‌మెడల్‌ను బహుకరించారు. ఈకార్యక్రమంలో స్విమ్స్ డాక్టర్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.