చిత్తూరు

నూతన టెక్నాలజీని వినియోగించుకుని భక్తులకు పారదర్శకంగా సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 17: తిరుమలేశుని దర్శనార్ధం దేశంలోని వివిధ ప్రాంతాలనుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న భక్తులకు నూతన ఆధునిక టెక్నాలజీ సహకారంతో అత్యంత పారదర్శకంగా సేవలు అందిస్తోందని టిటిడి ఇ ఒ డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు. శుక్రవారం టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఆయన్ను వేద పండితులు వేదాశీర్వచనం చేయగా, ఆయనకు శ్రీవారి వస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని ఇ ఒ అందించారు. ఈ సందర్భంగా ఇ ఒ మాట్లాడుతూ సాంకేతికరంగంలోనే దిగ్గజాలైన టాటా కల్సెల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సిఎల్ వంటి ఐటి సంస్థల సహకారంతో గత ఏడాదిన్నర కాలంగా శ్రీవారి భక్తులకు దర్శన,వసతి, లడ్డూ ప్రసాదం తదితర సదుపాయాలను కల్పించడంలో టిటిడి అత్యంత పారదర్శక సేవలను అందిస్తోందన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత ప్రమాణాలతో టెక్నాలజీని వినియోగించుకుంటూ భక్తులకు సేవలు చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. సామాజిక బాధ్యతగా టిసిఎస్ సంస్థ టిటిడికి అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. ఇటీవల టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నటరాజన్ చంద్రశేఖర్‌ను ఆయన అభినందించారు. ఈసందర్భంగా నటరాజన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ టిటిడి ఇ ఒ డాక్టర్ డి.సాంబశివరావు దార్శినికతతో టెక్నాలజీ సహకారంతో పారదర్శకమైన మార్పులను తీసుకురావచ్చనని రుజురు చేయడానికి ఇటీవల టిటిడిలో భక్తుల సౌకర్యార్థం టిటిడితో కలసి భక్తులకు మరింత విశేష సేవలు అందించడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని ఉద్ఘాటించారు.

14కు చేరిన ఎమ్మెల్సీ నామినేషన్లు
* టిడిపి పట్ట్భద్రుల అభ్యర్థిగా వేమిరెడ్డి నామినేషన్ దాఖలు

చిత్తూరు, ఫిబ్రవరి 17: తూర్పు రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి స్థానాలకు నామినేషన్ల దాఖలు పరంపర కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ సంఖ్య 14కు చేరింది. ఇప్పటికి పట్ట్భద్రుల స్థానానికి 10మంది, ఉపాధ్యాయుల స్థానానికి నలుగురు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నలుగురు పట్ట్భద్రుల స్థానానికి, ఒక్కరు ఉపాధ్యాయ స్థానానికి నామినేషన్లను ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రజియాబేగం వద్ద దాఖలు చేశారు. పట్ట్భద్రుల స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్య్ర అభ్యర్థులుగా నెల్లూరు జిల్లా వాసి విజయభాస్కర్‌రెడ్డి, ప్రకాశం జిల్లా అద్దంకి చెందిన డాక్టర్ నాగబ్రహ్మానందచ్చారి, తిరుపతికి చెందిన దళవాయి ధర్మలింగారెడ్డి నామినేషన్లు వేశారు. ఉపాధ్యాయుల స్థానానికి నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటకృష్ణయ్య నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల కార్యక్రమానికి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన అనేకమంది నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో చిత్తూరు కలెక్టరేట్ సందడిగా మారింది.

చిన్నశేష వాహనంపై స్వామివారి చిద్విలాసం
చంద్రగిరి, ఫిబ్రవరి 17: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన శుక్రవారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు మురళీకృష్ణ అలంకారంలో చిన్నశేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్వామివారు నాలుగుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క్భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. రెండోరోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలల గల చిన్నశేష వాహణంపై ఊరేగుతారు. కాగా సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు వీణ ధరించి సరస్వతీ రూపంతో భక్తులను అనుగ్రహించనున్నారు. హంస సరస్వతీకి వాహనం. కనుక కల్యాణ దేవుడు సరస్వతీ రూపంతో వీణాపుస్తకపాణియై దర్శనమివ్వడం జ్ఞాన విజ్ఞాన చైతన్య శుద్ధ సత్వగుణానికి నిదర్శనం. భక్తులు హంసల వలే నిర్మలమనస్కులై ఉంటే వాళ్ల హృదయాల్లో తాను శాశ్వతంగా అధివసించి ఉంటానని ఈ వాహనం ద్వారాస్వామివారు సెలవిస్తున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఎస్ వి సంగీత కళాశాల వారిచే మంగళధ్వని, టిటిడి ఎస్ వి ఉన్నత వేదాధ్యయన సంస్థవారిచే చతుర్వేద పారాయణం, తిరుపతికి చెందిన డాక్టర్ కెటివి రాఘవన్ ధార్మికోపన్యాస కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన శ్రీ ధూళిపాళ శివరామకృష్ణశర్మ బృందం హరికథ, తిరుపతికి చెందిన కె. విశాలక్షి బృందం ఊంజల్‌సేవ, తిరుపతికి చెందిన డాక్టర్ డాక్టర్ ఆర్ ఎన్ ఎస్. శైలేశ్వరి బృందం అన్నమయ్య విన్నపాలు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి వెంకటయ్య, సహాయ కార్యనిర్వహణాధికారి డి.్ధనంజయ, సూపరింటెండెంట్లు దినకర్ రాజు, కృష్ణారావు ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.