చిత్తూరు

పూతలపట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూతలపట్టు, ఫిబ్రవరి 18: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై వేపనపల్లి గ్రామ సమీపాన శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహారాష్ట్ర వాసులు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇన్నోవాను టాటాసుమో ఢీకొనింది. ఇదే సమయంలో చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్తున్న కంటైనరు లారీ, తిరుపతి నుంచి కాణిపాకం వైపు వస్తున్న బస్సు ఢీకొనడంతో టాటాసుమో, ఇన్నోవాలు తునాతునకలైయ్యాయి. పోలీసుల కథనం మేరకు మహారాష్టక్రు చెందిన ఆరు గురు యాత్రికులు స్వామివారి దర్శనం చూసుకొని తిరిగి స్వగ్రామాలకు ఇన్నోవాలో వెళ్తుండగా వేపనపల్లి గ్రామంవద్ద ఆర్టీసి బస్సును ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న టాటాసుమో ఢీకొంది. ఇంతలోనే వేర్వేరు మార్గాల్లో వస్తున్న బస్సు, కంటైనరు ఈ వాహనాలను వేగంగా ఢీకొన్నాయి. దీంతో ఇన్నోవాలో ఉన్న మహారాష్టక్రు చెందిన ఒక మహిళ సంఘటన స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో యువకుడు మార్గమధ్యలో మృతి చెందాడు. అయితే ఈదుర్ఘటనలో సుమో వాహనంలోతీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో తిరుపతి మంగళంకు చెందిన రఘు(24), మహారాష్టక్రు చెందిన తాన్సు(35), వేలూరుకు చెందిన అనుసూయ(29), ఆమె భర్త జయకుమార్(33), కుమార్తె జె.పూజ(2), వేలూరుకు చెందిన ఉదయచంద్రిక(16), గుజరాత్‌కు చెందిన సీతల్‌పటేల్‌లు ఉన్నారు. వీరిని మెరుగైన చికిత్స కోసం చిత్తూరుకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో మహారాష్టక్రు చెందిన తాన్సు, సీతల్‌పటేల్‌ను చిత్తూరు నగరంకు చెందిన జైన్ సంఘం కార్యదర్శి సుభాష్‌జైన్, అతని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో హుటాహుటిన ప్రత్యేక అంబులెన్స్‌లో వేలూరు సిఎంసి వైద్యశాలకు తరలించారు. ఒక్కసారిగా రెండు వాహనాలు ఢీకొనడంతో జాతీయ రహదారిపై ట్రాపిక్ స్తంభించింది. ఈఘటనలో మృతి చెందిన వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఇన్నోవాలో ప్రయాణీస్తున్న మిగతా మహారాష్ట్ర వాసులు కూడా తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉండడంతో వివరాలు చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. దీంతో ఎస్సై మురళిమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వడమాలపేట వద్ద లారీని కారు ఢీ
* ఇద్దరు తమిళనాడు భక్తులు మృతి
* ఇద్దరి పరిస్థితి విషమం

తిరుపతి, ఫిబ్రవరి 18: చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం, టోల్‌ప్లాజా సమీపంలో ఆగిఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన రామకృష్ణ శ్రీవారి దర్శనార్థం తన కుటుంబ సభ్యులతో కలసి కారులో తిరుమలకు బయలుదేరాడు. శనివారం మధ్యాహ్నం వడమాలపేట టోల్‌ప్లాజా దాటిన తరువాత ఆగివున్న లారీని కారు వేగంగా ఢీకొనింది. ఈ సంఘటనలో అనుసూయ (34) రామకృష్ణ (38) అక్కడికక్కడే మృతి చెందారు. అనుసూయ భర్త సురేష్, కారులో ఉన్న జయకోడి తీవ్రంగా గాయపడగా, వెంకటరమణ, మరో రెండు సంవత్సరాల జయశ్రీ స్వల్పగాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకుని వడమాలపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను 108లో రుయాకు తరలించారు.