చిత్తూరు

‘శిల్పకళాకారులకు నిపుణులతో శిక్షణ ఇవ్వాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 21: తిరుపతిలోని టిటిడి శిలాశిల్పాల ఉత్పత్తి కేంద్రంలోని శిల్ప కళాకారులకు తమిళనాడులోని పూంపుహార్, మహాబలిపురంలోని నైపుణ్యంగల శిల్పులతో శిక్షణ ఇవ్వాలని టిటిడి ఇఓ డాక్టర్ డి సాంబశివరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక టిటిడి పరిపాలనా భవనంలో మంగళవారం ఆయన సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ మార్కెటింగ్ విభాగంలో చక్కెర, బియ్యం, బెల్లం, కందిపప్పు, నెయ్యి తదితర సరకులు 15 రోజులకు సరిపడా నిల్వ ఉంచుకోవాలని తెలిపారు. ఉపమాక, కపిలతీర్థం, అప్పలాయగుంట ఆలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఇంజినీరింగ్ పనులపై ఇఓ సమీక్షించారు. ఏప్రిల్‌లో ఒంటిమిట్ట రామాలయ బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. తిరుపతిలో శ్రీవారి సేవ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. ఈ సమావేశంలో టిటిడి తిరుపతి జెఇఒ పోల భాస్కర్, ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ఎన్ ముక్తేశ్వరరావు, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ అండ్ సిఏఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

‘ఏకపక్షంగా రుణాల మంజూరు మంచిది కాదు’
వెదురుకుప్పం, ఫిబ్రవరి 21 : యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం మంజూరుచేసే రుణాలు ఏకపక్షంగా చేపట్టడం సరైన పద్ధతి కాదని మండల ఎస్టీ సంఘ అధ్యక్షుడు చీరాలయ్య విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల జన్మభూమి కమిటీ సభ్యులు ప్రతిపాదించిన వారికే రుణాలు మంజూరు చేయడం వల్ల అర్హులు లబ్ధిపొందలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుల అవినీతి కారణంగా స్వయం ఉపాధి లక్ష్యాలు నీరుగార్చే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న జన్మభూమి కమిటీ సభ్యుల వల్ల తెలుగుదేశం పార్టీకి చెందిన వారు మాత్రమే లబ్ధి పొందుతున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించి ఐకమత్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ సంఘ నేతలు వినోద్, నరసింహులు తదితరులున్నారు.

హనుమంత వాహనంపై శ్రీ కోదండరామస్వామివారి అవతారంలో కల్యాణ వెంకన్న అభయం
చంద్రగిరి, ఫిబ్రవరి 21: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన మంగళవారం ఉదయం శ్రీనివాసుడు వెంకటరాముడై హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవీగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క్భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు ఉదయం స్వామివారు వరదహస్తం దాల్చిన కల్యాణ వెంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం వైభవంగా జరిగింది.
స్వర్ణరథంపై మెరిసిన శ్రీనివాసుడు
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు స్వర్ణరథోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. రథాన్ని అధిరోహించిన స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామివారి స్వర్ణరథాన్ని లాగారు. స్వర్ణరథంపై స్వామివారి ముగ్ధమనోహర రూపం భక్తులకు నయనానందం కలిగించింది. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.