చిత్తూరు

20కి చేరిన ఎమ్మెల్సీ నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 18: తూర్పు రాయలసీమ పట్ట్భద్రలు , ఉపాధ్యాయల శానస మండలి స్థానాలకు నామినేషన్లకు ముగింపు గడువు ఒక్కరోజు మాత్రమే ఉండడంతో ఈపర్వం ఊందుకొంది. శనివారం ఒక్కరోజే ఆరుగురు అభ్యర్థులు తమ నామినేసన్లను దాఖలు చేసారు. దీంతో ఈసంఖ్య 20కి చేరింది. ఇప్పటి వరకు పట్ట్భద్రుల స్థానానికి 14మంది, ఉపాధ్యాయుల స్థానానికి ఆరుగురు చొప్పున నామినేషన్లను దాఖలు చేసారు. శనివారం పట్ట్భద్రుల స్థానానికి నల్గురు, ఉపాధ్యాయుల స్థానానికి ఇద్దరు తమ నామినేషన్లను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రజియాబేగం వద్ద దాఖలు చేసారు. పట్ట్భద్రుల స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలానికి చెందిన ఒంటేరు కిరణ్‌కుమార్ యాదవ్, ప్రకాశం జిల్లాకు చెందిన కడియం రామయ్య యాదవ్, చవల కోటేశ్వరరావులు, బహుజన డెమోక్రటిక్ ఫ్రంట్ తరరపున ప్రకాశం జిల్లాకు చెందిన దన్నారపుమస్తాన్‌రావునామినేషన్లను దాఖలు చేసారు, ఉపాధ్యాయల స్థానానికి బహుజన డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున నెల్లూరు జిల్లాకు చెందిన అంబూరి సుబ్రహ్మణ్యం, స్వతంత్ర అభ్యర్థిగా ప్రకాశం జిల్లా దర్శికి చెందిన కాసన వెంకట సుధాకర్‌రెడ్డి నామినేషన్ వేసారు, గతంలో వెంకట సుధాకర్‌రెడ్డి పట్ట్భద్రుల స్థానానికి కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ల దాఖలకు సోమవారం చివరి రోజు కావడంతో ఆరోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది.
స్విమ్స్ క్యాన్సర్ పేషంట్లకు కిట్స్ పంపిణీ
తిరుపతి, ఫిబ్రవరి 18: స్విమ్స్ ఆంకాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులకు ఉపయోగపడే పేషెంట్ అసిస్టెంట్ కిట్స్‌ను శనివారం ఉచితంగా పంపిణీ చేశారు. ఇందులో క్యానె్సర్ రోగులు జ్వరం తీవ్రత తెలుసుకోవడానికి, బ్రెస్ట్ క్యానె్సర్ రోగులకు బాల్ ఎక్సర్‌సైజ్ ద్వారా ఉపశమనం పొందడానికి, మెడికేటెడ్ టిష్యూ పేపర్‌లు ద్వారా గాయాలకు డ్రెస్సింగ్ చేసుకోవడానికి ఉపయోగపడే వస్తువులు ఈ కిట్‌లో ఉంటాయి. సిప్లాకంపినీ ఈ కిట్‌ను స్పాన్సర్ చేసింది. ఈకార్యక్రమంలో మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కన్నన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బార్గవి, నర్సింగ్ సూపరింటెండెంట్ సునీత తదితరులు పాల్గొన్నారు.

టాస్క్ఫోర్స్ దాడిలో భారీగా ఎర్ర చందనం స్వాధీనం
* ఐదుగురు స్మగ్లర్లు అరెస్ట్

తిరుపతి, ఫిబ్రవరి 18: తిరుపతిలో ఎర్రచందనం భారీ అక్రమ రవాణాను టాస్క్ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు. పక్కాప్రణాళికతో దాడిచేసి రెండు వేర్వేరు సంఘటనల్లో దాదాపు రూ.3కోట్ల విలువచేసే 193 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐదుగురు స్మగ్లర్లను, రెండు కార్లు, ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెడితే టాస్క్ఫోర్స్ ఎస్‌పి రవిశంకర్, డి ఎస్పీ శ్రీ్ధర్‌ల ఆదేశాల మేరకు స్థానిక తిమ్మినాయుడు పాల్యెం సమీపంలోని అటవీప్రాంతంలో ఎర్రచందనం దుంగలను లారీలో లోడ్ చేస్తున్న సమాచారం తెలుసుకుని టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడిచేశారు. దాదాపు 50 మంది స్మగ్లర్లు శేషాలచ అటవీప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను లారీలోకి ఎక్కిస్తుండగా దాడిచేశారు. వీరి రాకను గమనించిన స్మగ్లర్లు దుంగలను అక్కడే వదలి తిరిగి అడవిలోకి పారిపోయారు. అయితే చంద్రశేఖర్ అనే ఒక స్మగ్లర్‌ను సిబ్బంది పట్టుకున్నారు. అలాగే స్థానిక గ్రాండ్ వరల్డ్ హోటల్‌కు సమీపంలోను 40 ఎర్రచందనం దుంగలను రెండు కార్లలో తరలిస్తుండగా దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.పట్టబడ్డ వారంతా తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు. కాగా పట్టుబడ్డ ఎర్రచందనం దుంగల విలువ దాదాపు రూ.3కోట్ల వరకు ఉంటుందని టాస్క్ఫోర్స్ పోలీసులు అంచనావేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఐ విజయ్, డిఆర్‌ఓ దుర్గాప్రసాద్‌లు తమ సిబ్బందితో ఈదాడుల్లో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని గుర్తించారు. కాగా ఈప్రాంతంలోనే ఫైయింగ్ స్వ్కాడ్ కార్యాలయం ఉండటం గమనార్హం.