చిత్తూరు

అన్నిరంగాల్లో జిల్లావాసులు ముందుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొంపిచెర్ల, పిబ్రవరి 20: విద్యలో మాత్రమేకాదు మనజిల్లా వాసులు అన్ని రంగాల్లో ముందుండాలని చిత్తూరు పార్లమెంటు సభ్యుడు డాక్టర్ శివప్రసాద్ అన్నారు. రొంపిచెర్లక్రాసుకు చెందిన శ్రీసాయిద్వారా కళాశాల విద్యార్థులతో కలిసి ఆయన సోమవారం రొంపిచెర్ల ఎంఎండీలక్స్ థియేటర్లో ప్రదర్శించిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమా ప్రదర్శనను తిలకించారు. ఈసందర్భంగా విరామం అనంతరం ఆయన థియేటర్లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సినిమాల్లో తాను నటించిన పాత్రలు గురించి గత ఙ్ఞపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఖైదీ సినిమాలో చిరంజీవితో నటించానని ఆతర్వాత ఖైదీ నెం 150 సినిమాలో నటిస్తానని చెప్పి నటించలేక పోయానని అన్నారు. రాజకీయాల్లో ఉండడం వల్ల ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో చెప్పలేమని చాలా సినిమాలు వదులుకున్నానని అన్నారు. మన జిల్లాకు చెందిన వ్యక్తి మోహన్‌బాబు హీరోగా వచ్చారని ఆయన తర్వాత సప్తగిరి హీరోగా పరిచయమైయ్యారని మనజిల్లా వాసులను మనం ఆదరించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. సప్తగిరి నటించిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’చిత్రం చిన్న సినిమా అయినా పెద్దహిట్ అయ్యిందని అన్నారు. ఈసినిమా రిజీల్ అయినపుడు ప్రధాని నరేంద్రమోది ప్రజల దగ్గర డబ్బులు లేకుండా చేశారని డబ్బులు ఉన్నపుడు రిలీజ్ అయి ఉంటే ఈసినియా మరింత పెద్దహిట్ అయ్యేదని అన్నారు. ఈసినిమాను జిల్లాలో పోలీసులకు చూపించాలని జిల్లా ఎస్పీ అభిప్రాయంతో ఉన్నారని అన్నారు. శ్రీసాయి ద్వారకా విద్యాసంస్థలు ఈసినిమాను విద్యార్థుల కోసం ప్రదర్శించి రాష్ట్రంలోనే మార్గదర్శకులయ్యారని ప్రసంశించారు.హీరో సప్తగిరితో ఏప్రిల్‌లో సూపర్‌టైటిల్‌తో ఒక సినిమాలో నటిస్తున్నానని అలాగే నారా రోహిత్‌తో కూడా ఒక సినిమాలో నటిస్తున్నానని అన్నారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో తండ్రి పాత్ర పోషించిన తనకు కుమారుడు పైకి రావాలని ఆశ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. రోజాను, సంఘవిని సినిమాల్లోకి పరిచయం చేశానని మీలో కూడా ఎవరైనా సినిమాల్లో నటించాలని ఆసక్తి ఉంటే వారికి దారి చూపిస్తానని పేర్కొన్నారు. మానాన్న నన్ను ఐఎఎస్ కావాలని కోరుకునేవారని ఆయన చెప్పినట్లు ఐఎఎస్ చదివి ఉంటే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుని ఉండేవాడిని కాదని నాది ప్రేమ వివాహమని మాపెండ్లి వాయల్పాడులో జరిగిందని అన్నారు. ప్రేమించినా ఆదర్శంగా నిలబడి మంచి పేరు తెచ్చుకోవాలని తల్లిదండ్రులకు నొప్పిపంచకూడదని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. ఏపార్టీలో ఉన్నా సమస్య ఏదైనా పార్టీ రహితంగా ఉద్యమిస్తానని అన్నారు. సమైక్యాంధ్ర, కరెన్సీ నోట్లు రద్దు, ప్రత్యేక హాదా కోసం ఢిల్లీలో తాను వినూత్న తరహాలో ఆందోళనలు చేపట్టానని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు. హీరో సప్తగిరిని ఎవరూ కొట్టలేని హీరోను చేయడానికి మీరందరూ ముందుకు రావాలని విద్యార్థులకు పిలుపు నిచ్చారు. మంచి నటనను పుణికి పుచ్చుకున్న హీరో సప్తగిరితో సినిమాలు తీసేందుకు పెద్దపెద్ద నిర్మాతలు, సంస్థలు ముందుకు వస్తున్నాయని అన్నారు. అనంతరం ఎంపిపి విద్యార్థులతో కలిసి థియేటర్లో సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సనిమా ప్రదర్శనను తిలకించారు. శివప్రసాద్ నటనకు, హీరో సప్తగిరి నటనకు విద్యార్థుల అరుపులతో,కేరింతలతో సినిమా హాలు దద్దరిల్లిపోయింది. ఈసందర్బంగా విచ్చేసిన చిత్తూరు ఎంపి శివప్రసాద్‌ని శ్రీసాయిద్వారకా విద్యాసంస్థల ఛైర్మెన్ శ్రీనివాసులురెడ్డి, కరెస్పాండెంట్ చింతలద్వారకనాథరెడ్డి,అధ్యాపకులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. మంగళవారం జరిగే విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో హీరో సప్తగిరి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని ద్వారకనాథరెడ్డి తెలిపారు.