చిత్తూరు

శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు సక్రమంగా చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 18: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సి ఇ ఒ పెంచల కిషోర్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమావేశం జరగాల్సివుండగా అన్నివార్య కారణాలు వల్ల కలెక్టర్ హాజరుకాలేక పోవడంతో జడ్పీ సి ఇ ఓ పెంచల కిషోర్ అన్నిశాఖల అధికారులతో దేవస్థానం సమావేశ భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన శివరాత్రి ఉత్సవాలకు ఏ ఏ శాఖలు ఎటువంటి ఏర్పాట్లు చేశారో ఈసారి కూడా అలాగే చేయాలన్నారు. అలాగే గతంలో జరిగిన పొరబాట్లను సరిదిద్దుకుని పొరబాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. క్యూలైన్లలో ఉండే భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు అధికారులు పర్యవేక్షించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని లేకుంటే ఉత్సవాలు సక్రమంగా జరగవన్నారు. గతంలో భక్తులు ఇబ్బందులు పడ్డ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కోశాఖ ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల గురించి సి ఇ ఓ సమీక్షించారు. ఈ సమావేశంలో ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్ గురవయ్యనాయుడు, సభ్యులు, ఇ ఒ భ్రమరాంబ, పోలీస్, రెవిన్యూ, మున్సిపాలిటి, అగ్నిమాపక సిబ్బంది, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, ఎక్సైజ్‌శాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

సూర్యప్రభ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి అభయం
తిరుపతి, ఫిబ్రవరి 18: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన శనివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవ సాగింది. వాహనసేవ ఆలయం నుంచి మొదలై కపిలతీర్థం రోడ్డు, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌రోడ్డుమీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్క్భజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడు. సూర్యుని ప్రభ లోకబంధువైన కోటి సూర్యప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది. మయోమోహాంధకారాన్ని తొలగించే సోమస్కందమూర్తి, భక్తులకు సంసారతాపాన్ని తొలగిస్తున్నాడు. అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

చంద్రప్రభ వాహనంపై కపిలేశ్వరుని వైభవం
సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందుచేయనున్నారు.
శివుడు అష్టమూర్తి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, జీవకోటి మనస్సులకు ఆనందాన్ని కలిగించే షోడశకళాప్రపూర్ణుడు, శివభగవానుడు విభూతి సౌందర్యంతో ధవళతేజస్సుతో వెలుగొందుతూ తన కరుణ కిరణాలతో అమృత శీతలకాంతులను జీవులకు అనుగ్రహిస్తాడు.