చిత్తూరు

హరహర మహాదేవ శంభో శంకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి పట్టణంలోని శైవాలయాలు హరహర మహాదేవ శంభో శంకర అంటూ పిల్లలు పెద్దలు తన్మయంతంతో తరలిరావడంతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారు జామునుంచి ప్రజలు ఆది దంపతుల దర్శనానికి క్యూలు కట్టారు. ఉదయానే్న పుణ్యస్నానాలు ఆచరించి పూజా సామగ్రితో ఆలయం వద్దకు చేరుకుని స్వామికి పాలు, పువ్వులతో అభిషేకించి పూజించి తరించారు. నగంలోని ప్రధాన శైవాలయాల్లో ఒకటైన కపిలేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారు జామున 2గంటలకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి 2.30గంటల నుంచి 4.30 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రి 12గంటల నుంచి 25వ తేదీ 4గంటల వరకు లింగోద్భవకాల అభిషేకాలు నిర్వహించనున్నట్లు టిటిడి ఇ ఒ డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు. కాగా శ్రీకపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7 నుంచి 9గంటల వరకు రథోత్సవం (్భగితేరు) కన్నుల పండువగా నిర్వహించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులని భక్తులు విశ్వసిస్తారు. శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుందని భావిస్తారు. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. భక్తుల ఓం నమశ్శివాయ పంచాక్షరీ మంత్ర జపం నడుమ శ్రీ స్కోమ స్కందమూర్తి, శ్రీకామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు. కాగా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు నంది వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి పురవీధుల్లో ఈ వాహనసేవను వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలు, దివ్యాభరణాలతో దివ్యంగా అలంకరించిన పార్వతి, పరమేశ్వరులను అలంకరించి తిరుపతి పురవీధుల్లో నందివాహన సేవను వైభవంగా జరిగింది. పరమశివుడు నందివాహనంపై కొలువుదీరి కదలి వస్తుంటే నగర ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి కర్పూర నీరాజనాలు సమర్పించుకుని తన్మయులైయ్యారు. కాగా కపిలేశ్వరాలయానికి భక్తులు పోటెత్తడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా టిటిడి ఇ ఓ సాంబశివరావు పర్యవేక్షణలో జె ఇ ఓ పోలభాస్కర్ ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించేందుకు, వెలుపలికి వచ్చేందుకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు, నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ద్విచక్రవాహనాలకు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులందరికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి సుబ్రమణ్యం, సహాయ కార్యనిర్వహణాధికారి శంకరరాజు, సూపరింటెండెంట్ ఓబుల్‌రెడ్డి, ఆలయ ఇన్స్‌పెక్టర్లు నారాయణ, మురళీకృష్ణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపట్టారు.
ఆకట్టుకున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 6 నుంచి 7గంటల వరకు ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థులచే మంగళధ్వని, ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు పురాణ ప్రవచనం, మధ్యాహ్నం 11.30 నుంచి 1గంట వరకు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు ఎ.శబరి గిరీష్ బృందం శివోహం భజన కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుంచి 5గంటల వరకు భక్తి సంగీత కార్యక్రమం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన వినాయక నాట్యమండలి సురభి కళాకారులు భూకైలాస్ పౌరాణిక నాటకం ప్రదర్శించారు. రాత్రి 9.30 నుంచి 11.30 గంటల వరకు తిరుపతికి చెందిన వి.విజయకుమారి బృందం వారిచే హరికథ, రాత్రి 11.30 నుంచి మంగళవారం తెల్లవారుజామున 1గంటల వరకు తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి నమకం, చమకం, రుద్రం, శ్రీసూక్తం, పురుషసూక్తం పారాయణం చేయనున్నారు. శనివారం తెల్లవారు జామున 1 నుంచి 2.30 గంటల వరకు తిరుపతికి చెందిని జి.రేవతి, జి. ఉదయభాస్కర్ రెడ్డి బృందం శివ సంకీర్తనలు, అనంతరం 4.30గంటల వరకు చంద్రశేఖర్ బృందంచే హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం
చంద్రగిరి, ఫిబ్రవరి 24: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 6నుంచి 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 8 నుంచి 10.15 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీ్భ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు, చక్రత్తాళ్వార్‌కు వైభవంగా స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, దూపదీప నైవేద్యం, ఛత్రచామర వ్యజర దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖునిధి, పద్మనిధి, సహస్రధార, కుంభదరాణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధములోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలలో ఒక్కో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడురకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో కురువేరు, వట్టివేరు, రోజాపూలు, సంపంగి, చామంతి, తులసి, గులాబి, మొదలగు ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. అనంతరం ఉదయం 10.15 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలాభాస్కర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషిచేసిన అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు తిరుచ్చి ఉత్సవం జరుగుతుంది. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ధ్వజావరోహణం నిర్వహించారు. ధ్వజావరోహణంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జె ఇ ఓ పోలాభాస్కర్ దంపతులు, అదనపు సివి ఎస్ ఓ శివకుమార్‌రెడ్డి, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి వెంకటయ్య, సహాయ కార్యనిర్వహణాధికారి డి.్ధనంజయ, ప్రధాన కంకణ బట్టార్ బాలాజి రంగాచార్యులు, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

చిత్తూరు ఆసుపత్రిని పరిశీలించిన కేంద్ర వైద్యబృందం

చిత్తూరు, ఫిబ్రవరి 24: జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం కేంద్ర వైద్యబృందం పరిశీలించింది. కేంద్ర వైద్యబృంద సభ్యులైన డాక్టర్ భార్గవ్, ప్రణబ్ భగత్, శ్రీలక్ష్మి, అజిత్ ఛటర్జి సందర్శించారు. ఇటీవల ఈ ఆసుపత్రిని అపోలో సంస్థ లీజుకు తీసుకొన్న సంగతి తెలిసిందే, చిత్తూరులో అపోలో సంస్థకు మెడికల్ కాలేజి మంజూరైంది. ఇందులో భాగంగా చిత్తూరులో వైద్యవిధాన పరిషత్ ఆద్వర్యంలో పని చేస్తున్న జిల్లా ప్రధాన అసుపత్రిని ఆసంస్థ 33 సంవత్సరాలు పాటు లీజకు తీసుకొని అక్కడ వైద్య సేవలు అందించేందుకు అదనంగా ప్రత్యేక సిబ్బందిని, ఈ ఆసుపత్రికి తన సొంత నిధులతో ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. ఈతరుణంలో కేంద్ర వైద్యబృందం ఈ ఆసుపత్రిని సందర్శించి ఇక్కడ అందిస్తున్న వైద్యసేవలు, మందుల పంపిణీ, అత్యవసర విభాగం పనితీరు తదితర అంశాలపై ఆరాతీసింది. ముఖ్యంగా పలువార్డులను సందర్శించి వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకొన్నారు. స్వైన్‌ఫ్లూ వార్డును పరిశీలించి ఈజిల్లాలో ఈవ్యాధి ప్రబలడానికి కారణాలపై జిల్లా వైద్యుల నుంచి ఆరాతీసారు. ముఖ్యంగా ఆసుపత్రి పరిసరాల శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖాధికారి విజయగౌరి, అదనపు వైద్యాధికారి వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నేడు శివపార్వతుల కల్యాణం
తిరుపతి, ఫిబ్రవరి 24: శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడానికి టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు ఆర్జిత సేవగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు టిటిడి పి ఆర్వో డాక్టర్ తలారి రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గృహస్తులు అప్పటికప్పుడు రూ. 250 చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చని, గృహస్థులకు లడ్డూ ప్రసాదం బహుమతిగా అందించడం జరుగుతుందన్నారు.
రైలుకింద పడి వ్యక్తి మృతి
పాకాల, ఫిబ్రవరి 24: కదులుతున్న రైలును ఎక్కేప్రయత్నంలో ప్రమాదవశాత్తు అదే రైలు కింద పడి ఓవ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం పాకాల రైల్వేస్టేషన్లో జరిగింది. తిరుపతి నుంచి గుంతకల్లు వెళ్ళే ప్యాసింజర్ రైలు కదులుతుండగా అనంతపురం జిల్లా, నల్లమాడ మండలం, రెడ్డిగుంట తాండాకు చెందిన ముంగే నాయక్ (58) ఎక్కేప్రయత్నం చేశారు. అయితే పట్టుతప్పి రైలు కింద పడిపోయిన ఆయన రెండుకాళ్లు తెగిపోయాయి. వెంటనే 108లో బి.కొత్తకోట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈమేరకు పాకాల రైల్వే పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదినికి 12 లక్షలు విరాళం
తిరుపతి, ఫిబ్రవరి 24: ముంబైలోని జూపిటర్ డైకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ 12లక్షలను విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని డిడి రూపంలో ఆ సంస్థ తరపున ఇండియన్ బ్యాంక్ అధికారి గోపాలక్రిష్ణ శుక్రవారం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి.ఎస్.రవికుమార్‌కు అందించారు. శ్రీవారి మీద భక్తితో మానవసేవ చేయడానికి ముందుకు వచ్చిన ఆసంస్థను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
కపిలతీర్థం వద్ద మహా అంబిక స్తూపం
తిరుపతి, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక కపిల తీర్థం వద్ద అంబిక దర్బాయర్ బత్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7 అడుగుల అంబిక స్తూపాన్ని శుక్రవారం తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 108 దివ్యక్షేత్రాల్లో అంబిక దర్బార్ బత్తి సంస్థ ఆధ్వర్యంలో అంబిక మహాస్తూపాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 36గంటలపాటు నిరంతరాయంగా ఈ మహా అగరుబత్తి వెలుగడం అభినందనీయమన్నారు. అనంతరం కపిల తీర్థం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఆసంస్థ మార్కెటింగ్ మేనేజర్ రాజు, టిడిపి నాయకులు దంపూరి భాస్కర్, ఊట్ల సురేంద్రనాయుడు, మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.